నువ్వులకు కొనసాగుతున్న ధరల ఒరవడి

 


 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలో కొత్త నువ్వుల ప్రారంభం కానున్నాయి. తెల్లనువ్వులు అత్యంత నాణ్యంగా రాణిస్తున్నట్లు సంకేతాలు అందడంతో దక్షిణాది రాష్ట్రాల కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు క్షీణించినందున ధరలు కొంతమేర నెమ్మదించాయి.



రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, శ్రీగంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు కేవలం 4-5 వేల బస్తాల తెల్లనువ్వులు మరియు 2-3 వేల బస్తాల గజ్జర్ నువ్వుల రాబడిపై తెల్లనువ్వులు కొత్త సరుకు 99.1 రూ. 10,400-10,500, 98.2 రకం రూ. 10,300-10,400, 95.5 సరుకు రూ.9900-10,200, గజ్జర్ నువ్వులు రూ. 9200-9400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,400-10,500, కాన్పూర్, ఆగ్రాలో రూ. 10,000-10,100, 99.1 సరుకు గుజరాత్ రకం రూ. 10,550-11,000, సార్టెక్స్ ముంద్రా డెలివరి రూ. 13,500, ముంబై డెలివరి రూ. 13,700, నీమచ్లో 500-600 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 9400-9500, మీడియం రూ. 8800-9100, యావరేజ్ సరుకు రూ. 8400-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 4-5 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 11,000-10,250, మీడియం రూ. 10,700-11,000, యావరేజ్ రూ. 10,500-10,700 మరియు 2-3 వేల బస్తాల నల్లనువ్వులు జడ్ బ్లాక్ రూ. 11,750–12,700, యావరేజ్ రూ. 9750-11,250, క్రషింగ్ రకం రూ. 6500-8000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి, నరసరావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 9800-10,000, హళ్లింగ్ సరుకు తమిళనాడు డెలివరి రూ. 10,200, తూర్పు గోదావరి, చిత్తూరు ప్రాంతాలలో 2-3 వాహనాల నువ్వుల రాబడిపై రూ.8200-8400, పెద్దాపురం సరుకు రూ. 6900-7100, గిద్దలూరులో 1-2 వాహనాలు రూ. 10,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


పశ్చిమ బెంగాల్లోని బెల్టా ప్రాంతంలో మైక్రో-క్లీన్ ఈరోడ్ డెలివరి రూ. 8600-9250 జిఎస్టితో, అన్-క్లీన్ రూ. 7200 ప్రతి క్వింటాలు మరియు ఒంగోలు సరుకు 75 కిలోల బస్తా 33 శాతం నూనె, 1 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు రూ. 8000-8150 (జిఎస్టితో) ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog