ఫిబ్రవరి నుండి కొత్త నువ్వుల రాబడులు

 

01-02-2022

ఎండకాలo సీజన్ కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ 5,25,000 హెక్టార్లలో నువ్వుల పంట విస్తీర్ణాన్ని లక్ష్యంగా నిర్ధారించింది.ఫిబ్రవరి నెలాఖరులో రబీ సీజన్ నువ్వుల రాబడులు ప్రారంభం కాగలవని వ్యాపారులు తెలిపారు. ఈ ఏడాది ఉత్పత్తి తగ్గినప్పటికీ జనవరిలో ధరలు పురోగమించనందున వ్యాపారులు మరియు రైతులు తమ నిల్వ సరుకు విక్రయించడం ప్రారంభించారు. ఎందుకనగా, యాసంగి సేద్యం భారీగా విస్తరించే అవకాశమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితులలో గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ సరుకు సరఫరా ఉండగలదని తెలుస్తోంది. దీనితో ఉత్పాదక రాష్ట్రాలలో ధరలు తగ్గి స్థిరంగా నిలిచాయి.







రాజస్తాన్ లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, గంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు కేవలం 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై తెల్లనువ్వులు రూ. 10,400-10,500, 98.2 రకం సరుకు రూ.10,200-10,300, 95.5 సరుకు రూ. 9400-9500, గజ్జర్ నువ్వులు రూ. 8500-8900 ప్రతి క్వింటాలు మరియు బికనీర్లో 75 కిలోల బస్తా విరుధ్నగర్ డెలివరి (పిబ్రవరి 2 లోడింగ్ కండిషన్) రూ. 7200 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 8-10 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 10,900-11,100, మీడియం రూ. 10,500-10,700, యావరేజ్ రూ. 10,100-10,350 మరియు 2-3 వేల బస్తాల నల్లనువ్వులు జడ్ బ్లాక్ రూ. 11,500-12,500, యావరేజ్ రూ. 9500-11,250, క్రషింగ్ రకంరూ. 6500-8000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గత వారం మధ్య ప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హంగ్ కు రూ. 10,500-10,600, ఆగ్రాలో రూ. 10,100- 10,200, 99.1 సరుకు రూ. 10,700-10,800, సార్టెక్స్ రూ. 11,200-11,300, కాన్పూర్లో హళ్లింగ్ సరుకు రూ. 10,600-10,700, 98.2 సరుకు రూ. 10,700-10,800 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది.


కర్నాటకలోని ముదగల్, అరిసెకేరి, కల్బుర్గి, చిత్రదుర్గ్, మైసూరు ప్రాంతాలలో 75 కిలోల బస్తా నాణ్యమైన సరుకు తమిళనాడు డెలివరి రూ. 7500-8500 మరియు ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి, నరసరావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 9500-9700, హళ్లింగ్ సరుకు తమిళనాడు డెలివరి రూ. 9800-9900 మరియు పశ్చిమ బెంగాల్లో మైక్రో-క్లీన్ ఈరోడ్ డెలివరి రూ. 8800-9300 జిఎస్టితో, అన్-క్లీన్ రూ.7200+7400  ప్రతి క్వింటాలు మరియు ఒంగోలు సరుకు 75 కిలోల బస్తా 33 శాతం నూనె, 1 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు రూ. 8200 (జిఎస్టితో) ధరతో వ్యాపారమై తమిళనాడులోని ఈరోడ్ కోసం రవాణా అవుతున్నది. ఒడిశ్శాలో ప్రతి రోజు 200-300 బస్తాల అన్-గ్రేడ్ సరుకు రాబడిపై రూ. 8000-8200 ధరతో వ్యాపారమై జగదల్పూర్లో నిల్వ కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం