ఆంధ్ర, తమిళనాడులలో కొత్తనువ్వుల రాబడులు

 


లభించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో దినసరి 1000-1500 బస్తాలు, చాగలమర్రి, ఆర్లగడ్డ, మైదుకూరు ప్రాంతాలలో 4-5 వాహనాల కొత్త నువ్వుల రాబడిపై నలుపు రకం రూ. 9,200-9,300, తెల్ల నువ్వులు రూ. 10,500-10,600, విరుధ్నగర్ డెలివరి జిఎస్టి సహా 75 కిలోల బస్తా రూ. 7200, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాలలో 50-100 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9200-9300 ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని శివగిరి ప్రాంతంలో 1500-1600 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా తెల్ల నువ్వులు రూ. 12,490-12,790, నలుపు రకం రూ. 9900-13,600, ఎరుపు రకం రూ.9600-13,100, తిరుకోవిలూరు, కల్లకుర్చి, విరుధాచలం, విల్లుపురం, బో తప్పాడి మొదలగు ఉత్పాదక ప్రాంతాలలో దినసరి 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, 7200-9,000 ధరతో వ్యాపారమైంది.


మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ.10,000-10,100, ఆగ్రాలో హళ్లింగ్ 9800-9900, ఉత్తరప్రదేశ్లోనికాన్పూర్లో రూ. 10,100-10,200, 99.1 గుజరాత్ రకం రూ.11,500-10,400, సార్టెక్స్ రకం ముంద్రా డెలివరి రూ. 11500, ముంబై డెలివరి రూ. 11,600 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 2-3 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 10250-10,500, మీడియం రూ. 9,900-10,100, యావరేజ్ రూ. 9,100-9,350 మరియు 3-4 వేల బస్తాల నల్లనువ్వులు జడ్ బ్లాక్ రూ. 11,125-12,100, మీడియం రూ. 9750-10,500, క్రషింగ్ రకం రూ. 6500-8000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog