స్వల్పంగా పెరిగిన నువ్వుల ధరలు

 



 ప్రస్తుత ఖరీఫ్ ఆగస్టు 19 వరకు దేశంలో నువ్వుల పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12,38,000 హెక్టార్ల నుండి తగ్గి 12,24,000 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 99,758 హెక్టార్ల నుండి తగ్గి 68,807 హె లకు చేరింది. రాజస్థాన్లో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 2,63,760 హెక్టార్ల నుండి పెరిగి 2,84,770 హెక్టార్లకు చేరింది.


ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో హళ్లింగ్ నువ్వులు రూ. 12,100-12,200, 99.1 రకం సరుకు రూ. 12,500, సార్టెక్స్ రూ. 13,200, కాన్పూర్లో హళ్లింగ్ సరుకు రూ. 12,200-12,400, ముంబైలో తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు సాక్స్ రూ. 13,200, ముంద్రా డెలివరి రూ. 13,000, గ్వాలియర్లో హళ్లింగ్ సరుకు బెస్ట్ రూ. 12,100-12,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని నిమచ్లో గత వారం 800-1000 బస్తాల రాబడిపె తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు రూ. 12,000-12,300, మీడియం రూ. 11,600-11,900, యావరేజ్ సరుకు రూ. 11,200-11,500, జాగ్రాలో 500-600 బస్తాలు రూ. 11,800-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని నువ్వుల ఉత్పాదక కేంద్రాలలో గతవారం 1000-1200 బస్తాల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలోతెల్లనువ్వులు రూ. 10,400 - 12,640, నల్ల నువ్వులు రూ.10,500-10,890, 

పశ్చిమబెంగాల్లోని బెల్దా, ఖరగ్ పూర్ ప్రాంతాలలోప్రతి రోజు 6-7 వాహనాల సరుకు అమ్మకంపై నల్లనువ్వులు రూ.8800-9500, అన్-క్లీన్ సరుకు రూ. 8200-8300 ప్రతి క్వింటాలుధరతో వ్యాపారమై ఈరోడ్ కోసం రవాణా అవుతున్నది. తెలంగాణలోని నిజామాబాద్, మెట్పల్లి ప్రాంతాలలో గత వారం 3-4 వేల బస్తాల నువ్వుల రాబడిపై రూ. 11,300-11,700 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. 

ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో గత వారం 4-5 వాహనాల సరుకు రాబడిపై రూ. 9500-10,000 ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, సామర్లకోట ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది. కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాల లో ఎర్రనువ్వులు రూ. 10,500-10,600, నరసారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో రూ. 9500-10,500 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు 75 కిలోల బస్తా విరుధ్నగర్ డెలివరి రూ.8300 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog