తగ్గిన బెల్లం రాబడులు - పెరుగుతున్న ధరలు
దేశంలో శుభ ముహూర్తాలు ప్రారంభమైన వేళ బెల్లం వినియోగం పెరగగలదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గత వారం కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు ఊపందుకున్నందున నాణ్యమైన రకాల ధర ప్రతి క్వింటాలుకు రూ. 250-300, మీడియం రూ. 75-100 ఎగబాకింది.
ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో ఏప్రిల్ 24 వరకు బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 15,40,849 నుండి తగ్గి 12,10,540 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం నిల్వలు 9,14,490 నుండి తగ్గి 6,49,701, రాబిటన్ 2,68,355 నుండి 2,52,157, చదరాలు 1,19,637 నుండి 87,826, పాపిడి 1,71,002 నుండి 1,47,149, కురుపా 28,635 నుండి 27,528 కు తగ్గగా, రస్కట్ 36,820 నుండి పెరిగి 44,626, లడ్డు బెల్లం 751 నుండి 1290 బస్తాలకు చేరాయి.
ముజఫర్ నగర్లో గత వారం 8-10 వేల బస్తాల సరుకు రాబడి కాగా చాకూ బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1320-1501, కురుపా రూ. 1325, లడ్డు బెల్లం రూ. 1545, పొడి బెల్లం రూ. 1525, రస్కట్ రూ. 1135 మరియు పాప్ 100 కిలోలు రూ. 3300-3400, హాపూర్లో 10-12 వాహనాల కొత్త బెల్లం రాబడిపై రూ. 1360-1380 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మార్కెట్లో గత వారం 7-8 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబి రూ. 4350-4400, మీడియం రూ. 4000-4100, నలుపు రకం రూ. 3400-3500, చిత్తూరులో 18-20 వాహనాల కొత్త బెల్లం సురభి రకం రూ. 4400, సూపర్-ఫెన్ రూ. 4700, సాట్నా రకం రూ. 4300, నలుపు రకం రూ. 4000-4200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్ర లాతూర్లో గత వారం 15-16 వేల దిమ్మల బెల్లం రాబడిపై సురభి నాణ్యమైన సరుకు రూ. 3750-3800, మీడియం రూ. 3500-3550, సోలాపూర్ 6-7 వేల దిమ్మలు సురభి నాణ్యమైన సరుకు రూ. 3900-3950, మీడియం రూ.3600-3750, ఎరుపు రకం రూ. 3450-3550, సాంగ్లీలో 3-4 వేల దిమ్మల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభి రూ. 3500-3650, గుజరాత్ రకం రూ.3700-3750, ముంబై రకం రూ. 3600-3850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యా మార్కెట్లో గత వారం 10-12 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3700, సింగల్ ఫిల్టర్ రూ. 3900, డబుల్ ఫిల్టర్ రూ. 4100, చద రాలు రూ. 4350-4400, మహాలింగపూర్లో 5-6 వాహనాలు సురభి రకం రూ. 3550-3600, ఎరుపు రకం రూ. 3400-3550, గుజరాత్ రకం రూ. 3600-3650, చదరాలు రూ.3750-3800, శిమోగాలో 14-15 వాహనాలు దేశీ బెల్లం రూ. 3700-3750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు