హోళీ డిమాండ్ తో ఇనుమడిస్తున్న బెల్లం ధరలు

 


గత వారం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్, హాపూర్, రూర్కీ, మీరట్,జహంగీరాబాద్, ఖతోలి ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 300 వాహనాల బెల్లం రాబడి అయినప్పటికీ హోళీ పండుగ డిమాండ్ కోసం పంజాబ్, హర్యాణా,రాజస్తాన్ నుండి నెలకొన భారీ డిమాండ్తో పాటు స్థానిక డిమాండ్ కూడా వృద్ధి చెందుతోంది. మార్కెట్లలో రాబడి అయిన సరుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు గుజరాత్ కోసం రవాణా అవుతున్నది. ఫలితంగా ధరలకు మద్దతు లభిస్తున్నది.


 ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో ఫిబ్రవరి 26 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 10,36,930 బస్తాల నుండి 3,73,427 బస్తాలు తగ్గి 6,63,503 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,98,577 బస్తాల నుండి తగ్గి 3,90,569 బస్తాలు, రస్కట్ 49,240 బస్తాల నుండి 14,652 బస్తాలు, కురుపా 14,307 బస్తాల నుండి 11,101 బస్తాలు, చదరాలు 55,463 బస్తాల నుండి 36,919 బస్తాలు, రాబిటన్ 1,74,425 బస్తాల నుండి 1,62,463 బస్తాలు, పాపిడి 1,44,573 బస్తాల నుండి తగ్గి 47,292 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.


ముజఫర్ నగర్లో గత వారం 30-32 వేల బస్తాల రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1120-1202, కురుపా రూ.1060-1070, లడ్డు రూ. 1160-1175, రస్కట్ 1000-1015, పౌడర్ బెల్లం రూ. 1240-1271 మరియు హాపూర్లో 60-65 వాహనాలు దిమ్మల బెల్లం రూ. 1000-1050 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 75-80 వాహనాల సరుకు రాబడిపై 40-45 వాహనాల సరుకు అమ్మకం కాగా ఎరుపు- సురభి మిక్స్ రూ. 2650-2700 ప్రతి క్వింటాలు ధరతో  వ్యాపరమయింది.


మహారాష్ట్రలోని లాతూర్ లో గత వారం 20-22 వేల దిమ్మల బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ.270-2750, ఎరుపు-నలుపు మిక్స్ రూ.2550-2570, సోలాపూర్ లో 18-20 వేల దిమ్మలు సురభి రకం రూ. 2650-2700, ఎరుపు నలుపు మిక్స్ రూ.2500-2550, సాంగ్లీలో 10-12 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ. 3400-3600, గుజరాత్ రకం రూ. 3300-3500, ముంబై రకం రూ. 3400-3800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్నాటకలోని మాండ్యాలో గత వారం 40-45 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 2800, సింగల్ ఫిల్టర్ రూ. 2900, డబుల్ ఫిల్టర్ రూ. 3000, చదరాలు రూ. 3150-3200, మహాలింగపూర్లో 6-7 వాహనాలు సురభి, తెలుపు రకం రూ. 3300–3350, గుజరాత్ రకం రూ. 3350-3400, బాక్స్ రకం రూ. 3450, అరకిలో ముక్కలు రూ. 3500, శిమోగాలో 15-16 వాహనాలు దేశీ బెల్లం రూ. 3500-3550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 60-65 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3150-3200, మీడియం రూ. 2950-3000, నలుపు రూ. 2450-2500 మరియు చిత్తూరులో 30-35 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 3500, సూపర్-ఫైన్ రూ. 4000, సాట్నా రకం రూ. 3200, నలుపు రూ. 2600 ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని సేలం మార్కెట్లో గత వారం 9-10 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు 30 కిలోలు రకం రూ. 1180-1200, సురభి రకం సరుకు రూ. 1170–1190, ఎరుపు రకం రూ.1140-1160, పిలకలపాలయంలో 4-5 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1080-1100, సురభి రకం రూ. 1050-1070, ఎరుపు రూ. 1030-1050 మరియు వెల్లూరులో 5-6 వాహనాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 3900-4000, మీడియం రూ. 3450-3500, నలుపు రకం రూ. 2600-2650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు