దేశంలో పంచదార మరియు ఎథనాల్ ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో బెల్లం ఉత్పత్తి తగ్గే అవకాశం కనిపిస్తున్నది. అయితే, రెండేళ్లుగా బెల్లం ధరలు పెరగనందున, రైతులు సరుకు తయారైన వెంటనే విక్రయిస్తున్నారు. దీనితో దక్షిణ కర్నాటక మొదలుకొని ఉత్తర కర్నాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 200 లారీలు, ఆంధ్రలో 150, మహారాష్ట్రలో 175 - 200 లారీలు మరియు మధ్య ప్రదేశ్లో 200 లారీల సరుకు రాబడి అవుతున్నది. దీనితో సరఫరా పెరగడంతో ధరలు పెరగడంలేదు. అయితే, ఉత్తర ప్రదేశ్ కోల్డుస్టోరేజీలలో తక్కువగా సరుకు నిల్వ అయింది మరియు ఈ ఏడాది సీజన్ త్వరగా సమాప్తమయ్యే అవకాశం కలదు. దీనితో భవిష్యత్తులో ధరల పెరుగుదలకు అవకాశముంది.
ముజఫర్ నగర్ కోల్డుస్టోరేజీలలో 7, ఫిబ్రవరి వరకు బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7,25,171 బస్తాల నుండి 3,08,936 బస్తాలు తగ్గి 4,16,235 బస్తాలకు చేరాయి. ఇందులో చాకూ బెల్లం గత ఏడాదితో పోలిస్తే 4,37,549 బస్తాల నుండి తగ్గి 2,49,444 బస్తాలకు, రస్కట్ 39,548 బస్తాల నుండి తగ్గి 11,168 బస్తాలకు, ఖుర్వా 10,187 బస్తాలనుండి తగ్గి 4,453 బస్తాలకు, చదరాలు 22,830 బస్తాల నుండి తగ్గి 19,951 బస్తాలకు, రాబటీన్ 1,44,613 బస్తాల నుండి తగ్గి 96,357 బస్తాలకు, పార్థీ 70,444 బస్తాల నుండి తగ్గి 34,862 బస్తాలకు చేరింది.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో గతవారం ఎన్నికల నేపథ్యంలో కేవలం 25-30 బస్తాల రాబడిపై చాకూ రూ. 1110-1240, ఖుర్పా రూ. 1100-1120, లడ్డూ రూ. 1200-1260, రస్కట్ రూ. 1000-1021, పౌడర్ రూ. 1300-1320 మరియు హాఫుడ్లో 5-6 లారీల రాబడిపై బకెట్ రూ. 1050–1080 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమయింది.
మధ్య ప్రదేశ్లోని కరేలీలో సోమ, శుక్రవారాలలో కలిసి 40-45 లారీల రాబడిపై రూ. 2600-2800 మరియు నరసింగాపూర్లో గురువారం 40-50 లారీల రాబడిపై ఎరుపు-పసుపు మిక్స్ రూ. 2650-2700 ధరతో వ్యాపారమయింది మరియు ఇతర ప్రాంతాలలో ధరలు స్థిరంగా ఉన్నాయి.
మహారాష్ట్రలోని లాతూరులో దినసరి 8-10 వేల దిమ్మల రాబడిపై రంగు సరుకు రూ. 2800-2850, ఎరుపు - నలుపు మిక్స్ రూ. 2400-2450, సోలాపూర్లో దినసరి 3-4 వేల దిమ్మల రాబడిపై రంగు సరుకు రూ. 2850–2900, మీడియం రూ. 2700-2750, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2600-2650, సాంగ్లీలో 4-5 వేల దిమ్మల రాబడిపై కొత్త రంగు సరుకు రూ. 3500-3700, గుజరాత్ రకం రూ. 3400-3600, ముంబాయి రకం రూ. 3500-3750 ధరతో వ్యాపారమయింది.
అనకాపల్లిలో దినసరి 14-15 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై నాణ్యమైన గులాబీ రూ. 3200-3250, మీడియం రూ. 2950-3000, నలుపు రూ. 2550-2600, చిత్తూరులో 5-6 లారీల ఎసి సరుకు రాబడిపై నాణ్యమైన రంగు సరుకు రూ. 4100-4200, మీడియం రూ. 3600-3700, నలుపు రూ. 2800-2900 ధరతో వ్యాపారమయింది.
తమిళనాడులోని సేలం మార్కెట్లో గతవారం 10 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు రూ. 1200-1220, రంగు సరుకు రూ. 1170-1190, ఎరుపు రూ. 1160-1180, పిలకలపాలయంలో 3-4 వేల బస్తాల రాబడిపై తెలుపు రూ. 1100–1120, రంగు సరుకు రూ. 1080-1100, ఎరుపు 1050-1070 ప్రతి 30 కిలోల ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు