గత వారం బెల్లం ఉత్పాదక కేంద్రాల వద్ద ఉగాది సందర్భంగా నాణ్యమైన సరుకుకు డిమాండ్ రావడం వలన ధర రూ. 150-200 వృ ద్ధిచెందగా, ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి.ముజఫర్నగర్ కోల్డ్ స్టోరేజీలలో నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి.అయితే ఇతర రాష్ట్రాల వ్యాపారులు సీజన్ ప్రారంభంలో సరుకు కొనుగోలు చేసి ఎసిలలో నిల్వ చేసిన సరుకును విక్రయిస్తున్నందున ఉత్పాదక రాష్ట్రాలలో గిరాకీ తక్కువగా ఉంది. అయితే జూలై నుండి పెరుగుదలకు అవకాశం ఉంది.ఎందుకనగా ఇంతవరకు వినియోగ కేంద్రాలలో నిల్వ అయిన సరుకు నుండి 70-75 శాతం అమ్మకం కావచ్చు. మరియు జూలై నుండి నవంబర్ వరకు పండుగల సీజన్లో వినియోగం పెరిగే అవకాశం కలదు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ లోని శీతల గిడ్డంగులలో మార్చి 28 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 14,28,470 బస్తాల నుండి 1,94,570 బస్తాలు తగ్గి 12,33,900 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూ బెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8,39,990 బస్తాల నుండి తగ్గి 7,21,005 బస్తాలు, రస్కట్ 60,760 బస్తాల నుండి 26,338 బస్తాలు, పాప్ 1,99,707 బస్తాల నుండి తగ్గి 1,08,513 బస్తాలు, చదరాలు 1,09,857 బస్తాల నుండి 1,11,301 బస్తాలు, కురుపా 20,575 బస్తాల నుండి పెరిగి 23,447 బస్తాలు, రాబిటన్ 1,95,001 బస్తాల నుండి 2,41,531 బస్తాలు, లడ్డూ 318 బస్తాల నుండి పెరిగి 751 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
ఆర్థిక సంవత్సర ముగింపు లెక్కల కారణంగా అనేక మార్కెట్లు మూసి ఉండడంతో ముజఫర్నగర్లో గత సోమవారం నుండి బుధవారం వరకు సుమారు 17-18 వేల బస్తాల బెల్లం రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1125-1335, కురుపా రూ. 1100-1110, లడ్డు రూ. 1225-1250, రసకట్ 1000-1055, పౌడర్ బెల్లం రూ. 1300-1320 మరియు హాపూర్లో25-30 వాహనాలు బెల్లం రాబడిపై బకెట్ బెల్లం రూ. 1050-1095 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో గత సోమ, మంగళ వారాలలో కలిసి 18-20 వేల దిమ్మల బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 2700-2750, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2600-2650, సోలాపూర్లో 10-12 వేల దిమ్మలు సురభి రకం రూ.2850-2900, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2650-2700, సాంగ్లీలో 8-10 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ. 3400-3600, గుజరాత్ రకం రూ. 3500–3550, ముంబై రకం రూ. 3700-3800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 30-35 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ.2900, సింగల్ ఫిల్టర్ రూ. 3100, డబుల్ ఫిల్టర్ రూ. 3400, చదరాలు రూ. 3700, మహాలింగపూర్లో సోమవారం నాడు 2-3 వాహనాలు సురభి, తెలుపు రకం రూ. 3300-3350, గుజరాత్ రకం రూ. 350-3400, బాక్స్ రకం రూ. 3400-3450, అరకిలో ముక్కలు రూ. || 3600, శిమోగాలో 15-16 వాహనాలు దేశీ బెల్లం రూ. 3500-3550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 35-40 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3150-3200, మీడియం రూ. 2950-3000, నలుపు రూ. 2500-2525 మరియు చిత్తూరులో 30-35 వాహనాల ఎసి సరుకు రాబడిపై లడ్డూ రకం రూ. 3300, సూపర్-ఫైన్ రూ. 3900, సాట్నా రకం రూ. 3100, నలుపు రూ. 2600 ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని సేలం మార్కెట్లో గత గురువారం 5 వేల బస్తాల బెల్లం రాబడిపై రూ. తెలుపు 30 కిలోలు రకం రూ. 1210-1220, సురభి రకం కు రూ.1190-1210, ఎరుపు రకం రూ. 1180-1200, పిలకలపాలయంలో 4 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1170-1190, సురభి రకం రూ. 1160-1170, ఎరుపు రూ. 1120-1140 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు