బెల్లానికి ఉజ్జ్వల భవిష్యత్తు




 దేశంలో పంచదార ఉత్పత్తి తగ్గినందున ప్రస్తుతం వేసవి తాపం అధికమైన నేపథ్యంలో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఏప్రిల్ 2023 నుండి 2024 దీపావళి వరకు 18 నెలల కాల వ్యవధిలో బెల్లం ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉండగలదని వ్యాపారులు అంచనా. వేస్తున్నారు. పంచదార ధరలు పెరగడం మరియు రాబోవు పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండడంతో పాటు మిల్లులచే చెరకు కొనుగోళ్లు పెరగడం వలన బెల్లం ఉత్పత్తి ప్రభావితం కావచ్చు. 


ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో ఏప్రిల్ 17 వరకు బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే, 15,07,415 బస్తాల నుండి 3,14,462 బస్తాలు తగ్గి 11,92,953 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూ బెల్లం 8,89,625 నుండి 2.50 లక్షల బస్తాలు తగ్గి 6,39,674, రాబిటన్ 2,68,355 నుండి 2,45,758, చదరాలు 1,19,637 నుండి తగ్గి 87,826, పాప్ 1,63,902 నుండి 46,349, కురుపా 28,333 నుండి 27,528 తగ్గగా, రసికట్ 35,669 నుండి పెరిగి 44,265, లడ్డు బెల్లం 751 నుండి 1290 బస్తాలకు చేరాయి.

ముజఫర్ నగర్ గత వారం 10-12 వేల బస్తాల సరుకు రాబడి కాగా చాకూ బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1250–1470, కురుపా రూ. 1250-1270, లడ్డు బెల్లం రూ. 1430-1441, పొడి బెల్లం రూ. 1480-1500, రస కట్ రూ. 1120 మరియు పాప్ 100 కిలోలు రూ. 3150-3200, హాపూర్లో 18-20 వాహనాల కొత్త బెల్లం రాబడిపై రూ. 1250-1280 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది.

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి మార్కెట్లో గత వారం 10 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబి రూ. 4250-4300, మీడియం రూ. 3700-3800, నలుపు రకం రూ. 3300-3350, చిత్తూరులో 8-10 వాహనాల కొత్త బెల్లం సురభి రకం రూ. 4200, సూపర్-ఫెన్ రూ. 4300, సాట్నా రకం రూ. 3600, నలుపు రకం రూ. 2850-2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్ర లాతూర్ లో గత వారం 12-13 వేల దిమ్మల బెల్లం రాబడిపై సురభి నాణ్యమైన సరుకు రూ. 3700-3750, మీడియం రూ. 3450-3550, సోలాపూర్లో 6-7 వేల దిమ్మలు సురభి నాణ్యమైన సరుకు రూ. 3850-3950, మీడియం రూ. 3600-3700, ఎరుపు రకం రూ. 3400-3500, సాంగ్లీలో 14-15 వేల దిమ్మల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభి రూ. 3500-3600, గుజరాత్ రకం రూ.3600-3700, ముంబై రకం రూ. 3500-3800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని మాండ్యా మార్కెట్లో గత వారం 18-20 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3400, సింగల్ ఫిల్టర్ రూ. 3700, డబుల్ ఫిల్టర్ రూ. 4000, చదరాలు రూ. 4050-4100, మహాలింగపూర్లో 6-7 వాహనాలు సురభి రకం రూ. 3600-3650, ఎరుపు రకం రూ. 3400-3500, గుజరాత్ రకం రూ. 3650-3675, చదరాలు రూ. 3750-3800, శిమోగాలో 15-16 వాహనాలు దేశీ బెల్లం రూ. 3600-3650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలం మార్కెట్లో 2 వేల దిమ్మలు తెలుపు రకం ప్రతి 30 కిలోలు

రూ. 1300 – 1320, సురభి రూ. 1280-1300, ఎరుపు రకం రూ. 1270-1290, పిలకలపాలయంలో గత వారం 6 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1260-1280, సురభి రూ. 1240–1260, ఎరుపు రకం రూ. 1220-1240 ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog