బెల్లం ధరలకు కొనసాగుతున్న ఒరవడి

 



ప్రస్తుతం నెలకొన్న పండుగల సీజన్తో పాటు నిల్వలు శరవేగంతో అడుగంటుతున్నందున గడిచిన హైదరాబాద్ కొన్ని వారాలుగా బెల్లం ధరలు దూసుకుపోతున్నాయి. అయితే, ప్రముఖ బెల్లం ఉత్పాదక ప్రాంతాలలో తయారీ ప్రక్రియ జోరందుకున్నందున రాబడులు పోటెత్తి పెరుగుతున్న ధరలకు కళ్లెం పడగలదని వ్యాపారులు భావిస్తున్నారు.


గతంలో పంచదార మిల్లులకు, రిఫైనరీలకు మరియు ఎగుమతి వ్యాపారులకు ముడిపంచదారను మాత్రమే ఎగుమతి చేసేందుకు కేంద్ర సర్కారు అనుమతించింది. అటు తర్వాత ఆగస్టు 17 న పంచదార ఎగుమతి నియమావళిని సడలిస్తూ రిఫైండ్ పంచదార ఎగుమతులకు కూడా పచ్చ జెండా ఊపింది. తద్వారా పంచదార ధరల ప్రభావం బెల్లం ధరలకు కూడా సోకింది. గత వారం ముజఫర్ నగర్ లో 60-65 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై చాకూబెల్లం రూ. 3200-3500, చదరాలు రూ. 3150-3160, పాపి రూ.3200-3250, రస్కట్ రూ. 3000-3100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో ఆగస్టు 15 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6,06,257 బస్తాల నుండి పెరిగి 8,55,231 బస్తాలకు చేరాయి. ఇందులో చాకూబెల్లం 3,89,729 బస్తాల నుండి పెరిగి 4,54,951 బస్తాలు, కురుపా 6627 బస్తాల నుండి 9930 బస్తాలు, రాబిటన్ 38, 405 బస్తాల నుండి 1,88,561 బస్తాలు, లడ్డూ బెల్లం 690 బస్తాలు, చదరాలు 41,101 బస్తాల నుండి 45,724 బస్తాలు, పాపి 87,075 బస్తాల నుండి 1,29,787 బస్తాలకు చేరగా, రస కట్ 41,962 బస్తాల నుండి తగ్గి 24,739 బస్తాలకు పరిమితమయ్యాయి.


ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మార్కెట్లో గత వారం 6-7 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభిర రకం రూ. 4400-4500, మీడియం రూ. 3800-4000, నల్లబెల్లం రూ. 2750-2800, చిత్తూరులో 15-20 వాహనాల సరుకు అమ్మకం కాగా, సురభి రకం రూ. 4100, సూపర్-ఫెన్ రూ. 4400, సాట్నా రకం రూ. 3500, నలుపు రకం రూ. 2600-2650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యా మార్కెట్లో గత వారం 40-45 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3200, సింగల్ ఫిల్టర్ రూ. 3400, డబుల్ ఫిల్టర్ రూ. 3500, చదరాలు రూ. 3600, మహాలింగపూర్లో 5-6 వాహనాల సరుకు అమ్మకంపై సురభి మరియు గుజరాత్ రకం రూ. 3500-3600, బాక్స్ రకం రూ.3600-3650, నాణ్యమైన దేశీ సరుకు రూ. 3700-3900, శిమోగాలో 15-16 వాహనాలు దేశీ బెల్లం రూ.3800-3850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్లో 8-10 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభి రకం నాణ్యమైన సరుకు రూ.3350-3400, మీడియం రూ. 3100-3200, ఎరుపు రకం రూ.3050-3150, సోలాపూర్లో 10-12 వేల దిమ్మలు నాణ్యమైన సురభి సరుకు రూ.3250-3300, మీడియం రూ. 3100–3125, సాంగ్లీలో 7-8 వేల దిమ్మల సరుకు రాబడిపై సురభి రకం రూ. 3500, గుజరాత్ రకం రూ.3600-3800 ముంబై రకం రూ. 30-35 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలం మార్కెట్లో 8–10 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు రకం 30 కిలోలు రకం రూ.11001430, సురభి రకం సరుకు రూ. 1380-1400, ఎరుపు రకం రూ. 1360-1380, పిలకలపాలయంలో 6 వేల బస్తాలు సరుకు రాబడిపై తెలుపు రూ.1300-1320, సురభి, రూ. 1270-1290, ఎరుపు రకం 2018 డ్, కౌందప్పాడి ప్రాంతాలలో గత వారం 8-10 వేల 5 బస్తాల సరుకు రాబడిపై రూ. 1380-1410, సురభి రకం రూ. 1370-1400, ఎరుపు రకం రూ. 1350-1380 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog