మందగమనం లో బెల్లం ధరలు

 


 దేశంలో గణనీయమైన చెరకు ఉత్పత్తి, వచ్చే సీజన్ లో భారత్ నుండి పంచదార ఎగుమతులు కుంటుపడే అవకాశం ఉన్నందున బెల్లం భారీ ఉత్పత్తితో పాటు కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నది. ఈ ఏడాది స్టాకిస్టులకు అన్ని సరుకులకు ధీటుగా బెల్లంపై లాభాలు గడించే అవకాశం లేదని చెప్పవచ్చు. ఎడతెరిపి లేకుండా రైతుల సరుకు సరఫరా కావడం వలన పెరుగుతున్న ధరలకు కళ్లెం పడగలదు. స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచరు. 


ఇలాంటి పరిస్థితులలోట్రేడింగ్ వ్యాపారమే శ్రేయస్కరమని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో మరో వారం పది రోజులలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి.ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో గత వారం 60-65 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకమైనందున బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2.60 లక్షల బస్తాలకు పరిమితమయ్యాయి త్వరలో కొత్త సీజన్ ప్రారంభం కానున్నది. తద్వారా ధరలు మందగించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి మార్కె ట్లో గత వారం 8-10 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభి రకం రూ. 3800-3900, గులాబి రూ. 3500-3600, నల్ల బెల్లం రూ. 3100-3120, చిత్తూరులో 14-15 వాహనాల సరుకు అమ్మకం కాగా, సురభి రకం రూ. 3700, సూపర్-ఫెన్ రూ. 4000, సాట్నా రకం రూ. 3300, నలుపు రకం రూ. 2250 ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని మాండ్యా మార్కెట్లో గత వారం 50-60 వాహనాల సరుకు రాబడి పై ఎరుపు రకం రూ. 3150, సింగల్ ఫిల్టర్ రూ. 3250, డబుల్ ఫిల్టర్ రూ. 3400, చదరాలు రూ. 3450, మహాలింగపూర్ లో 8-10 వాహనాల సరుకు అమ్మకంపై సురభి మరియు గుజరాత్ రకం రూ. 3400-3600, మీడియం రూ. 3200-3300, బాక్స్ రకం రూ. 3500-3550, నాణ్య మైన దేశీ సరుకు రూ. 3650, శిమోగాలో 20-22 వాహనాలు దేశీ బెల్లం రూ. 3700-3750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్లో 10-12 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభి రకం నాణ్యమైన సరుకు రూ. 3400-3500, మీడి యం రూ. 3100-3200, సోలాపూర్ లో 7-8 వేల దిమ్మలు నాణ్యమైన సురభి సరుకు రూ. 3400-3500, మీడియం రూ. 3100-3200, సాంగ్లీలో 10-12 వేల దిమ్మల సరుకు రాబడిపై సురభి రకం రూ. 3500-3550, గుజరాత్ రకం రూ. 3500-3600 ముంబె రకం రూ. 3500-3750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని సేలం మార్కెట్లో 3 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు రకం 30 కిలోలు రకం రూ.1280-1300, సురభి రకం సరుకు రూ. 1260-1280, ఎరుపు రకం రూ. 1240-1269, పిలకలపాలయంలో 4-5 వేల బస్తాలు సరుకు రాబడి పై తెలుపు రూ. 1179-1190, సురభి రూ. 1160-1180, ఎరుపు రకం రూ. 1140-1160, చిత్తోడ్లో 9500 బస్తాల సరుకు రాబడి పై తెల్ల బెల్లం రూ. 1200-1220, సురభి రకం రూ. 1180-1200, ఎరుపు రకం రూ. 1160-1180 మరియు కౌంద ప్పా డిలో 7 వేల బస్తాల పౌడర్ బెల్లం రాబడి కాగా, పౌడర్ బెల్లం రూ. 1150-1200,వెల్లూరు వారాంతపు సంతలో 3-4 వాహనాల బెల్లం రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4700-5000, మీడియం రూ. 3500-4000 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog