బెల్లం ఉత్పత్తి పెరిగినప్పటికీ భవిష్యత్తుకు డోకా లేదు

 

గత వారం దేశంలోని బెల్లం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు పోటెత్తి ఉత్తర ప్రదేశ్, హర్యాణా, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు ఒడిశ్శాలోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి 900-1000 వాహనాల బెల్లం రాబడి అయినట్లు వ్యాపారులు తమ అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ధరలు తమ స్థానాన్ని పదిలపరచుకున్నాయి. ఎందుకనగా, ఈసారి ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తి తగ్గినందున అన్ని రాష్ట్రాల స్టాకిస్టులు ఒంటికాలిపై లేచారు. 



ఈ ఏడాది చెరకు ఉత్పత్తి గణనీయంగా ఉన్నందున రైతులు తమ సరుకును పూర్తి స్థాయిలో విక్రయించడంలో విఫలమవుతున్నారు. మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాలలో పొలాలలోనే చెరకు ఎండిపోతున్నది. మిల్లులు సరుకు కొనుగోలు చేసేందుకు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. దీనిని బట్టి రాబోయే సీజన్లో చెరకు తగ్గించేందుకు రైతులు యోచిస్తున్నారు. అయితే, అమ్మకం కాని చెరకుతో రైతులు బెల్లం తయారీ చేపడుతున్నారు. కరోణా మహమ్మారి విజృంభణతో ఉపశమనం పొందినందున రాబోయే అన్ని పండుగల కోసం బెల్లం వినియోగం ఇనుమడించగలదని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ ఏడాది బెల్లానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లోని శీతల గిడ్డంగులలో ఫిబ్రవరి 21 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9,18,445 బస్తాల నుండి 3,82,809 బస్తాలు తగ్గి 5,35,636 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,39,611 బస్తాల నుండి తగ్గి 3,17,148 బస్తాలు, రస్కట్ 45,264 బస్తాల నుండి 11,168 బస్తాలు, కురుపా 11,492 బస్తాల నుండి 7,465 బస్తాలు, చదరాలు 39,783 బస్తాల నుండి 24,097 బస్తాలు, రాబిటన్ 1,63,855 బస్తాల నుండి 1,38,111 బస్తాలు, పాప్ 1,18,440 నుండి 37,487 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.


ముజఫర్నగర్లో గత వారం 35-40 వేల బస్తాల రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1120-1200, కురుపా రూ. 100 -1080, లడ్డు రూ.1130-1150, రసకట్ 1000-1030, పౌడర్ బెల్లం రూ.1210-1221 మరియు హాపూర్లో 70-75 వాహనాలు దిమ్మల బెల్లం రూ. 1000-1060 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 55-60 మరియు జబల్పూర్, ఇటార్సి లాంటి ప్రాంతాలలో కలిసి సుమారు 150 వాహనాల సరుకు రాబడిపై రూ.2550-2650, నర్సింగ్పూర్లో గురువారం 25-30 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు-సురభి మిక్స్ రూ. 2550-2700 మరియు మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 60-65 వేల దిమ్మల బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ.2750-2800, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2550–2600, సోలాపూర్లో 20-22 వేల దిమ్మలు సురభి రకం రూ. 2700–2800, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2550-2600, సాంగ్లీలో 18-20 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ. 3400-3500, గుజరాత్ రకం రూ. 3350-3450, ముంబై రకం రూ. 3500-3600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్నాటకలోని మాండ్యాలో గత వారం 75-80 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 2700-2750, సింగల్ ఫిల్టర్ రూ. 2850–2900, డబుల్ ఫిల్టర్ రూ. 2950-3000, చదరాలు రూ. 3150-3200, మహాలింగపూర్లో 8-10 వాహనాలు సురభి, తెలుపు, గుజరాత్ రకం రూ.3300-3400, అరకిలో ముక్కలు రూ. 3450, శిమోగాలో 20-22 వాహనాలు దేశీ బెల్లం రూ. 3450-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 75-80 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3000–3050, మీడియం రూ.2900-2950, నలుపు రూ.2400-2420 మరియు చిత్తూరులో 25–30 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 3400-3500, సూపర్-ఫైన్ రూ. 3900-4000, సాట్నా రకం రూ. 3200-3300, నలుపు రూ.2650-2700 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలం మార్కెట్లో గత వారం 8-9 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు 30 కిలోలు రకం రూ. 1180–1200, సురభి రకం సరుకు రూ. 1160-1180, ఎరుపు రకం రూ. 1130-1150, పిలకలపాలయంలో 5-6 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1130-1159, సురభి రకం రూ. 1100-1120, ఎరుపు రూ. 1060-1080 మరియు వెల్లూరులో 4-5 వాహనాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4000, మీడియం రూ. 300-3500, నలుపు రకం రూ. 2600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog