బెల్లం రాబడులు తగ్గడంతో ధరలు పటిష్ఠం

 

గత వారం ఉత్పాదక కేంద్రాలలో తీవ్ర ఎండల కారణంగా బెల్లం తయారీకి అవరోధంగా ఉంది. దీనితో మార్కెట్లలో రాబడులు తగ్గడంతో మరియు వివాహాల సీజన్ కోసం కిరాణా వ్యాపారుల డిమాండ్తో ధర రూ. 75-100 వృద్ధి చెందింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో 18 ఏప్రిల్ నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 15,22,172 బస్తాల నుండి 14,757 బస్తాలు తగ్గి 15,07,415 బస్తాలకు పరిమితమయ్యాయి.


 ఇందులో చాకూ బెల్లం 9,07,816 బస్తాలనుండి తగ్గి 8,89,625 బస్తాలు, రస్కట్ 63,291 నుండి తగ్గి 35,669 బస్తాలకు, పాపి 2,04,156 నుండి తగ్గి 1,63,902 బస్తాలకు చేరాయి. అయితే కుర్పా బెల్లం గత ఏడాదితో పోలిస్తే 20,575 బస్తాల నుండి పెరిగి 28,333 బస్తాలకు, చదరాలు 1,11,699 నుండి పెరిగి 1,19,637 బస్తాలకు, రబ్న్ 2,11,961 నుండి పెరిగి 2,68,355 బస్తాలకు, లడ్డూ 412 బస్తాల నుండి పెరిగి 751 బస్తాలకు చేరింది. మరియు గత సోమవారం నుండి శుక్రవారం వరకు సుమారు 15-16 వేల బస్తాల బెల్లం రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1125-1345, కురుపా రూ. 1200-1240, లడ్డు రూ. 1140, రస్కట్ 1020-1030, పౌడర్ బెల్లం రూ. 1230-1250 మరియు హాపూర్లో 24-25 వాహనాలు బెల్లం రాబడిపై బకెట్ బెల్లం రూ. 1050–1110 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. 

మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్లో గతవారం 20-25 వేల దిమ్మలు, సోలాపూర్లో 18-20 వేల దిమ్మలు సురభి రకం రూ. 2900–3050, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2750–2800, సాంగ్లీలో 20-22 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ.3200-3450, గుజరాత్ రకం రూ. 3350–3550, ముంబై రకం రూ. 3350-3650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని మాండ్యాలో గతవారం 20-22 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 2900-3000, సింగల్ ఫిల్టర్ రూ. 3200, డబుల్ ఫిల్టర్ రూ. 3650, చదరాలు రూ.3850-3900, మహాలింగపూర్లో 14-15 వాహనాలు సురభి రూ.3400-3500, గుజరాత్ రకం రూ. 3340-3380, చదరాలు రూ. 3500–3550, అరకిలో ముక్కలు రూ. 3600, శిమోగాలో 18-20 వాహనాలు దేశీ బెల్లం రూ. 3550–3600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 25 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3650-3700, మీడియం రూ. 3400-3500, నలుపు రూ. 2600 మరియు చిత్తూరులో 30-35 వాహనాల ఎసి సరుకు రాబడిపై లడ్డూ రకం రూ. 3700, సూపర్-ఫైన్ రూ. 4000, సాట్నా రకం రూ. 3200, నలుపు రూ. 2600 ధరతో వ్యాపారమైంది.

తమిళనాడులోని సేలం మార్కెట్లో గతవారం 4 వేల బస్తాల బెల్లం రాబడిపై రూ. తెలుపు 30 కిలోలు రకం రూ.1230-1240, సురభి రకం సరుకు రూ. 1200–1220, ఎరుపు రకం రూ.1180-1200, పిలకలపాలయంలో 2500 బస్తాలు తెలుపు రకం రూ.1200-1280, సురభి రకం రూ. 1160-1180, ఎరుపు రూ. 1120-1140 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog