గిరాకీ తగ్గడంతో బెల్లం స్థిరం

 

దేశంలో వేసవితాపంతో బెల్లానికి గిరాకీ కొరవడింది. అయితే వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో వచ్చే వారం నుండి గిరాకీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్లోని కోల్డ్ స్టోరేజీల సరుకు కూడా మే 15 తరువాత బయటకు రావడం ప్రారంభం కాగలదు. అంతవరకు మార్కెట్లలో రైతుల సరుకు రాబడి సమాప్తం కావడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రలలో కూడా బెల్లం తయారీ కార్యక్రమం మందకొడిగా మారుతున్నది. రైతులు ఇంతకు ముందు తయారు చేసిన సరుకును మార్కెట్లకు తరలిస్తున్నందున గత వారం ధరలు స్థిరంగా ఉన్నాయి.


గత వారం మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి 80-85 లారీలు, కర్ణాటకలో 60-70 లారీలు, ఆంధ్రలో 78-80 లారీల బెల్లం రాబడి అయింది. ఇంతవరకు వ్యాపారులు శీతలగిడ్డంగులలో సరుకు నిల్వ చేస్తున్నారు.


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో 11 ఏప్రిల్ నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 15,03,793 బస్తాల నుండి 52,258 బస్తాలు తగ్గి 14,51,535 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం గత ఏడాది 8,98,887 బస్తాలతో పోలిస్తే తగ్గి 8,48,337 బస్తాలు, రస్కెట్ గత ఏడాది 62,651 బస్తాలతో పోలిస్తే తగ్గి 33,967 బస్తాలు, పాప్ 2,04,156 బస్తాలతో పోలిస్తే 1,54,350 బస్తాలు, కురుపా రకం గత ఏడాది 20,575 బస్తాలతో పోలిస్తే పెరిగి 27,954 బస్తాలు, చదరాలు 1,11,689తో పోలిస్తే వృద్ధిచెంది 1,19,387 బస్తాలు, రాబిన్ 2,03,161 బస్తాలతో పోలిస్తే 2,65,646 బస్తాలు, లడ్డు రకం 412 బస్తాలతో పోలిస్తే పెరిగి 751 బస్తాలకు చేరింది..


ముజఫర్నగర్లో గత సోమవారం నుండి బుధవారం వరకు కలిసి 20 వేల బస్తాల రాబడి పై కురుపా రూ. 1060-1085, లడ్డు రూ. 1200-1215, రస్కెట్ 1030-1050, పౌడర్ బెల్లం రూ. 1240-1280 మరియు హాపూర్లో 20-22 వాహనాలు బెల్లం రాబడిపై బకెట్ బెల్లం రూ. 1050-1120 ప్రతి 40 కిలోల ధరతో లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్లో గత సోమవారం నుండి బుధవారం వరకు 18-20 వేల దిమ్మలు, సోలాపూర్లో 10-12 వేల దిమ్మలు సురభి రకం రూ. 2800–2850, ఎరుపు- నలుపు మిక్స్ రూ. 2600-2650, సాంగ్లీలో 18-20 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం, గుజరాత్ రకం రూ. 3400-3700, ముంబై రకం రూ. 3500-3750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 25-30 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3000, సింగల్ ఫిల్టర్ రూ. 3200, డబుల్ ఫిల్టర్ రూ. 3450, చదరాలు రూ. 3800-3850, మహాలింగపూర్లో 6-7 వాహనాలు, శివమోగాలో 8-10 వాహనాల సరుకు రాబడి కాగా, సురభి రకం రూ. 3450, తెలుపు రకం రూ. 3500, గుజరాత్ రకం రూ. 3500-3600, బాక్స్ రకం రూ. 3650, అరకిలో ముక్కలు రూ. 3700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత సోమవారం నుండి బుధవారం వరకు 30-35 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3550-3600, మీడియం రూ. 3200-3300, నలుపు రూ. 2575-2600 మరియు చిత్తూరులో 25-30 వాహనాల ఎసి సరుకు రాబడిపై లడ్డూ రకం రూ. 3600, సూపర్-ఫైన్ రూ. 4000, సాట్నా రకం రూ. 3200, నలుపు రూ. 2600 ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని సేలం మార్కెట్లో గతవారం 7-8 వేల బస్తాల బెల్లం రాబడిపై రూ. తెలుపు 30 కిలోలు రకం రూ.1230-1240, సురభి రకం కు రూ. 10-1230, ఎరుపు రకం రూ.1180-1200, పిలకలపాలయంలో 4-5 వేల బస్తాల రాబడిపై తెలుపు రకం రూ. 1180-1200, సురభి రకం రూ. 1150-1180, ఎరుపు రూ. 1100-1150 మరియు వెలూరులో 4-5 వాహనాల బెల్లం రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 4000, మీడియం రూ. 3450-3500, నలుపు రకం రూ. 2500 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog