బెల్లం ఉత్పత్తి తగ్గే అంచనాతో చురుకుగా స్టాకిస్టులు

 


లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో పంచదార ధరలు భారీగా పెరగడంతో మనదేశం నుండి పంచదార ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 60 లక్షల టన్నుల నుండి పెరిగి 70 లక్షల టన్నులకు చేరే అంచనా కలదు. దీనితో సీజన్ చివరలో పంచదార నిల్వలు తగ్గే సూచన కనిపిస్తున్నది. అంతేకాకుండా రాబోవు సీజన్ కోసం మహారాష్ట్ర, కర్నాటక మొదలగు రాష్ట్రాలలో కొందరు రైతులు చెరుకు సాగుకు ఆసక్తి చూపడంలేదు. ఎందుకనగా, ఈ ఏడాది చెరుకు సమయానికి అమ్మకం కాకపోవడంతో ఇంతవరకు పొలాలలో పంట వాడిపోతున్నది. అంతేకాకుండా, ముజఫర్ నగర్ కోల్డుస్టోరేజీలలో నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం మేర తగ్గడంతోపాటు ప్రస్తుత ధరలతో ఉత్తరప్రదేశ్ స్టాకిస్టులు పంచదార నిల్వ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. దీనితో అన్ని కోల్డుస్టోరేజీలలో బెల్లం నిల్వచేయడం తగ్గగలదు. దీనితో ఇతర రాష్ట్రాల బెల్లం ఉత్పాదక కేంద్రాలలో స్టాకిస్టులు చురుకుగా మారడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి.


ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో మార్చి 7 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11,44,277 బస్తాల నుండి 3,34,246 బస్తాలు తగ్గి 8,10,031 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6,57,452 బస్తాల నుండి తగ్గి 4,77,851 బస్తాలు, రస్కెట్ 51,158 బస్తాల నుండి 17,946 బస్తాలు, కురుపా 17,104 బస్తాల నుండి 16,220 బస్తాలు, చదరాలు 73,811 బస్తాల నుండి 49,228 బస్తాలు, పాపి 1,63,423 బస్తాల నుండి తగ్గి 60,867 బస్తాలు, రాబిటన్ 1,80,318 బస్తాల నుండి పెరిగి 1,87,249 బస్తాలు, లడ్డు 318 నుండి పెరిగి 411 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 

ముజఫర్ నగర్ లో గత వారం 18-20 వేల బస్తాల రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1120-1215, కురుపా రూ. 1080-1090, లడ్డు రూ. 1200–1210, రసకట్ 1000-1020, పౌడర్ బెల్లం రూ. 1240-1260 మరియు హాపూర్లో 50-55 వాహనాలు దిమ్మల బెల్లం రూ. 1050-1070 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 35-40 వాహనాల సరుకు రాబడిపై 40-45 వాహనాల సరుకు అమ్మకం కాగా ఎరుపు-సురభి మిక్స్ రూ.2700-2800, నర్సింగాపూర్లో గురువారం 10 లారీల రాబడిపై ఎరుపు - సురభి మిక్స్ రూ. 2800-2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 40-45 వేల దిమ్మల బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 2700-2775, ఎరుపు- నలుపు మిక్స్ రూ. 2550-2580, సోలాపూర్లో 20-22 వేల దిమ్మలు సురభి రకం రూ. 2700-2750, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2500-2550, సాంగ్లీలో 15 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ.3400-3600, గుజరాత్ రకం రూ. 3500–3600, ముంబై రకం రూ. 3500-3750 ధరతో వ్యాపారమైంది.


కర్నాటకలోని మాండ్యాలో గత వారం 75-80 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 2900, సింగల్ ఫిల్టర్ రూ. 3000, డబుల్ ఫిల్టర్ రూ. 3450, చదరాలు రూ. 31500, మహాలింగపూర్లో 8-10 వాహనాలు సురభి, తెలుపు రకం రూ. 3300-3350, గుజరాత్ రకం రూ. 3350-3400, బాక్స్ రకం రూ. 3500, అరకిలో ముక్కలు రూ. 3550, శిమోగాలో 20-22 వాహనాలు దేశీ బెల్లం రూ. 3500-3550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 70-75 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3150-3200, మీడియం రూ. 2950–3000, నలుపు రూ. 2600-2620 మరియు చిత్తూరులో 35-40 వాహనాల ఎసి సరుకు రాబడిపై నాణ్యమైన లడ్డు రంగు సరుకు రూ. 3500, సూపర్-ఫైన్ రూ. 4000, సాట్నా రకం రూ. 3200, నలుపు రూ. 2650-2700 ధరతో వ్యాపారమైంది.

 తమిళనాడులోని సేలం మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు 30 కిలోలు రకం రూ. 1240-1260, సురభి మరియు ఎరుపు రకం సరుకు రూ. 1220-1240, పిలకలపాలయంలో 5-6 వేల బస్తాలు తెలుపు రకం రూ.1160-1180, సురభి రకం రూ. 1140-1160, ఎరుపు రూ. 1120-1140 మరియు చిత్తోడ్, కౌందప్పాడి ప్రాంతాలలో 8 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 1210-1230, ఎరుపు - సురభి మిక్ స్ఈ రూ. 1190-1210, ఎరుపు రకం రూ.1170-1190, పౌడర్ రూ. 950-1100 మీడియం రూ.3700, నలుపు రకం బడిపై నాణ్యమైన సరుకు రూ. 4000, మరియు వెల్లూరులో 4-5 వాహనాల సరుకు రూ.300, నలుపు రకం రూ. రూ. 2600 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు