తగ్గిన బెల్లం రాబడులు - అడుగంటిన నిల్వలు - ధరలకు ఛాన్స్

 

01-02-2022

ఈసారి తీవ్రమైన చలి వీస్తున్న కారణంగా ప్రముఖ బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో తయారీ ప్రక్రియ కుంటుపడుతున్నందున రాబడులు కొంతమేర క్షీణించాయి. అయితే, ఉత్తరప్రదేశ్లో పాటు ఇతర రాష్ట్రాల స్టాకిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నందున రాబడి అయిన సరుకు మొత్తం అమ్మ కమవుతున్నదని వ్యాపారులు పేర్కొన్నారు. ఈసారి వివాహాది శుభకార్యాలకు ఫిబ్రవరి మూడో వారం నుండి ఏప్రిల్ వరకు విరామ సమయమని తెలుస్తోంది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లాంటి ఉత్పాదక రాష్ట్రాలలో బెల్లం రాబడులు మరో నెల రోజులలో జోరందుకోగలవని తెలుస్తోంది. ధర రూ. 100-150 తగ్గిన తర్వాత స్టాకిస్టులు కొనుగోలుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.




ఉత్తరప్రదేశ్లో బెల్లం తయారీకి అంతరాయం ఏర్పడి ఉత్పత్తి తగ్గినందున రాబడులు క్షీణించాయి. ఫలితంగా నిల్వలు అడుగంటుతున్నాయి. తద్వారా ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో జనవరి 24 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6,08,855 బస్తాల నుండి 2,23,196 బస్తాలు తగ్గి 3,85,659 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3,73,170 బస్తాల నుండి తగ్గి 2,48,473 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.


ముజఫర్నగర్లో గత వారం 6-7 బస్తాల రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1200-1275, కురుపా రూ. 1200-1240, లడ్డు రూ.1250-1325, పౌడర్ బెల్లం రూ.1275-1290 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.

 మధ్య ప్రదేశ్లోని కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 30-35 వాహనాల సరుకు రాబడిపై రూ.2500-2800, నర్సింగ్పూర్లో గురువారం 15-20 వాహనాల రాబడిపై ఎరుపు-సురభి మిక్స్ రూ. 2500-2550 మరియు మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం 18-20 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 3300-3350, గుజరాత్ రకం రూ. 3200-3300, ముంబై రకం రూ. 3300-3450, సోలాపూర్లో 10-12 వేల దిమ్మలు సురభి రకం రూ.2900-2950, మీడియం రూ. 270-800, ఎరుపు-నలుపు మిక్స్ రూ.2600-2650, లాతూరులో 24-25 వేల దిమ్మలు సురభి రకం రూ. 2800-2850, ఎరుపు-నలుపు మిక్స్ రూ.3400, 2600-2625 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్నాటకలోని మాండ్యాలో గత వారం 55-60 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ.2800, సింగల్ ఫిల్టర్ రూ. 2900-2950, డబుల్ ఫిల్టర్ రూ. 3050, చదరాలు రూ. 3100-3150, మహాలింగపూర్ 6-7 వాహనాలు సురభి తెలుపు మిక్స్ రూ. 3350-3400, ఎరుపు మిక్స్ రూ.3200-3250, చదరాలు రూ. అరకిలో ముక్కలు రూ. 3500, శిమోగాలో 15-16 వాహనాలు దేశీ బెల్లం రూ. 3400-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో గత వారం 35-40 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3200 -3250, మీడియం రూ.2850 3000, నలుపు రూ. 2650 - 2700 మరియు 

చిత్తూరులో 30-35 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 4000, సూపర్ -ఫైన్ రూ. 4300-4400, సాట్నా రకం రూ. 3700, నలుపు రూ.3100 ధరతో వ్యాపారమైంది. 


తమిళ నాడులోని సేలం మార్కెట్లో గత వారం 3-4 వేల బస్తాల బెల్లం రాబడిపై ధర రూ. 80-100 తగ్గి తెలుపు 30 కిలోలు రకం రూ.1210-1230, సురభి రకం సరుకు రూ.1180-1200, ఎరుపు రకం రూ.1150-1170, పిలకలపాలయం, చిత్తోడ్ ప్రాంతాలలో 12-15 వేల బస్తాలు తెల్లబెల్లం రూ. 1100 -1120, సురభి రకం రూ.1080-1100, ఎరుపు రకం రూ.1050-1070 ధరతో వ్యాపారమైంది.




Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు