మధ్యప్రదేశ్ లో పెరిగిన కొత్త మిరప రాబడి - గత వారం మార్కెట్ ధరలు

 
11-10-2021

గుంటూరు మార్కెట్లో గత వారంలో కోల్డుస్టోరేజీల నుండి 5 లక్షల బస్తాలు మరియు హిందూపూర్లో దాదాపు 1500 బస్తాల కొత్త సరకు రాబడితో పాటు మధ్యప్రదేశ్లో 25-27 వేల బస్తాల కొత్తసరుకు రాబడి కాగా, మరో 15 రోజులలో కర్నాటకలో కొత్త సరుకు రాబదులు పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు సాధ్యమైనంత త్వరగా బయటపడాలని చూస్తున్నారు. దీనితో ధరల పెరుగదల పరిస్థితి సమాప్తమయింది. 


గతవారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని మిరప ఉత్పాదక ప్రాంతాలలో అనుకూల వాతావరణ పరిస్థితిలు మరియు వర్షాలు ఉండడంతో పంటకు లాభదాయకంగా ఉంది. 

మధ్య ప్రదేశ్లోని బేడియాలో గురువారం 5-6 వేల బస్తాలు, శనివారం 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడితో పాటు ఆదివారం దాదాపు 15 వేల బస్తాల రాబడి అయ్యే అవకాశముంది. దీనితో 15, అక్టోబర్ తరవాత మధ్య ప్రదేశ్ లో వేగంగా పెరగవచ్చు. ఎందుకనగా, ఈ ఏడాది రైతులకు గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ధరలు లభిస్తున్నాయి మరియు సరుకు నాణ్యంగా ఉంది. దీనితో పెద్ద మసాలా యూనిట్లు రంగు సరుకు కోసం మధ్య ప్రదేశ్లో కొనుగోళ్లను పెంచవచ్చు. 20, అక్టోబర్ నుండి మహారాష్ట్ర లోని నందూర్ బార్ మరియు గుజరాత్ మార్కెట్లలో రాబడులు ప్రారంభమయ్యే అవకాశం కలదు.

 అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో పచ్చిమిరప అత్యంత నాణ్యంగా ఉన్న నేపథ్యంలో మిరప దిగుబడులు పెరిగే అవకాశం కలదు.

 గుంటూరు మార్కెట్లో గతవారం కేవలం 5 రోజుల మార్కెట్లో యార్డులో కోల్డుస్టోరేజీలనుండి 5 లక్షల బస్తాల సరుకు రాబడికాగా, ఇందులో 1.75 లక్షల బస్తాల సరుకు గుంటూరు ఎసి ల నుండి మరియు 50 వేల బస్తాల ఇతర కోల్డుస్టోరేజీల సరుకు కలిసి 2.25 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో తేజ డీలక్స్, నెం.5, సింజెంటా బ్యాడ్లీ, 273 రకం, 577రకం మరియు తాలు ధరలు రూ. 200, డిడి, 341, ఆర్మూరు రకం, తేజ తాలు రూ. 300, అన్ని మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 400-500 తగ్గగా, 355 బ్యాడ్లీ, 334, సూపర్ -10 డీలక్స్ రకాలు స్థిరంగా ఉన్నాయి.

 గుంటూరులో మీడియం, మీడియం బెస్ట్ రకాలతో పాటు గత ఏడాది నిల్వ అయిన సరుకు ఎక్కువగా అమ్మ కంకోసం చేరుతున్నది. అయితే, డీలక్స్ రకాల రాబడి 30-40 శాతం మాత్రమే ఉంది. దీనితో క్వాలిటీకి అనుగుణంగా వ్యాపారమవుతున్నది. దసరా తరువాత డీలక్స్ 334, సూపర్-10 రకాల ధరలు స్థిరంగా ఉండే అవకాశం కలదు.


గుంటూరు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన

 తేజ రూ. 13000–14000, డీలక్స్ రూ. 14100-14200, మీడియం బెస్ట్ రూ. 11500-12900, మీడియం రూ. 10500-11400, 

బ్యాడ్లీ - 355 రకం రూ.13000-16000, డీలక్స్ రూ. 16100-16200, 

సింజెంటా బ్యాడ్జీ రూ. 10000-11800, 

డిడి రూ.11000-12800, 

341 రకం రూ. 11000-13000,

 నెం-5 రూ.11000-12800, 

273 రకం రూ. 11000–12800,

577 రకం రూ. 10000-11600, 

334 మరియు సూపర్ -10 రూ.9500-10800, డీలక్స్ రూ. 10900-11000, ఎక్స్ట్రార్డినరీ రూ. 11100-11300, మీడియం బెస్ట్ రూ. 8000-9400, మీడియం రూ. 7000-7900, 

334 మరియు సూపర్-10 గత ఏడాది సరుకు రూ. 7000-10000,

 4884 రకం రూ. 10500-12000, 

రోమి రకం రూ. 10500-12800, 

ఆర్మూరు రకం రూ. 9000-10300, 

బంగారం రకం రూ. 9000-11000, 

మీడియం మరియు మీడియం బెస్ట్ సహా అన్ని సీడ్ రకాలు రూ. 8000-10800, 

తేజ తాలు రూ. 7000-8000, 

తాలు రూ. 3500-7000 ధరతో వ్యాపారమయింది.


గతవారం హిందూపూర్లో వర్షాల నేపథ్యంలో రాబడులు తగ్గి, మంగళ మరియు శుక్రవారాలలో కలిసి దాదాపు 1000-1500 బస్తాల రాబడిపై డెమన్ రకం రూ. 10000-12500, తాలు రూ. 4000-4500 ధరతో వ్యాపారమయింది.


ఖమ్మంలో బుధవారం నుండి శుక్రవారం వరకు 28-30 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 

నాణ్యమైన తేజ రూ. 14175, 

మీడియం రూ. 13500-14000, 

తాలు రూ. 6500-7000, 

వరంగల్లో గతవారం 35-40 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 14000, మీడియం రూ. 12000-13000, నాణ్యమైన వండర్హాట్ రూ. 14500-15000, మీడియం రూ. 13000-14000, 273 మరియు 341 రకాలు రూ.12000–14000, డిడి రూ. 13500-14000, 1048 రకం రూ. 10500, దీపికా రూ. 14000, నాణ్యమైన టమాటా రూ.19600, మీడియం రూ. 16300, సింగిల్పట్టి రూ. 16500, 334 రకం రూ. 10500, తాలు రూ. 5000-7000 ధరతో వ్యాపారమయింది.


హైదరాబాద్ లో గతవారం 2500 - 3000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 13500-14000, మీడియం రూ. 12000-13000, సూపర్-10 రూ. 10000-10500, నాణ్యమైన 273 రకం రూ. 12500, మీడియం రూ. 11000-12000, 341 రకం రూ. 12500-13000, సి-5 రకం రూ. 11000-13000, తేజ తాలు రూ. 6000-7500, మీడియం రూ. 4500, హైబ్రిడ్ తాలు రూ. 3500-4500 మరియు కర్నూలు ప్రాంతం నుండి 25-30 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ.6000-9000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


కర్నాటకలోని బ్యాడ్జీలో సోమ మరియు గురువారాలలో కలిసి 400 బస్తాల కొత్త సరుకు రాబడిపై 5531 రకం రూ.9500-11000, జిటి రూ. 8500-9500, తాలు రూ. 4000-5500 మరియు కోల్డు స్టోరేజీలనుండి 40 వేల బస్తాల రాబడిపై 12 వేల బస్తాల అమ్మకం నాణ్యమైన డబ్బీ రూ. 17000-19000, కెడిఎల్ డీలక్స్ రూ. 17000-18500, మీడియం రూ. 14000–16000, 2043 డీలక్స్ రూ.14000-16000, మీడియం రూ. 11000-13000, 5531 రకం రూ. 9500-11500, డిడి రూ. 11000-13000, 334 మరియు సూపర్ -10 రకాలు రూ. 9000-10500, తాలు రూ. 3500-5000 ధరతో వ్యాపారమయింది.


ఛత్తీసడ్ లోని జగదల్పూర్లో గతవారం 6-7 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ మరియు సన్ రకాలు రూ. 11000-13700, 4884 రకం రూ. 10000-12000, తేజ తాలు రూ.7000-7500 ధరతో వ్యాపారమయింది.


మధ్య ప్రదేశ్ లోని బేడియాలో గురు మరియు శనివారాలలో కలిసి 16-17 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై మహీ ఫూల్కట్ రూ. 8000-12200, తొడిమతో రూ. 7500-9700, లాల్కట్ రూ.6500-8000, మీడియం రూ. 5500-7000, తాలు రూ. 4000-5500 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు