తెలంగాణ పారబాయిల్డ్ బియ్యం కొనుగోలుకు కేంద్రం సిద్దం

 

03-10-2021

కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లాంటి రాష్ట్రాలలో పారబాయిల్డ్ బియ్యానికి తగ్గిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రబీ సీజన్లో కొనుగోలు చేసిన అదనపు సరుకు ఏమి చేయాలోనని దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కేంద్రం నుండి తీపి కబురు అందింది. 


సిద్ధాంతపరమైన రాష్ట్రాల నుండి గతంలో కొనుగోలు చేసిన నిల్వల నుండి మరో 20 ల.ట. కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తమ సమ్మతి తెలియజేసింది. గత ఏడాది వ్యవసాయ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో రైతుల నుండి కొనుగోలు చేసిన 49 ల.ట. మరియు రబీ సీజన్లోని 92 ల.ట. కలిసి మొత్తం 1.41 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖచే కొన్ని నెలల క్రితం (రబీ సీజన్) కొనుగోలు చేసిన 92 ల.ట. ధాన్యం నుండి 24.75 ల.ట. మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర సర్కారు నేతృత్వంలోని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) తెగేసి చెప్పింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్రానికి తమ గోడు విన్నవించారు. సంక్లిష్ట పరిస్థితి నుండి గట్టెక్కించమని ప్రాధేయపడ్డారు. సిద్ధాంతపరంగా 20 ల.ట. ధాన్యం అదనంగా కొనుగోలు చేసేందుకు కేంద్రం ఎట్టకేలకు సమమ్మతించింది. అయితే, ఇప్పటి వరకు అధికారిక స్థాయిలో ఎలాంటి చర్చలు జరపలేదు. ఖరీఫ్ సీజన్లోని అర్వ బియ్యం సంతృప్తికరమైన పరిమాణంలో కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు అందుబాటులో ఉన్నారు. అయితే, రబీ సీజన్ లోని పారబాయిల్డ్ బియ్యంకొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు కనుమరుగైనందున రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకనగా, దేశంలో పేరుకుపోతున్న భారీ నిల్వలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రబీ సీజన్ ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్ఐ స్పష్టం చేసింది. రబీ సీజన్ ధాన్యం మిల్లింగ్ చేసిన తర్వాత నూకలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు మిల్లర్లు తెలిపారు. రబీ ధాన్యాన్ని స్వల్పంగా ఉడికించిన అత్యధిక ధాన్యం నుండి పారబాయిల్డ్ బియ్యం తయారవుతుంది. అయితే, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో పారబాయిల్డ్ బియ్యానికి ఆదరణ కరవైంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా రబీ సీజన్లో వరి సేద్యం చేపట్టకూడదని రైతులకు సలహా ఇచ్చింది. ఎందుకనగా, ఇప్పటికీ అర్వ బియ్యం కొనుగోలు చేసేందుకు ఎఫ్ఎసిఐ సిద్ధంగా ఉన్నప్పటికీ రబీ సీజన్ ధాన్యం కొనుగోలు చేయడానికి విముఖత వ్యక్తం చేస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన రకాల బియ్యానికి మాత్రమే ఆదరణ నెలకొన్నది. ఏళ్ల తరబడిగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని మరువకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతు సమాఖ్య కోరింది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు