పసుపు సాగు ప్రారంభం - ధరలు పటిష్ఠం

 

లభించిన సమాచారం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్రలలోని ఉత్పాదక కేంద్రాలలో వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటల సాగు ప్రాంరభమైంది. ప్రారంభంలో వర్షాలు తక్కువగా ఉన్నందున విత్తడం నెమ్మదిగా కొనసాగుతున్నప్పటికీ, జూలై నుండి ముమ్మరం కాగలదు. ఇంతవరకు మహారష్ట్రలో 50-60 శాతం మేర పంట విత్తడం పూర్తి కాగా, తెలంగాణలో 25-30 శాతం పూర్త యింది. కొత్త సీజన్ కోసం 8 నెలల సమయం ఉంది. ఆగస్టు నుండి మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు సరుకు విక్రయించడం లేదు. రాబోవు సీజన్లో మిగలు నిల్వలు ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే తక్కువ నిల్వ లతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతవారం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గడంతో పాటు మర ఆడించే యూనిట్ల డిమాండ్తో ధరలు రూ. 150-200 ప్రతి క్వింటాలుకు పెరిగాయి.


ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జూన్ వాయిదా రూ. 7580 ప్రారంభమై సాయంకాలం వరకు రూ. 80 బలపడి రూ. 7660 వద్ద సమాప్తమైంది. జూలై వాయిదా సోమవారం రూ. 7903తో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి రూ. 114 క్షీణించి రూ. 7788, ఆగస్టు వాయిదా రూ.70 నష్టంతో రూ. 7870 వద్ద ముగిసింది.తెలంగాణలోని

 నిజామాబాద్ మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.6500-7800, దుంపలు రూ. 5800-6400, కొమ్ములు పాలిష్ రూ. 8000-8100, దుంపలు రూ. 7100-7200 మరియు బంగ్లాదేశ్ కోసం లారీ బిల్టి కొమ్ములు రూ. 7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

వరంగల్లో గత వారం 1500 బస్తాల పసుపు రాబడి పై కొమ్ములు రూ. 6000-6300, దుంపలు రూ. 5600-5700, కేసముద్రం మార్కెట్లో 3-4 వేల బస్తాలు కొమ్ములు రూ. 5000-500, దుంపలు రూ. 5000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని


 దుగ్గిరాలలో గత వారం 1700-1800 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు మరియు దుంపలు రూ. 6100-6250, మీడియం రూ. 5800-6000 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని 

సాంగ్లీ మార్కెట్లో గత వారం 8-10 వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు రూ.7000-9300, దేశీ కడప రకం రూ. 6000-7200, 

హింగోళిలో గత సోమ, బుధ, శుక్రవారాలలో కలిసి 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6500-7000, నాణ్యమైన సరుకు రూ.7500-7700, దుంపలు రూ. 6000-6700, నాందేడ్ 3-4 వేల బస్తాలు కొమ్ములు రూ. 6000-7500, దుంపలు రూ. 6000-6200, 

బస్మత్నగర్లో 3 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ.5500-7200, దుంపలు రూ.5400-6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 12-13 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.5766-7725, దుంపలు రూ. 5398-6869, పెరుందురైలో 3-4 వేల బస్తాలు కొమ్ములు కొత్త సరుకు రూ.70-7899, దుంపలు రూ.5166-6869 మరియు పాత సరుకు కొమ్ములురూ. 4758-6200, దుంపలు రూ. 4239-5894 మరియు గోబి చెట్టిపాలయంలో కొమ్ములు రూ. 6259-8559, దుంపలు రూ. 6169-6929 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు