మెంతుల ఉత్పాదక రాష్ట్రాలలో గత వారం కొనుగోళ్లు ఊపందుకున్నప్పటికీ ధర కేవలం రూ. 150-200 ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. ఎందుకనగా, ఈ ఏడాది ప్రముఖ మెంతుల ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లో ఉత్పత్తి సమృద్ధిగా ఉండగలదనే అంచనా ఇందుకు నిదర్శనం. సరఫరా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు.
గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం 2 వేల బస్తాల మెంతుల రాబడిపై యావరేజ్ రూ. 4900-5250, మీడియం రూ. 5000-5300, నాణ్యమైన సరుకు రూ. 5900-6000, జామ్నగర్లో 400-500 బస్తాలు యావరేజ్ రూ. 4400-4500, మీడియం సరుకు రూ. 4800-5000, నాణ్యమైన సరుకు రూ. 5300-5400 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమైంది.
మధ్యప్రదేశ్లోని జావ్రాలో గత వారం 7-8 వేల బస్తాల సరుకు రాబడిపై ఆకుపచ్చ సరుకు రూ. 4000-4200, మీడియం రూ. 4500-4700, మీడియం బెస్ట్ రూ. 5000-5400, నాణ్యమైన సరుకు రూ. 6000-6500, బోల్డ్ సరుకు రూ. 7500-8000, నీమచ్లో 10-12 వేల బస్తాలు యావరేజ్ సరుకు రూ. 4200-4400, మీడియం రూ.5000-5600, నాణ్యమైన సరుకు రూ. 6200-6400, బోర్డు సరుకు రూ. 7500-8000, మందసోర్లో 800-1000 బస్తాలు యావరేజ్ సరుకు రూ. 4500-5200, మీడియం రూ.5400-5800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని కోటాలో గత వారం 2500 - 3000 బస్తాల రాబడిపై నాసి రకం సరుకు రూ. 4000-4200, యావరేజ్ రూ.4500-4700, మీడియం బెస్ట్ రూ.5000-5200, రాంగంజ్ మండీ లో 200-250 బస్తాలు మీడియం రూ. 4200-4500, మీడియం బెస్ట్ రకం రూ. 5000-5100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు