సోంపు

 


ఈఏడాది రెతులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు విక్రయిస్తున్నందున మార్కెట్లలో రాబడులు పెరగడం లేదు. ఉత్పత్తి సంతోషజ నకంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా అమ్మకానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు నిలకడగా ఉన్నాయి.


 గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గత వారం 8-10 వేల బస్తాల సోంపు రాబడి పై యావరేజ్ సరుకు రూ. 9000-10,000, మీడియం రూ. 11,000-11,500, నాణ్యమైన సరుకు రూ. 12,000-12,500, రాజస్తాన్లోని మెడతాలో 3 వేల బస్తాలు, పాలి, జోధ్పూర్ మరియు ఇతర ఉత్పాదక మార్కెట్లలో కలిసి 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 9500-9700, మీడియం రూ. 10,500-11,200, మీడియం బెస్ట్ రూ. 12,500–13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు