కొనసాగుతున్న జీలకర్ర ఎగుమతులు - వాయిదా ధరలు పటిష్ఠం

 

లభించిన సమాచారం ప్రకారం గత రెండు వారాలుగా జీల కర్ర ధరలలో ఎక్కువగా హెచ్చు తగ్గులు లేవు. అయితే సరుకు ఎగుమతి అవు తోంది. గత సోమవారం ఎన్సిడిఇఎక్స్ వద్ద జీలకర్ర జూన్ వాయిదా 20,810 తో ప్రారంభమైన సాయంత్రం వరకు రూ. 215 తగ్గి రూ.20,595తో సమాప్త మెంది. కాగా, జూలె వాయిదా సోమవారం జూన్ నెలతో పోలిస్తే అధిక ధరతో రూ. 20,955తో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి రూ. 65 పెరిగి రూ. 21,020, ఆగస్టు వాయిదా రూ. 65 వృద్ధిచెంది రూ.21,145 వద్ద ముగిసింది. 


గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గత వారం 30-35 వేల బస్తాల జీలకర్ర రాబడిపై యావరేజ్ సరుకు రూ. 15,000-16,000, మీడియం రూ. 18,500-19,000, నాణ్యమైన సరుకు రూ. 20,000-20,500, మిషన్ క్లీన్ రూ. 21,000-21,500 మరియు రాజ్కోట్లో 3 వేల రాబడి యావరేజ్ రూ. 18,000-19,250, మీడియం రూ. 19,300-19,875, నాణ్యమైన సరుకు రూ. 19,900-20,125, యూరప్ రకం రూ. 20,130-20,500, కిరాణా రకం రూ. 20,600-20,750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

గుజరాత్లోని వ్యాపారులు, రెత్తుల కథనం ప్రకారం ఆగస్టు నుండి ధరలు పెరగవచ్చు. అంతవరకు దేశంలోని కిరాణా మార్కెట్లలో నిల్వలు కూడా తగ్గగలవు. రాజస్థాన్లోని మెడతాలో గత వారం 3 వేల బస్తాల రాబడిపె మీడియం రూ. 18,200-18,500, నాణ్యమైన సరుకు రూ. 20,000-21,000, జోధ్ పూర్, నాగోర్, సాంచోర్, కేక్, మధుసూదన్ గఢ్ మార్కెట్లలో కలిసి వారంలో 2-3 వేల బస్తాల రాబడిపై మీడియం రూ. 14,000-15,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, నోఖాలో 700-800 బస్తాలు మీడియం రూ. 17,000–18,000, నాణ్యమైన సరుకు రూ. 18,500–19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog