బలహినపడుతున్న మెంతుల ధరలు

  


మధ్య ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో మెంతుల నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. గత వారం మధ్య ప్రదేశ్, గుజరాత్ నుండి వారంలో దాదాపు 50-60 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా గిరాకీ కొరవడినందున ధరలు ఒత్తిడికి గురై నిరంతరం నేల చూపులు చూస్తున్నాయి.


మధ్యప్రదేశ్ లోని జావారాలో గత వారం 18-20 వేల బస్తాల మెంతుల రాబడిపై యావరేజ్ సరుకు రూ. 3800-4200, మీడియం రూ. 4500-5000, మీడియం బెస్ట్ రూ. 5500-6000, నాణ్య మైన సరుకు రూ. 6500-7000, నీ మచ్ లో 14-15 వేల బస్తాలు యావరేజ్ సరుకు రూ. 4000-4200, మీడియం రూ. 4500-5000, నాణ్యమైన సరుకు రూ. 6000-6600, మందసోర్ లో 400-500 బస్తాలు రూ. 4200-4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

రాజస్తాన్ లోని రామ్ గంజ్ మండి, కోటా, బికనీర్, నోఖా ప్రాంతాల అన్ని మార్కెట్ లో కలిసి 1000-1200 బస్తాల సరుకు రాబడి పై యావరేజ్ సరుకు రూ. 3500-3800, మీడియం రూ. 4000-4200, నాణ్య మైన సరుకు రూ. 4500-4700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

గుజరాత్ లోని రాజ్ కోట్ లో 1500 బస్తాల మెంతుల రాబడి పై నాణ్యమైన సరుకు రూ. 5500-5750, మీడియం రూ. 5150-5450, యావరేజ్ సరుకు రూ. 4650-5100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog