Skip to main content
పేరుకుపోతున్న చింతపండు నిల్వలు
ఈ ఏడాది దేశంలోని ఉత్పాదక రాష్ట్రాలలో శీతల గిడ్డంగులలో భారీయెత్తున చింతపండు నిల్వలు అమ్మకం కాకుండా మూలుగుతున్నాయి. కొనుగోళ్లు కుంటుపడినందున ధరలు చైతన్యం కోల్పోతున్నాయి.
రాబోయే సీజన్లో చింతపండు ఉత్పత్తి తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఎందుకనగా ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భగా పచ్చి చింతకాయ ప్రతి కిలో ధర రూ. 110-120 పలుకడమే ఇందుకు నిదర్శనం. గడిచిన రెండు వారాలుగా స్టాకిస్టుల అమ్మకాలు కుంటుపడ్డాయి. సరుకు నిల్వలు పేరుకుపోతున్నాయి. వచ్చే ఏడాది స్టాకిస్టులు కొత్త సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచే అకాశం కనిపించడంలేదు.
తమిళనాడులోని కృష్ణగిరిలో గత వారం 3-4 వాహనాల సరుకు రాబడిపై చపాతి రంగు సరుకు రూ. 4500-5200, మీడియం గింజ సరుకు రూ. 2850-3300, పాపరంపట్టిలో 20-25 వాహనాల సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా రూ. 9200, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 9900-10,000, గింజ సరుకు రూ. 3200-3700, స్థానికంగా రూ. 3200, నలగొట్టని చింతపండు స్థానికంగా రూ. 2100–2200, మహారాష్ట్ర సరుకు రూ. 2400-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
సేలంలో 15-20 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 12,000-14,000, చపాతీ స్థానికంగా రూ. 9000-9200, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 9500-10,000, కంబం, ధర్మపురి, దిండిగల్ ప్రాంతాలలో 5-6 వాహనాలు ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7000-7500, మహారాష్ట్ర గింజ సరుకు రూ. 3000-3500, నలగొట్టని చింతపండు రూ. 2000-2400, బీహార్ మరియు ఝార్ఖండ్ లో కలిసి ప్రతి రోజు 3-4 వాహనాల సరుకు అమ్మకంపై గింజ సరుకు రూ. 2000-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ లో గత వారం 6-7 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సిల్వర్ నాణ్యమైన సరుకు ప్రతి క్వింటాలు రూ. 18,000-24,000, మేలిమి రకం రూ. 13,000-15,000, మీడియం రూ. 10,500-12,000, యావరేజ్ సరుకు రూ. 9000-10,000, ఫ్లవర్ స్పెషల్ సరుకు రూ. 9000-10,000, బెస్ట్ రూ. 8000-8500, మీడియం రూ. 7000 -8000, యావరేజ్ రూ. 5000 -5500 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమెంది. పుంగనూరు, మదనపల్లి ప్రాంతాలలో గత వారం 15-20 వాహనాల సరుకు అమ్మకం కాగా, మేలిమి రకం రూ. 12,000-13,000, చపాతీ రూ. 9000-10,000, స్థానికంగా రూ. 7000-7500, ఫ్లవర్ మహారాష్ట్ర సరుకు రూ. 7500-8000, గింజ సరుకు రూ. 3500-3700, మహారాష్ట్ర సరుకు రూ. 3200- 3400, సాలూరులో 15-20 వాహనాల సరుకు అమ్మకంపై సైమి-ఫ్లవర్ బెస్ట్ రాజమండ్రి, కాకినాడ డెలివరి రూ. 9500, మీడియం పుదుకొట్టె లోడింగ్ కండిషన్ రూ. 7000-7200, యావరేజ్ రూ. 5500-5600,నాణ్యమైన గింజ సరుకు రూ. 3700-3900, చపాతీ రూ. 3400-3500 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.
తెలంగాణలోని హైదరాబాద్ లో 4-5 వాహనాల సరుకు రాబడిపై మహారాష్ట్ర సరుకు ఎసి రూ. 7500-8500, నాణ్యమైన సరుకు రూ. 9500-10,000, నాణ్యమైన సరుకు స్థానికంగా రూ. 6500-7500, కర్ణాటక ఫ్లవర్ రూ. 6500-7500, హిందూపూర్ లో రూ. 5000-6000 ప్రతి క్వింటాలు ధరతో వాయ్సారమైంది.
కర్ణాటకలోని తుంకూరులో 3-4 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై మేలిమి రకం మీడియం సరుకు రూ. 18,000-20,000, నాణ్యమైన సరుకు రూ. 13,000-15,000, ఫ్లవర్ మీడియం రూ. 10,000–12,000, ఫ్లవర్ మీడియం రూ. 5000-5500, బెల్గాంలో మహారాష్ట్ర ప్రాంతం ఫ్లవర్ రూ. 9000-11,000, స్థానికంగా రంగు వెలిసిన సరుకు రూ. 7500-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్రలోని బార్లీ, లాతూర్, ఉద్ర్ ప్రాంతాల నాణ్యమైన ఎసి సరుకు అహ్మద్ నగర్ లో రూ. 8000-8500, మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌లో 3-4 వాహనాల సరుకు అమ్మకంపై ఓం బ్రాండ్ రూ. 9500, ఫ్లవర్ మీడియం రూ. 6500-7500, గింజ సరుకు రూ. 3600-4000 తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ లో గత వారం 10-15 వాహనాల సరుకు రాబడిపై గత ఏడాది నిల్వ అయిన సరుకు రూ. 3400-3500, తాజా సరుకు రూ. 3100-3300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.
చింతగింజలు
ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూపూర్, పుంగనూరులో గత వారం 5-6 వాహనాల చింతగింజల రాబడి పె రూ. 1800, పప్పు రూ. 3150, పిండి రూ. 4200-4500, సిద్దిపేటలో రూ. 1775-1800, పప్పు రూ. 3150-3175, సాలూరులో 3-4 వాహనాల సరుకు అమ్మకంపె చింత గింజలు రూ. 1600, పుంగనూరు డెలివరి రూ. 1800-1850, కర్ణాటక లోని తుంకూరులో చింతగింజలు స్థానికంగా రూ. 1500-1600, మహారాష్ట్రలోని బార్టీలో రూ. 1800-1825, ఉద్ర్, లాతూర్ లో రూ. 1750-1800, నాసిక్ సరుకు రూ. 1775-1800, తమిళనాడు లోని పాపరంపట్టి, క్రిష్ణగిరి ప్రాంతాలలో 3-4 వాహనాలు రూ. 1550-1600 ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు