ఎగబాకుతున్న వాము ధరలు

 

వాము కొనుగోళ్లు జోరందుకున్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది.రాబోయే సీజన్లో ఉత్పత్తి తగ్గగలదనే సంకేతాలు అందు తున్నాయి. అయితే, గుజరాత్ లో సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున గ్రీష్మకాలం పంట అత్యంత నాణ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనుగోళ్లు పెరిగినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 400-500 వృద్ధి చెందింది.


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు మార్కెట్లో గత మంగళ, శుక్రవారాలలో కలిసి 700-800 బస్తాల వాము రాబడిపై ఎరుపు రకం రూ. 12,000-12,500, తెలుపు రూ. 13,000-14,000, నాణ్యమైన సరుకు రూ. 16,000-17,000, మధ్య ప్రదేశ్ లోని నీమచ్ లో 1500 బస్తాలు నాసిరకం సరుకు రూ. 8000-9000, మీడియం రూ. 10,500-11,000, నాణ్యమైన సరుకు రూ. 12,000-12,500, జావ్ రాలో మీడియం సరుకు రూ. రూ.8500-9000, మీడియం బెస్ట్ 10,500-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్ లోని జామ్నగర్ మార్కెట్లో అమ్మకాలు ఒత్తిడికి గురైనందున 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ రూ. 8000-8700, మీడియం బెస్ట్ రూ. 10,000-10,500, నాణ్య మైన సరుకు రూ. 12,000-12,500 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog