చౌడు భూముల రైతుల కోసం

చౌడు భూముల పాలిట వరం...


చెరువు మట్టి చేను భూమికి ఎంతో పుష్టి...

                 నేల నుండి తీసుకున్న ఫలసాయానికి సరిపడా సత్తువను తిరిగి నేలకు అందిస్తేనే భూమి ఫలదాత దీర్ఘకాలం మనగగలుగుతుంది. అత్యధిక రసాయన ఎరువులు వాడటం వలన వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. చేలకు చెరువు మట్టి తోలటం, పశువుల పెంట వేయటం తదితరాలు వలన దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీరింకిన చెరువులు, కుంటల్లోని పూడిక మట్టిని పొలాలకు తోలడం ఈ  వేసవి సమయం అనువైనది.



సేంద్రియ సేద్యం:


             ఎరువులు,  పురుగుమందులు, గడ్డి మందులు అత్యధికంగా వాడడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. సిఫార్సు చేసిన దానికన్నా రైతులు 14-39 శాతం వరకు అదనంగా రసాయన ఎరువులు వాడుతున్నట్లు అంచనా. ఈ మధ్యకాలంలో సేకరించిన మట్టి నమూనాల్లో 70 శాతంకు పైగా నేలల్లో సేంద్రియ పదార్థం అల్ప స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఇది కనీసం మధ్యస్థాయికి (0.87-1.3 శాతం) ఉండాలి. దీనిని క్రమంగా 2.0 శాతానికి మించి తీసుకురాగలిగితే పోషకాలు బాగా అందుబాటులో వచ్చి నేలలో అనుకూల లక్షణాలు ఏర్పడతాయి.


            పశువుల, కోళ్లు, జీవుల ఎరువు, బూడిద, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, కూరగాయల వ్యర్థాలు, మార్కెట్ స్వరాలు, గడ్డి వంటి వాటిని రైతులు సేంద్రియ సాగులో వినియోగించుకోవచ్చు. ఇందులో బూడిదను నేరుగా పంటలకు వాడే అవకాశం ఉండగా, గడ్డి, మార్కెెట్ వ్యర్థాలు వంటి వారటిని కంపోస్టు గా మార్చుకొని చెట్లు, మొక్కలకు వాడాలి.

సేంద్రియ సాగులో చెరువు మట్టి  ప్రధాన పాత్ర పోషిస్తుంది.




బహుళ ప్రయోజనాలు :- వర్షాలు, వరదలకు నేలపై పొరలోని సారవంతమైన పోషకాలు కొట్టుకొచ్చి చెరువులు, కుంటల్లో నిక్షిప్త మవుతాయి. చెరువులో పేరుకుపోయిన పాట మట్టిని తిరిగి పొలాల్లో వేయడం వలన చాలా ప్రయోజనాలు అన్నారు. పూడిక మట్టిలో ప్రధానంగా సేంద్రీయ కర్బనం ఉంటుంది. ఇది ఎర్ర నేలలు, తేలికపాటి నేలలకు మంచి యోగం ఉంటుంది. ఇసుక నేలలకు పూడిక మట్టితో చాలా ప్రయోజనం ఉంటుంది. పూడిక మట్టిలో నీటిని, తేమను పట్టి ఉంచే గుణం ఉంటుంది. కాబట్టి వర్షం నీటిని తడులుగా అందించిన సాగు నీటిని.చెరువుమట్టి పట్టి ఉంచి  ఎక్కువ రోజులు వేరు వ్యవస్థ కు అందిస్తుంది.దీని వలన పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడులను ఇస్తుంది. పూడిక మట్టిలో పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది ప్రధాన పంటకు అందుబాటులోకి వస్తాయి. చాలా వరకు చెరువు మట్టి, సేద్య భూములకు మేలు కలిగించేదిగా ఉన్నా, కౌలు చోట్ల చౌడును కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి చెరువులోని మట్టిని ముందుగా భూసార పరీక్ష చేయించి చౌడును కలిగించదని నిర్ధారించుకున్న తర్వాత పొలాలకు తోలటం మంచిది., 

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు