ధాన్యం నిల్వ చేయడానికి రెండు పొరల సంచులు



ధాన్యం నిల్వ చేయడానికి రెండు పొరల సంచులు



దేశంలో పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు నెరవేర్చడం ఆందోళనకరంగా ఉంది. మూడింట ఒకవంతు ఆహారం పంటకోత అనంతరం నష్టం జరుగుతుంది లేదా వృథా అవుతుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి ఆహార లభ్యతను పెంచడానికి సహజ వనరులపై ఒత్తిడిని తగ్గించడానికి, ఆకలిని తొలగించడానికి రైతుల జీవనో పాధిని మెరుగుపరచడానికి స్థిరమైన ధాన్యం నిల్వ చేసే పరిష్కారం తెలియకపోవడమే ప్రధాన కారణం.

ధాన్యం నిల్వ చేసేందుకు మన పూర్వికులు, గ్రామీణ రైతులు వివిధ రకాల నిల్వచేసే గోనె సంచి, ప్లాస్టిక్ డ బ్బాలు, మట్టికుండ పాత్రలు వంటివి వాడేవారు. ధాన్యం నిల్వ చేయడం నేడు రైతులకు పెద్ద సవాలుగా మారింది. నిల్వలో కీటకాలు, తెగుళ్ల వల్ల విత్తన బరువు తగ్గడమేగాక అధిక ఉష్ణోగ్రత, తేమ శాతం వలన  విత్తనం లో పోషక నాణ్యత కూడా తగ్గుతుంది.

దీనికి పరిష్కార మార్గంగా  రెండు పొరలున్న హెర్మెటిక్ సంచుల్లో ధాన్యం నిల్వ చేసే పద్ధతిని రాజేంద్రనగర్ లోని గృహవిజ్ఞాన కేంద్రం వారు రైతులకు పరిచయం చేశారు. ఈ సంచులు కీటకాలు, బూజు (తెగుళ్లు), అధిక ఉష్ణోగ్రత, తేమ పరిస్థితుల నుంచి ధాన్యాన్ని కాపాడేవిగా ఉంటాయి. ఈ పద్ధతిలో ధాన్యం మూసి ఉన్న కంపార్ట్మెంట్ లోపల నిల్వ చేస్తారు. సంచి బయటి పొరగా పాలీప్రొఫైలిన్ లోపలి పొరగా 20 మైక్రాన్ల పాలిథీన్ షీట్ తో తయారు చేసి ఉంటుంది.



హెర్మెటిక్ సంచులను ఉపయోగించటడానికి ముఖ్య కారణాలు బూజు పెరుగుదల, తేమ, ఇతర కలుషితాల వల్ల ధాన్య నష్టం జరగకుండా కాపాడటమే కాకుండా వాయువు మార్పిడిని తొలగిస్తాయి. బ్యాక్టీరియా చర్య లను క్రిమికీటకాలు ఆశించడానికి తగ్గిస్తాయి

ఈ సంచుల్లో పప్పు దినుసులు, బియ్యం, రాగులు, జొన్నలు, గోధుమలు వంటి వాటిని పోసి పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎటు వంటి పురుగు పట్టకుండా సంవత్సరం  పాటు పప్పుదినుసులు, ఇతర పదార్థాలను కాపాడుకోవచ్చు. అంతేకా కుండా ఎటువంటి తేమ చేరకుండా ఉంటుంది.

వీటిని 5 కిలోల నుంచి 50 కిలోలు వరకు ధాన్యం నిల్వ చేయడానికి వీలుగా  వేర్వేరు పరిమాణాల్లో రూపొందించారు

డా. వి.విజయలక్ష్మి, డిజె.దీపిక కుటుంబ వనరుల యాజమాన్యం, గృహవిజ్ఞాన కేంద్రం
రాజేంద్రనగర్, ఫోన్: 9989331918


Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు