నాణ్యమైన విత్తనాల సేకరణ - మొలక కట్టు విధానం





ఏ పంట నుంచైనా అధిక దిగుబడులు సాధించాలంటే రైతు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం విత్తనం నాణ్యత. సాధారణంగా రైతులు విత్తనాలను పరిశోధన స్థానాలు, ఎన్.జి.ఒ.లు లేదా ఇతర ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తారు. వివిధ కారణాల వల్ల విత్తనాలు నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల రైతులు విత్తన కొనుగోలు తర్వాత మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలకశాతం అధికంగా ఉంటేనే మొక్కల సాంద్రత బాగుండి, దిగుబడి అధికంగా వస్తుంది.




నాణ్యమైన విత్తనం లక్షణాలు: విత్తనం రైతుల ఎంచుకున్న రకానికి మాత్రమే చెందింది అయి ఉండాలి. విత్తనం వందశాతం జన్యుస్వచ్చత కలిగి ఉండాలి.  భౌతిక స్వచ్చత అనేది విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండి తాలు, సగం నిండిన గింజలు ఉండకూడదు.  కొనుగోలు చేసిన విత్తనాల్లో వరి రకానికి చెందిన విత్తనాలు, కలుపు విత్తనాలు, మట్టి పెడ్డలు, ఇసుక దుమ్ము ఉండకూడదు.  విత్తనం ఎల్లప్పుడు సురక్షితమైన ప్యాకింగ్ చేసి పూర్తి వివరాలతో ముద్రించిన లేబుల్ కలిగి ఉండాలి.


వివిధ పంటలలో మొలక శాతం: వరి 80 శాతం, గోధుమ 85 శాతం, జొన్నలు 75శాతం, మొక్కజొన్న - సూటి రకాలు 90శాతం, సంకర రకాలు 80 శాతం, సజ్జ, కొర్ర 75శాతం, శనగ 85శాతం, అపరాలు 75 శాతం, కూరగా యలు 60-70శాతం మొలకశాతాన్ని కలిగి ఉండాలి. నూనె గింజలు... సోయా చిక్కుడు, అముదం, వేరుసెనగ 70శాతం, పొద్దుతిరుగుడు, నువ్వులు 80 శాతం, నార పంటలు (పత్తి, గోగు) 75 శాతం మొలక శాతాన్ని కలిగి ఉండాలి.



రైతు స్థాయిలో మొలకశాతం తెలుసుకునే పద్ధతులు


 గుడ్డలో మూటకట్టు పద్ధతిః వంద విత్తనాలు తడిగుడ్డలో మూటకట్టి ప్లేటులో పెట్టి తరచూ మూటను నీటితో తడుపుతూ ఉండాలి. విత్తనాలు మొలకలొచ్చాక లెక్కించి మొలకశాతాన్ని తెలుసుకోవచ్చు.




ట్రే పద్ధతి / కుండీ పద్దతి: ఈ పద్ధతి లావుగింజలైన ఆముదం, శనగ, పత్తి, వేరు సెనగ మొదలైన విత్తనాల నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయో గించవచ్చు. ఇందులో మొదట ఒక ప్లాస్టిక్ ట్రే గాని లేదా కుండీనిగాని తీసు కొని ఇసుకతో నింపాలి. తదుపరి వంద విత్తనాలు అంగుళం లోతుగా నిర్ణీత స్థలంలో విత్తుకోవాలి. ఇసుకను నీటితో తడుపుతూ ఉంటే 7-10 రోజుల్లో మొలకలు వస్తాయి. అప్పుడు రైతులు వందకు ఎన్ని మొలకలొచ్చాయో లెక్కించి మొలకశాతం తెలుసుకోవచ్చు. ముందుగా నిర్దేశించిన శాతం కంటే తక్కువగా మొలకలు వస్తే నాణ్యత లోపించిన విత్తనంగా భావించాలి.




పెట్రీ డిష్ పద్దతి: చిన్న సైజు విత్తనాలు అనగా వంగ, టమాటా, మిరప మొదలు విత్తనాలు మొలక శాతం ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు


ఇందులో మొదట పెట్రిడిష్ లో బ్లాటింగ్ పేపర్ అమర్చి మూత పెట్టాలి. తేమ ఆరిపోకుండా బ్లాటింగ్ పేపరును నీటితో తడుపుతూ ఉండాలి. మొలకెత్తిన గింజలను లెక్కించి మొలకశాతాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.


పేపర్ టవల్ పద్ధతి: ఈ పద్ధతి ముఖ్యంగా వరి, పత్తి, పొద్దుతిరుగుడు జొన్న తదితర విత్తనాల్లో మొలకశాతం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ముందుగా పేపర్ టవల్ లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటితో తడపాలి. తదుపరి నేలపై పరిచి వంద విత్తనాలు వరుసగా అమర్చాలి. ఇప్పుడు మరొక వస్త్రాన్ని లేదా పేపర్ టవల్ గాని విత్తనాలపై కప్పాలి. తర్వాత రెండింటిని ఒక చాపలా చుట్టి చివర్లను దారంతో కట్టి ఏదైనా లోతైన పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. తేమ అరిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నీటితో తడుపుతూ ఉంటే మొలకలు రావడం జరుగుతుంది



గమనిక: మొలకశాతాన్ని లెక్కించేటప్పుడు కుళ్లిపోయిన, మొలకరాని గట్టి విత్తనాలు, బూజుపట్టిన వేరు కాండం, పూర్తిగా అభివృద్ధి చెందని, బలహీ నంగా ఉన్న మొక్కలను పరిగణలోకి తీసుకోకూడదు.

మొలకశాతం తగ్గడానికి కారణాలు:

 అధిక తేమశాతం వల్ల విత్తనాల నిల్వలో త్వరగా మొలకశాతం క్షీణిస్తుంది. 

రైతులు పరిపక్వతకు రాని గింజల నుంచి విత్తనాలను సేకరించినప్పుడు. 

వివిధ రకాల చీడపీడలు, శిలీంద్రాలు సోకినప్పుడు, గాలి, వెలుతురు లేని గదుల్లో నిల్వ చేయడం వల్ల మొలకశాతం తగ్గిపోతుంది. 

ఎరువులు, పురుగులు, మిరపకాయల బస్తాల పక్కన విత్తనాలను నిల్వ చేయడం. 

విత్తనం చుట్టూ అనుకూలమైన ఉష్ణోగ్రత, ఆక్సీజన్ సరఫరా లేకపోవడం. 

మురుగునీరు తీసే సదుపాయం లేక పోవడం 

దుక్కి సరిగా దున్నకపోవడం

కలుపు మందులు పిచికారి పట్ల అవగాహన లేకపోవడం వల్ల కూడా మొలక శాతం ఉన్న మొక్కలు పెరగకపోవడం వంటివి ప్రధాన కారణాలు



మొలకశాతం పెరగాలంటే:


పరిపక్వత వచ్చిన గింజల నుంచి విత్తనాలు సేకరించాలి.

విత్తనాలు నిల్వచేసే ముందు విత్తనాలు తేమ శాతం తగినంత మాత్రమే ఉండేలా చూసుకోవాలి. 

వివిధ రకాల పంటలను బట్టి 9-12 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. 

విత్తనాలను కొనేటప్పుడు ఖచ్చితంగా లేబుల్ మీద మొలకశాతం పరీక్షించిన తేదీ, విత్తనం వాడకపు సమయాన్ని చూసి కొనుగోలు చేయాలి. 

విత్తుకునే ముందు విత్తన బస్తాను తీసి విత్తనం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. ఎందుకంటే నిల్వ సమయంలో వరి, గోధుమ, మొక్కజొన్న విత్తనాలు వడ్లచిలుక, ముక్కు పురుగు వంటివి ఆశించి విత్తనాన్ని మొలకెత్తకుండా చేస్తాయి. 

 విత్తనం నాటినప్పుడు కావాల్సిన తేమ, ఉష్ణోగ్రతను చూసుకోవాలి. సాధారణంగా పంటలను బట్టి 13 నుంచి 43 సెం. గ్రే. ఉష్ణోగ్రత వరకు మొలకెత్తుతాయి. 

వరిలో కత్తెర పంట, వర్షాకాలంలో మొల కెత్తిన విత్తనాలు, నారుమడిలో చల్లినా అధిక ఉష్ణోగ్రతల వల్ల మొలక నారుగా మారదు. అలాగే యాసంగిలో అధిక చలి వల్ల కూడా మొలకశాతం తగ్గి మొలక పెరగదు. 

విత్తనం వేసేముందు ఖచ్చితంగా విత్తనశుద్ధి చేసి నట్లయితే మొలకశాతం పెరగడమే కాకుండా ప్రధాన పంటలు కూడా దాదా పుగా 20-30 రోజుల వరకు పంటను కాపాడుకోవచ్చు....









Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు