మధ్యప్రదేశ్లో అక్టోబర్ నుండి కొత్త మిరప రాబడి 🌶️

  






మధ్యప్రదేశ్లో అక్టోబర్ నుండి కొత్త మిరప రాబడి



గుంటూరు: దేశంలోని ప్రముఖ మిరప ఉత్పాదక రాష్ట్రాలలో మరియు వినియోగ కేంద్రాలలో భారీగా సరుకు నిల్వలు ఉన్నాయి మరియు నిరంతరంగా సరుకు సరఫరా అవుతున్నందున, ధరలు తగ్గుతున్నాయి. రాబోవు సీజన్లో తేజ ధర రూ. 10000ప్రతిక్వింటాలు స్థాయికంటే తగ్గవచ్చు. ఎందుకనగా, రాబోవు సీజన్కోసం అన్ని రాష్ట్రాలలో విస్తీర్ణం పెరిగింది మరియు మిగులు నిల్వతో కొత్త సీజన్ ప్రారంభమయ్యే అవకాశం కలదు. ఇందుకు ముఖ్యకారణమేమనగా, అక్టోబర్ మధ్య నుండి మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు. ఇంతవరకు వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, సరుకు రంగు నాణ్యంగా ఉండే అవకాశం కలదు. దీనితో నవంబర్ నుండి మర ఆడించే యూనిట్ల ద్వారా కొనుగోళ్లు ఉండగలవు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం మిరప ధరను రూ. 7000 ప్రకటించింది. కావున, ఏ రకం ధర కూడా రూ.8000 కంటే తక్కువ ఉండదు. రాబోవు సీజన్లో స్టాకిస్టుల తగ్గుదలకు అవకాశమున్నప్పటికీ, తక్కువ ధరతో ఎగుమతి డిమాండ్ పెరగవచ్చు. 


గతవారం గుంటూరులో 5 రోజుల మార్కెట్లో 4 లక్షల బస్తాల రాబడిపై గుంటూరు కోల్డుస్టోరేజీల సరుకు 1.70 లక్షల బస్తాలు, పరిసర ప్రాంతాల కోల్డ్ స్టోరేజీల సరుకు 60000 బస్తాలు కలిసి 2.30 లక్షల బస్తాల సరుకు అమ్మకం కాగా, ఇందులో తేజ డీలక్స్ రూ. 300, మీడియం, మీడియం బెస్ట్, 355 బ్యాడ్లీ, ఆర్మూరు రకాలు రూ. 500, సింజెంటా బ్యాడ్లీ, 4884 రకాలు రూ. 400, 334, సూపర్-10 రకాలు రూ. 300 మరియు అన్ని మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 800-1000 తగ్గగా, 341, నెం.5, డిడి డీలక్స్ మరియు తాలు రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. గుంటూరు మార్కెట్లో అన్ని మీడియం, మీడియం బెస్ట్ రకాల రాబడులు అధికంగా ఉన్నాయి. మరోవైపు గత ఏడాది మిగులు నిల్వలు కూడా అధికంగా అమ్మకానికి వస్తున్నాయి. అయితే, కొనుగోలుదారులు అవసరానికి అనుగుణంగానే కొనుగోలచేస్తున్నారు. లభించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాల వలన రాబోవు పంటకు లాభం చేకూరే అవకాశం కలదు. 

         గుంటూరు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రూ. 13500–14800, డీలక్స్ రూ. 14900-15000, మీడియం బెస్ట్ రూ. 12500–13400, మీడియం రూ. 11000-12400, బ్యాడ్లీ -355 రకం రూ. 12500–16000, సింజెంటా బ్యాడ్లీ రూ. 11000-12800, డిడి రూ. 11000-14000, 341 రకం రూ. 11000-14300, డీలక్స్ రూ. 14400-14500, నెం.-5 రకం రూ. 11000-13300, డీలక్స్ రూ. 13400-13500, 273 రకం రూ.11000-13800, 334 మరియు సూపర్ -100 రకాలు రూ. 10,000-11,300, డీలక్స్ రూ. 11400-11500, మీడియం బెస్ట్ రూ. 8000-9900, మీడియం రూ. 7000-7900, 334, సూపర్ -10 గత ఏడాది సరుకు రూ. 8000-10500, ఆర్మూరు రకం రూ. 9000-11000, 4884 రకం రూ. 11000-12800, రోమీ రకం రూ. 11000-13800, బంగారం రకం రూ.9000-11500, మీడియం బెస్ట్ మరియు సీడ్ రకం రూ. 8500-10800, తేజ తాలు రూ. 8000-8700, తాలు రూ. 4000-7000 ధరతో వ్యాపారమయింది.




ఖమ్మంలో గతవారం 10–11వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 15100, మీడియం రూ. 14000-14500, తాలు రూ. 8300 మరియు 2000–2100 బస్తాల రైతుల సరుకు రాబడిపై నాణ్యమైన తేజరూ. 11600, తాలు రూ. 7000 మరియు వరంగల్లో గతవారం 20-25 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 15200, మీడియం రూ. 13000–14600, నాణ్యమైన వండర్ హాట్ రూ.16300, మీడియం బెస్ట్ రూ.14000-1500, నాణ్యమైన 341 రకం రూ. 14500, మీడియం బెస్ట్ రూ. 13000-14000, 1048 మీడియం రూ. 12000, దీపికా రూ. 15500, మీడియం రూ. 13000, నాణ్యమైన టమోటా రూ. 19000, మీడియం రూ. 16000-18000, సింగిల్ పట్టీ రూ. 16000, 334 రకం రూ. 12000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.




హైదరాబాద్లో గతవారం 4-5 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 14500, మీడియం రూ. 13000-14000, నాణ్యమైన 273 రకం రూ. 1500-14000, మీడియం రూ. 11000-13000, 341


నాణ్యమైన సరుకు రూ. 15000, మీడియం రూ. 13000-14000, నాణ్యమైన సూపర్ -10 రకం రూ. 11400-11500, మీడియం రూ. 10000-11000, లాల్కట్ రూ. 8000, తేజ తాలు రూ. 6000-7000, నాణ్యమైన హైబ్రిడ్ తాలు రూ. 5000, మీడియం రూ. 3500-4500 ధరతో వ్యాపారమయింది.




కర్నాటకలోని బ్యాడ్లీలో సోమ మరియు గురువారాలలో కలిసి 25-30 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 10000 బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో డబ్బీ డీలక్స్ రూ.22000-24000, నాణ్యమైన డబ్బీ రూ. 20000–22000, డీలక్స్ కెడిఎల్ రూ. 19000-21000, మీడియం రూ. 15000-18000, 2043 డీలక్స్ రకం రూ. 17000–18000, మీడియం రూ. 13000–16000, తాలు రూ. 4000-6500 మరియు 2000 బస్తాల రైతుల సరుకు రాబడిపై కెడిఎల్ మరియు 2043 నాణ్యమైన సరుకు రూ. 10000-12000, మీడియం రూ. 4500-6000, తాలు రూ. 3000-3500, హిందూపూర్లో మంగళవారం 1500 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సింజెంటా బ్యాడ్లీ రూ. 10000-16500, జిటి రకం రూ. 8500-12500, 5531 రకం రూ. 12000-13500, మీడియం తేజ రూ. 10000-10800, తాలు రూ.4500-5000, నాన్ ఎసి తాలు రూ. 3500-4000 వ్యాపారమయింది. నాన్ ఎసి తాలు రూ.3500-4000 ధరతో వ్యాపారమయింది.




ఛత్తీస్గడ్ లోని జగదల్పూర్లో గతవారం 5-6 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ మరియు సన్ రకాలు రూ. 12000-15000, 4884రకం రూ. 11000-13000, తేజ తాలు రూ. 8000-9000 ధరతో. వ్యాపారమయింది. తమిళనాడులోని రామనాథపురంలో 100 బస్తాల రాబడిపై నాణ్యమైన రంగు సరుకు గుండు రూ. 30000–34000, మీడియం రూ. 28000-30000, యావరేజ్ రూ.25000-28000, తాలు రూ. 3600-4000, హైబ్రిడ్ తాలు రూ.3800-3900 మరియు ఎసి సరుకు రూ. 36000-40000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog