మిర్చి పంటకు తోడ్పడిన సానుకూల వాతావరణం- వివిధ మార్కెట్లలో గతవారం మిర్చి ధరలు

 

మిర్చి పంటకు తోడ్పడిన సానుకూల వాతావరణం


 దేశంలోని ప్రముఖ మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాబోయే పంటకు అత్యంత ప్రయోజనం చేకూరుతున్నట్లు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దక్షిణాది రాష్ట్రాల స్టాకిస్టులు మరియు రైతులు చౌక ధరలతో సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మార్కెట్లలో శీతల గిడ్డంగుల నుండి రాబడి అయిన సరుకు మొత్తం విక్రయించడంలో విఫలమవుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో రాబోయే పంట దిగుబడులు వృద్ధి చెందే అంచనాతో పలువురు రైతులు పచ్చిమిరపకాయలనే కోసి విక్రయిస్తున్నారు. 


అయితే కూరగాయ మార్కెట్లలో కూడా వీటి ధరలు రాణించడంలేదు. ఈ ఏడాది కూరగాయల మార్కెట్లలో మిర్చి నాణ్యత మరియు ఆకారం పరిశీలిస్తే రాబోయే పంట దిగుబడులు భారీగా ఉండగలవని స్పష్టమవుతున్నది. అక్టోబర్ చివరి వారం వరకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మార్కెట్లలో మిర్చి రాబడులు ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇదే విధంగా దీపావళి తర్వాత కర్ణాటకలోని బ్యాడ్లీ మరియు తెలంగాణలోని మహబూబ్నగర్ ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కాగలవు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్ సోమవారం (సెప్టెంబర్ 27) మూసి ఉండగలదు. గత సోమవారం శుక్రవారం జరిగిన ఐదు రోజుల లావాదేవీలలో మొత్తం 3.75 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, ఇందులో గుంటూరు శీతల గిడ్డంగుల సరుకు 2 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి మరో 25 వేల బస్తాలు కలిసి మొత్తం 2.25 లక్షల బస్తాల సరుకు విక్రయించబడింది. ఇందులో తేజ డీలక్స్, ఎక్స్ట్రా డినరీ, సింజెంట బడిగ, నెం. 5, 334, సూపర్-10 రూ. 300, బడిగ-355 రూ. 500, తాలు కాయలు తేజ డీలర్స్తో పాటు ఇతర డీలక్స్ రకాలు రూ. 200 వృద్ధి చెందగా, మీడియం, మీడియం బెస్ట్ రకాల ధరలు చెక్కుచెదరలేదు. ఎందుకనగా, రాబోయే రోజులలో డీలక్స్ రకాల ధరలు వృద్ధి చెందే అంచనాతో వ్యాపారులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచకపోడమే ఇందుకు ప్రధాన కారణం. మీడియం, మీడియం బెస్ట్ రకాలకు డిమాండ్ నెలకొన్నందున బెస్ట్, మీడియం బెస్ట్ రకాల ధరలు రూ. 200-300 వృద్ధి నమోదు చేసింది. అక్టోబర్ 15 వరకు అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇదిలా ఉండగా, దసరా తర్వాత మధ్యప్రదేశ్లో కొత్త మిర్చి రాబడి కాగలదని తెలుస్తోంది. సెప్టెంబర్ 27న భారత్ బంద్ నిర్వహిస్తున్నందున మార్కెట్ యార్డులలో ఎలాంటి లావాదేవీలు ఉండవు.


గుంటూరులో నిల్వ అయిన తేజ నాణ్యమైన సరుకు రూ. 1,00,000, రూ. 14,300-14,400, ఎక్స్డినరి రూ. 14,500-14,600, మీడియం బెస్ట్ రూ. 11,500-12,000, మీడియం రూ.10,500-11,400, బడిగ-355 రూ.13,000-15,800, డీలక్స్ రూ. 15,900-16,000, సింజెంట బడిగ రూ. 10,500-12,300, డీలక్స్ రూ.12,400-12,500, డిడి, 341 రూ. 11,000-13,500, నెంబర్-5 రూ.11,000-13,000, డీలక్స్ రూ.13,100-13,200, 273 రూ. 11,000-13,000, 577 రకం రూ.10,000-11,800, డీలక్స్ రూ. 11,900-12,000, 334, సూపర్-10 రూ. 9500-10,800, డీలక్స్ రూ. 10,900-11,000, ఎక్స్ ట్రాడినరి రూ.11,100-11,300, మీడియం బెస్ట్ 800090400 మీడియం రూ.7000-7900, 334, సూపర్-10 (బిఎఫ్) రూ. 7000- 10,000, 4884 రూ. 10,500-12,300, డీలక్స్ - రూ.12,400-1,2,500, రోమి రకం రూ. 10,500-12,800, డీలక్స్ రూ. 12,900-13,000, ఆర్మూరు రకం రూ. 9000-10,500, బంగారం సరుకు రూ. 9000-10,800, డీలక్స్ రూ.10,900-11,000, మీడియం, మీడియం బెస్ట్ మరియు అన్ని సీడ్ రకాలు రూ. 8500-10,800, తాలు రూ.7500-8500, ఇతర రకాల తాలు రూ. 3500-70000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 తెలంగాణలోని ఖమ్మంలో గత వారం 22 వేల బస్తాల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 1,300 మీడియం రూ. 13,500-14,000, తాలు 7300.

వరంగల్లో 30-35 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ రూ.14,000, మీడియం రూ.12,000-13,000, వండర్ ట్ నాణ్యమైన సరుకు రూ. 15,500, మీడియం రూ. 14,000-15,000, 341, రూ.3,700, మీడియం రూ. 12,000-13,000, డిడి రూ. 14,000, 1048 రూ. 13,000, దీపిక రూ. 25,500, టమాట రూ. 19,000, సింగిల్ పట్టి రూ. 16,500, 334 రూ. 11,000, తాలు కాయలు రూ.4000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

హైదరాబాద్ మార్కెట్లో గత వారం 2500-3000 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 13,500-14,000, మీడియం రూ. 12,000-13,000, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 11,200, మీడియం రూ.10,000-10,500, 273 రూ. 12,500-13,000, మీడియం రూ. 11,000-12,000, 341 రూ. 13,500, మీడియం రూ. 12,500-13,000, లాల్-కట్ రూ.8000-9000, తాలు కాయలు తేజ రూ.6000–7500, మీడియం రూ. 4500-5000, తాలు కాయలు హైబ్రిడ్ రూ.3500-4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 కర్ణాటకలోని బ్యాడ్గిలో  గత సోమ, గురువారాలలో కలిసి 300 బస్తాల కొత్త సరుకు రాబడిపై జిటి నాణ్యమైన సరుకు రూ. 9000-11,000, తాలు కాయలు రూ. 4000-5500 మరియు 30 వేల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై 10 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా డబ్బి నాణ్యమైన సరుకు రూ. 17,000-19,000, కెడిఎల్ డీలక్స్ రూ. 17,000-18,100, మీడియం రూ. 14,000-16,000, 2043 డీలక్స్ రూ. 13,000-14,000, మీడియం రూ. 12,000-14,000, 5531 రకం రూ. 10,800-12,000, డిడి రూ. 10,500-12,00, 334, సూపర్-10 రూ. 9000-10,500, తాలు కాయలు రూ. 4000-5000

 సింధనూరులో మంగళవారం 2 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సింజెంట బడిగ రూ. 13,500-15,000, బడిగ రూ. 12,000-13,000, 5531 రకం రూ. 12,500-13,000, మీడియం రూ.10,000-10,500, జిటి రూ. 9000-11,000, తాలు కాయలు రూ. 300-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని రామనాథపురంలో మిరప రాబడులు తగ్గి 70-80 బస్తాలకు మాత్రమే పరిమితమయ్యాయి. గుండు మిరప నాణ్యమైన సరుకు రూ.30,000-34,000, మీడియం రూ. 28,000-30,000, యావరేజ్ రూ. 22,000-27,00, తాలు కాయలు రూ. 3800-4000 ధరతో వ్యాపారమైంది.

 జగదల్ పూర్లో గత వారం 4-5 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై తేజ, సన్-గ్రో రూ. 11,000-13,600, 4884 రూ. 10,00000-12,000, తాలు తేజ రూ. 7500-8000 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు