ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మిరప రాబడి 🌶️

 








ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మిరప రాబడి 🌶️

12-09-2021



హిందూపూర్లో గురవారం 800-1000 బస్తాలు మరియు

 కర్నాటకలోని బ్యాడ్డీలో సోమ మరియు గురువారాలలో కలిసి 400 బస్తాలు

మధ్య ప్రదేశ్లోని బేడియాలో ఆదివారం 20-25 బస్తాల కొత్త మిరప రాబడి ప్రారంభమయింది. 


తెలంగాణాలో మంచి వర్షాల వలన ఇప్పటికీ పంట నాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుత నిల్వల పరిస్థితి మరియు మసాలా యూనిట్ల కొన గోళ్లు సాధారణ స్థాయిలో ఉన్నందున ధరల పెరుగుదల అవకాశాలు దాదాపు సమాప్తమయ్యాయి.

 ఎందుకనగా, వచ్చే నెల చివరినాటికి మధ్యప్రదేశ్ మరియూ కర్నాటకలలో రాబడులు పెరిగే అవకాశం కలదు. 







అయితే, నవంబర్ చివరి వరకు హైదరాబాద్ మార్కెట్లో తెలంగాణ కొత్త సరుకు రాబడులు పెరగగలవు. ఎందుకనగా, ధరలు మెరుగ్గా ఉన్నందున రైతులు నిమ్ము సరుకు కూడా సరఫరా చేసే అవకాశ ముంది.

 దేశంలో మొత్తం కలిసి 2021-22 కోసం ఉత్పత్తి సమృద్ధిగా ఉండే అంచనా కలదు. వరంగల్లోని 23 కోల్డు స్టోరేజీలలో కలిసి  సెప్టెంబర్-8 వరకు 13.78 లక్షల బస్తాల సరుకు నిల్వలు ఉన్నాయి.

 మరియు సరుకు అమ్మకాలు పెరగకపోవడంతో కర్నాటకలోని బ్యాడ్జీలో సోమ, గురు వారాలలో కలిసి 30 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై కేవలం 30 శాతం సరుకు అమ్మకమయింది. హిందూపూర్లో గురువారం 800-1000 బస్తాల కొత్త మిరప రాబడిపై నాణ్యమైన సరకు రూ.14800, మీడియం రూ. 10000-14500, మధ్య ప్రదేశ్లోని బేడియాలో ఆదివారం 20-25 బస్తాల కొత్త మిరప రాబడిపై నిమ్ము సరుకు రూ. 11000-12000, కర్నా టకలోని బ్యాడ్డీలో సోమ, గురువారా లలో కలిసి 400 బస్తాల రాబడిపై 15 శాతం నిమ్ము సరుకు జిటి రకం రూ. 8500-10500, తాలు రూ. 4000-5500 ధరతో వ్యాపారమ యింది. 




దీనితో గుంటూరులో స్టాకిస్టుల అమ్మకాలు పెరుగుతున్నాయి.


గతవారం గుంటూరులో సోమ, మంగళ వారాలలో భారీ వర్షాల వలన 50 శాతం సరుకు మీడియం, మీడియంబెస్ట్ తో పాటు 50 శాతం సరుకు డీలక్స్ రకాలు రాబడి అయినప్పటికీ కొనుగోలుదారులు తమ అవసరానికి అనుగు ణంగానే కొనుగోలుచేస్తున్నారు. గుంటూరులో గతవారం 4 రోజుల వ్యాపారంలో 3.50 లక్షల బస్తాల రాబడి కాగా, ఇందులో గుంటూరు కోల్డుస్టోరేజీల నుండి 1.30 లక్షల బస్తాలు మరియు పరిసర కోల్డుస్టోరేజీల నుండి 40 వేల బస్తాలు కలిసి 1.70 లక్షల బస్తాల సరుకు అమ్మకం కాగా, తేజ డీలక్స్, సింజెంటా బ్యాడ్లీ, డిడి, 273 రకం, 334, సూపర్-10 రకం, 4884, ఆర్మూరు, 577 రకాలు రూ.300 మరియు 355 బ్యాడ్లీ, నెం.5, తేజ తాలు, తాలు రకాలు రూ. 200 మరియు అన్ని మీడియం, మీడియం బెస్ట్, రోమి రకాలు రూ.500, గత సంవత్సరం మిగులు నిల్వలలో అన్నిరకాలు రూ.300 తగ్గాయి.


గుంటూరు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రూ. 13000–13800, డీలక్స్ రూ. 13900-14000, ఎక్స్ట్రార్డినరీ రూ. 14100-14200, మీడియం బెస్ట్ రూ. 11500-12900, మీడియం రూ.10500-11400, బ్యాడ్జీ -355 రకం రూ.12500-15800, సింజెంటా బ్యాడ్జీ రూ. 10500-12000, డీలక్స్ రూ. 12100–12200, డిడి రూ.11000-13000, 341 రకం రూ. 11000-13500, నెం.5 రకం రూ. 11000-12500, డీలక్స్ రూ.12600-12800, 273 రకం రూ. 11000-13200, 577 రకం రూ. 10000-11600, 334 మరియు సూప ర్-10 రకాలు రూ. 9500-10800, డీలక్స్ రూ. 10900-11000, మీడియం బెస్ట్ రూ. 8000-9400, మీడియం రూ. 7000-7900, 334, సూపర్ -10 గత ఏడాది సరుకు రూ. 7500-10000, 4884 రకం రూ. 10500-12300, రోమి రకం రూ. 10500-12800, ఆర్మూరు రకం రూ. 9000-10500, బంగారం రకం రూ. 9000-10800, డీలక్స్ రూ. 10900-11000, మీడియం బెస్ట్ మరియు అన్ని సీడ్ రకాలు రూ. 8000–10800, తేజ తాలు రూ. 7500-8200, తాలు రూ. 3500-6800 ధరతో వ్యాపారమయింది.

 ఖమ్మంలో గతవారం 6-7 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 14000, మీడియం రూ. 13000-13500, తాలు రూ. 8000 మరియు 1200-1300 బస్తాల రైతుల సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 10500, తాలు రూ. 8000 మరియు 1200-1300 బస్తాల రైతుల సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 10500, తాలు రూ. 6500, 

వరంగల్లో గతవారం 10-12 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 12000-14000, వండర్ హాట్ రూ.13500-15000, 341 రకం రూ. 12500-14500 ధరతో వ్యాపారమయింది


హైదరాబాద్ లో గతవారం 3 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్య__ మైన తేజ రూ. 14500, మీడియం రూ. 13000-14000, నాణ్యమైన సరుకు273.రకం రూ. 13500, మీడియం రూ.11000-13000, 341 నాణ్యమైన సరుకు రూ.15000, మీడియం రూ.13000-14000, సూపర్-10 రకం రూ. 10000-11500, లాల్కట్ రూ. 8000-9000, తేజ తాలు రూ. 6000-7000, నాణ్యమైన హైబ్రిడ్ తాలు రూ. 5000, మీడియం రూ. 3500 - 4500, డిడి తాలు రూ. 4000 ధరతో వ్యాపారమయింది.


కర్నాటకలోని బ్యాడ్లీలో సోమ మరియు గురువారాలలో కలిసి 30 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 8-9 వేల బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో, డబ్బీ డీలక్స్ రూ.21000-23000, నాణ్యమైన డబ్బీ రూ. 18000-20000, డీలక్స్ కెడిఎల్ రూ. 18000-20000, మీడియం రూ. 15000-18000, 2043 డీలక్స్ రకం రూ. 17000-18000, మీడియం రూ.13000-16000, 5531 రకం రూ. 10800-12200, 334 మరి యు సూపర్-10 రకాలు రూ. 9000-10500, తాలు రూ. 4000-6000 మరియు సోమవారం 500 బస్తాల రైతుల సరుకు రాబడిపై కెడిఎల్ మరియు 2043 నాణ్యమైన సరుకు రూ. 10000-12000, మీడియం రూ. 4500-6000, తాలు రూ. 3000-3500,

 సిందనూరులో మంగళవారం 1000బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సింజెంటా బ్యాడ్లీ రూ. 11000-16500, జిటి రూ. 10000-11000, 5531 రకం రూ. 11500-12000, తాలు రూ. 3000-4000 మరియు 200 బస్తాల రైతుల సరుకు రాబడిపై జిటి రకం రూ. 7000-8000, హైబ్రిడ్ తాలు రూ. 1500-2000 ధరతో వ్యాపా రమయింది. 

ఛత్తీస్గడ్ లోని జగదల్పూర్లో గతవారం 3-4 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ మరియు సన్ రకాలు రూ.11000-14000, 4884 రకం రూ. 11000-12500, తేజ తాలు రూ. 8000-8500 ధరతో వ్యాపా రమయింది.

 తమిళనాడులోని రామనాథపురంలో 100 బస్తాల రాబడిపై నాణ్య మెన సరుకు రూ.33000-34000, మీడియం రూ.27500-30000, యావరేజ్ రూ. 24000-27000, తాలు రూ. 3700-3800, ఎసి సరుకు రూ. 37000-40000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.












Comments

Popular posts from this blog