తగ్గిన వేరుసెనగ విస్తీర్ణం - ధరలకు పెరుగుతున్న మద్దతు

 









తగ్గిన వేరుసెనగ విస్తీర్ణం - ధరలకు పెరుగుతున్న మద్దతు



         2020-21 పంట సంవత్సరం (జూలై-జూన్) లో వేరుసెనగ ఉత్పత్తి 102.10 ల.ట. సరుకు దిగుబడి అయింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ (2021-22) లో దేశంలో వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 49 ల.హె.కు పరిమితం కాగా ఉత్పత్తి 83.30 ల.ట. సరుకు దిగుబడి కాగలదని భావిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ ఉత్పత్తితో పోలిస్తే 3 శాతం తగ్గే అంచనా వ్యక్తమవుతున్నది. ఎందుకనగా, గుజరాత్లో వేరుసెనగ విస్తీర్ణం తగ్గి 19.10 ల.హె.కు పరిమితం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక లాంటి ఇతర ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో కూడా వేరుసెనగ సేద్యం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. ఖరీఫ్ సీజన్ సేద్యం దాదాపు ముగిసినట్లేనని భావిస్తున్నారు. ఈ ఏడాది లభ్యమైన లాభసాటి ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఏడాదికి ధీటుగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో రబీ మరియు యాసంగి సేద్యం విస్తృతపరిచే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, తెలంగాణ లాంటి వేరుసెనగ ఉత్పాదక కేంద్రాల వద్ద సేద్యం కోసం భారీ డిమాండ్ నెలకొన్నందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 100-150 వృద్ధి చెందింది.


ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో గత వారం జరిగిరిన ఐదు రోజుల లావాదేవీలలో 20-25 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై కొత్త సరుకు రూ.5270-6386, కర్నూలులో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ 240 కిలోలు రూ. 19,400, 

కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 20-25 వేల రూ.5500-6750, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 9700-9800, చెన్నై డెలివరి రూ. 10,000, 70-80 కౌంట్ స్థానికంగా రూ. 10,200-10,300 ముంబై కోసం రవాణా అవుతున్నది. 60-70 కౌంట్ రూ. 11,000, ముంబై డెలివరి రూ. 11,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఉత్తరప్రదేశ్లోని మైనురి, ఇటా శీతుల గిడ్డంగుల నుండి ప్రతి రోజు 4-5 వాహనాల వేరుసెనగ అమ్మకంపై హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 9600-9700 

మరియు పశ్చిమ బంగలోని కోలకతా, మిడ్నపూర్ మరియు బీహార్లోని పూర్ణియా, ఖరగూర్ మరియు పరిసర ఉత్పాదక ప్రాంతాల శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు రూ.5000-5500, హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 8000-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.

 గుజరాత్లోని దిసా, గోండల్, పాలన్పూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై జి-20 ఎక్స్ట్రా రకం రూ. 6750-6900, మీడియం రూ. 6000-6700, టిజె-37 రకం 80-90 కౌంట్ వేరుసెనగ గింజలు కొత్త సరుకు రూ. 9500-9600, 60-70 కౌంట్ బోర్డు సరుకు రూ. 9800-9900, 50-60 కౌంట్ రూ. 10,500, రోహిణి-24 నాణ్యమైనసరుకు రూ. 6250-6500, మీడియం రూ. 6000-6250, యావరేజ్ సరుకు రూ. 6000-6150 మరియు 1000 బస్తాల కొత్త సరుకు రాబడిపై నంబర్-37 నిమ్ము సరుకు రూ. 3950-4250, మీడియం రూ. 3300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని జైగుండం, దిండిగల్, తిరువన్నామలై, శివగిరి ప్రాంతాలలో ప్రతి రోజు 4-5 బ వేరుసెనగ రాబడిపై రూ. 6200-6600, 

అలంగుడిలో హెచ్పిఎస్ గింజలు 50-60 వేల కౌంట్ రూ. 11,200, 80-90 కౌంట్ రూ. 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది


కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, యాద్గిర్, లక్ష్మేశ్వర్, హుబ్లీ, రాయిచూర్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5500-6920, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ రూ. 9500, 90-100 కౌంట్ రూ. 9200, 140–160 కౌంట్ రూ. 8200, కళ్యాణి రూ. 8300 ధరతో వ్యాపారమైంది..





Comments

Popular posts from this blog