లాభాల పంట క్యాలీఫ్లవర్

 







లాభాల పంట క్యాలీఫ్లవర్

సాగుకు అనువైన సమయం ఇదే


తక్కువ వ్యవధిలో అధిక ఆదాయం వచ్చే క్యాలీఫ్ల వర్ సాగుకు రైతులు మక్కువ చూపుతున్నారు. మూడు నెలల కాలంలో ఖర్చులు పోను పెట్టుబ డిలో 45 నుంచి 85 శాతం వరకు ఆదాయం వస్తుం దనే నమ్మకాన్ని అన్నదాతలు వ్యక్తం చేస్తూ సాగుకు సన్నద్ధమవుతున్నారు. నీరు ఇంకే గరప నేలలు అనుకూలం.







ఎకరాకి 15 వేల మొక్కలు




 రైతులు కర్ణాటక రాష్ట్రంలోని షేడ్ నెట్ నర్సరీల నుంచి 21 నుంచి 25 రోజుల వయసు గల నారును.. మొక్క రూపాయి చొప్పున కొనుగోలు చేసి తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. మరికొందరు రైతులు కిలో విత్తనాలు రూ. 750కు కొని ఎత్తయిన మళ్లలో నారు పోస్తున్నారు. కౌలుతో కలుపుకొని సాగు ఖర్చులు ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతాయని సాగుదారులు విశ్లేషిస్తున్నారు. ఎకరంలో 15 వేల మొక్కలు నాటుతారు. పంట కోతకు వచ్చే నాటికి ఎకరాకు 14. వేల నుంచి 12 వేల పువ్వుల వరకు దిగుబడి వస్తుంది.






సాగుకు  చీడపీడలు ఆశించకుండా..



పంటకు చీడపీడలు ఆశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉద్యానశాఖాధికారి ఎస్. అహ్మద్ వివరించారు.

ప్రతి 25 వరుసల క్యాలీఫ్లవర్ మొక్కల తరువాత రెండు వరుసల్లో ఆవాల మొక్కలు నాటుకుంటే చీడ పీడలు తగ్గుతాయి. పురుగులు ఆవాల ఆకులపై గుడ్లు పెడతాయి. వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేసి తక్కువ ఖర్చుతో సస్యరక్షణ చర్యలు చేపట్టి పువ్వును కాపాడుకోవచ్చు. లింగాకర్షక ఎరలను ఎకరానికి ఐదారు ఏర్పాటు చేసుకుంటే చిలక పురుగు, డైమండ్ మాధ్ నివారణతో పాటు పువ్వు నాణ్యత, పరిమాణం తగ్గకుండా చూసుకోవచ్చు.


పెట్టుబడికి డోకా లేదు



ఈ సాగు కలిసివస్తే లాభాలు బాగుంటాయి. లేదంటే పెట్టుబడి వరకు వచ్చేస్తుంది. ప్రధాన మార్కెట్ హైదరాబాద్. ఈ ఏడాది రవాణా, మార్కెట్ అనుకూలంగా ఉన్నాయి. నారు, విత్తనాల ధరలు గత ఏడాది కన్నా పెరిగాయి. గత ఏడాది నష్టాలు రాలేదు. ఈ ఏడాది ఒక్కో పువ్వు రూ.9 నుంచి రూ.7 వరకు ధర పలకవచ్చు. ఈ ఏడాది మహారాష్ట్ర పంట ఆలస్యంగా మార్కెట్కు వస్తుందనే సమాచారం పంటపై ఆశలు రేపుతోంది.



రైతేరాజు

Comments

Popular posts from this blog