పెరగనున్న మినుముల రాబడులు - ధరల వివరాలు

 




పెరగనున్న మినుముల రాబడులు


      మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్లో మినుము పంట నూర్పిళ్లు శరవేగంతో చేపడుతున్నారు. మరో రోజులలో రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాబడులు పోటెత్తుతున్నాయి. డ్యామేజ్ సరుకు రాబడి అవుతుండగా, నాణ్యమైన సరుకు కోసం తమిళనాడు నుండి డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. అయితే మున్ముందు ఒక దశలో మందగమనం పొడసూపిన తర్వాత బలోపేతం చెందగలవని వ్యాపారులు భావిస్తున్నారు.


ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 8 వరకు దేశంలో మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 38.82 ల.హె. నుండి పెరిగి 38.89 ల.హె.కు విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలలో పేర్కొన్నది. 

ఇందులో మహారాష్ట్రలో 3.89 ల.హె. నుండి పెరిగి 4.32 ల.హె.,

 రాజస్తాన్లో 3.77 ల.హె. నుండి 3.97 ల.హె., 

ఉత్తరప్రదేశ్లో 6.87 ల.హె. నుండి 6.99 ల.హె., 

గుజరాత్లో 1.00 నుండి 1.55 ల.హె. విస్తరించగా, 

కర్ణాటకలో 1.07 ల.హె. నుండి తగ్గి 96 వేల హెక్టార్లు,

 తెలంగాణలో 18 వేల హెక్టార్ల నుండి 17 వేల హెక్టార్లకు పరిమితమైంది. 

అంతర్జాతీయ విపణిలో డాలర్లు పెరిగి 930 డాలర్, ఎస్క్యూ 45 డాలర్లు వృద్ధి చెంది 1110 డాలర్ ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 7150, పాత సరుకు రూ. 7050, చెన్నై డెలివరి ఎస్క్యూ రూ. 8000, ఎఫ్ఎక్యూ రూ. 6900, కోల్కతాలో రూ. 7000, దిల్లీలో ఎస్క్యూ రూ. 8300, ఎఫ్ఎక్యూ రూ.7200 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 7900, అన్-పాలిష్ రూ. 7500, 

నంద్యాలలో పాలిష్ మినుములు రూ. 7500, అన్-పాలిష్ రూ.7300, 

ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలలో పాలిష్ సరుకు రూ. 7400, అన్- పాలిష్ రూ. 7200, 

గుంటూరులో దిగుమతి అయిన సరుకు ఎస్క్యూ రూ. మయన్మార్ మినుములు ఎఫ్ఎక్యూ 58100, ఎఫ్ఎక్యూ రూ. 7000, 

విజయవాడలో గుండు పప్పు రూ. 12,200, మీడియం రూ. 10,500, పప్పు రూ.8600-9600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 4-5 వేల రాబడిపై రూ. 6500-7400, 

సోలాపూర్లో 8-10 వేల బస్తాలు రూ. బస్తాల సరుకు 6500-7525, 

దూదినిలో 1000-1200 బస్తాలు,బార్షీలో 1500-2000 బస్తాలు, మురుంలో 500-600 బస్తాలు, అహ్మద్ నగర్లో 1500 బస్తాలు రూ. 5000-7500, అకోలాలో మోగర్ మినుములు బోర్డు సరుకు రూ. 9900-10,000, మీడియం రూ.9400-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రూ.6800-7000, 

రాజస్తాన్లోని కేక్లో 1500-2000 బస్తాల పాత సరుకు రాబడిపై రూ. 6500-6800, 

ఉత్తరప్రదేశ్లోని చందౌసిలో 500-600 బస్తాల కొత్త మినుముల రాబడిపై రూ. 6800-6900 లోకల్ లూజ్ మరియు లారీ బిల్టి రూ. 7350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.












Comments

Popular posts from this blog