పసుపు సాధారణ గిరాకీ

 




గతవారం ఆంధ్ర, తెలంగాణా, మహా రాష్ట్రలలోని పసుపు ఉత్పాదక కేంద్రాలలో వర్షాల వలన మార్కెట్లలో రాబడులు తగ్గినప్పటికీ ధరలు ఎక్కువగా పెరగలేదు.

 నిజామాబాద్లో గతవారం 4-5 వేల బస్తాల రాబ డిపై అన్పాలిష్ కొమ్ము రూ. 6700-7300, గట్టా రూ. 6400-6800, పాలిష్ కొమ్ము రూ. 8100-8200, గట్టా రూ. 7700-7800,

వరంగల్ 2-3 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5500-5900, గట్టా రూ. 5400-5700, 

కేసముద్రంలో 500-600 బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5500-6500, గట్టా రూ. 5000-6000, 

దుగ్గిరాలలో 1400-1500 బస్తాల రాబ డిపై మీడియం కొమ్ము మరియు గట్టా రూ. 5700-5800, నాణ్యమైన సరుకు రూ.6020 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయింది.



వరంగల్ కోల్డుస్టోరేజీలలో సెప్టెంబర్-8 వరకు దాదాపు 3.65 లక్షల బస్తాల నిల్వలు ఉనాయి. 

తెలంగాణ, ఆంధ్ర మరియు మహారాష్ట్రలలో భారీగా సరుకు నిల్వలు ఉన్నాయి.

 ఈ సరుకు జనవరి వరకు అమ్మకం కావడం అసంభవంగా కనిపిస్తున్నది. కావున కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కాగలదు. లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, కోల్ కత్తా ప్రాంతాలలో భారీగా సరుకు నిల్వలు ఉన్నాయి.

 ఎందుకనగా, ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన తరువాత అనేక మంది వ్యాపారులు స్పెక్యులేటర్లు విడుదల చేసే అంచనాలను నమ్మి రూ.10-12 వేలు ప్రతి క్వింటాలుకు చేరవచ్చన్న అంచనాతో సరుకు నిల్వచేయడం జరిగింది. 

ఎందుకనగా, ధరలు హెచ్చుముఖంలో ఉన్న సమయంలో అనేక మంది స్పెషల్ మీడియా వారు కూడా ధరల పెరుగుదలకు దోహదం చేశారు. మొత్తం మీద ఇందులో అందరూ విఫలమయ్యారు. 

వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రతివారం పసుపు వాయిదా గరిష్టంగా రూ. 8300 మరియు కనిష్టంగా రూ. 7800 వరకు చేరుతుంది. కావున రూ. 7900-8000 కొనుగోలు చేయడం మరియు రూ.800-800 విక్రయించడం లాభదాయకంగా ఉండగలదు. గతవారం ఇలాంటి పరిస్థితి ఉండడంతో పాటు ఎన్సిడిఇఎక్స్ సెప్టెంబర్ వాయిదా సోమవారం రూ. 7690 తో ప్రారంభమైన తరువాత గురువారం వరకు రూ. 196 పెరిగి రూ. 7886, అక్టోబర్ వాయిదా రూ. 280 పెరిగి రూ. 8080తో ముగిసింది. 


వ్యాపారస్తుల అంచనా ప్రకారం రాబోవు పంట పరిస్థితి మెరుగ్గా ఉంది

Comments

Popular posts from this blog