దేశంలో ఊపందుకున్న కొత్త వేరుశనగ రాబడులు - గత వారం మార్కెట్ ధరలు
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
18-10-2021
దేశంలోని ప్రముఖ వేరుశనగ ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం
రాజస్థాన్ లోని బికనీర్, జోధ్ పూర్ ప్రాంతాలలో వారంలో 70-80 వేల బస్తాలు,
ఆంధ్ర, కర్నాటకలలో 75-80 వేల బస్తాలు,
గుజరాత్ లక్ష బస్తాలు,
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో దినసరి 20-25 వేల బస్తాలు, మౌరానీపూర్, కరేలీ, మహోబా, ఛత్తర్పూర్ ప్రాంతాలలో 70-80 వేల బస్తాలు సహా దాదాపు లక్ష బస్తాల రాబడిపై 7-8 శాతం తేమ మరియు 65-70శాతం గింజ కండీషన్ సరుకు రూ. 4500-5000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.
దీసా, గోండల్, పాలన్పూర్ ప్రాంతాలలో వారంలో 15-20 వేల బస్తాల కొత్త వేరుశనగ రాబడిపై రూ. 4750-5500, 6-8 వేల బస్తాల పాత సరుకు రాబడిపై 24, రోహిణి, టిజె 37 రకం రూ. 5400-6000 ధరతో లోకల్లూజు వ్యాపారమయింది.
గతవారం కర్నూలు, ఆదోని,ఎమ్మిగనూరు లలో వారంలో 20-25 వేలబస్తాల వేరుశనగ రాబడిపై నిమ్ము రకం రూ. 4000-4500, నాణ్యమైన సరుకు రూ. 5600-6500, 80-90 కౌంట్ రూ. 9600-9700, కళ్యాణదుర్గ, రాయదుర్గ, మడకశిర ప్రాంతాలలో గతవారం 20-25 వేల బస్తాల రాబడిపై రూ. 6000-6700, 80-90 కౌంట్ రెడీ సరుకు రూ. 10000, చెన్నై డెలివరీ రూ. 10200, 70-80 కౌంట్ స్థానికంగా రూ. 10400 ధరతో వ్యాపారమై తెలంగాణ, కర్నాటకలోని కోలారు జిల్లాలో విత్తనాల కోసం రవాణా అవుతున్నది. 60-70 కౌంట్ ఉత్తరప్రదేశ్ రాయలసీమ, హైదరాబాద్ డెలివరీ రూ. 10800 -11000 ప్రతిక్వింటాలు డెలివరీ ధరతో వ్యాపామయింది.
రాజస్తాన్లోని ఉత్పాదక కేంద్రాలలో వారంలో దాదాపు 70-80 వేల బస్తాల రాబడిపై నిమ్ము రకం రూ. 3500-4500, నాణ్యమైన సరుకు రూ. 4700 -5200 లోకల లూజు ధరతో వ్యాపారమయింది.
తమిళనాడులోని జయగుండం, దిండిగల్, శివగిరి, తిరుకోవిలూరు, కొడుముడి ప్రాంతాలలో కలిసి వారంలో 7-8 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6500 7200, మీడియం రూ. 5000 -5500,
త్రిచంగోడ్, ఆలంగుడి లలో 2-3 వేల బస్తాల వేరుశనగ గింజల అమ్మకంపై ప్రతి 240 కిలోలు రూ. 18200-21600 ధరతో వ్యాపారమయింది.
గుజరాత్ ప్రభుత్వం ప్రస్తుత ఖరీప్ సీజన్కోసం విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 20.65 లక్షల హెక్టార్ల నుండి తగ్గించి 19.09 లక్షల హెక్టార్లు ఉన్నట్లు అంచనా వేసింది. ఎందుకనగా, జూలై, ఆగష్టులలో అనావృష్టి మరియు తరువాత వర్షాల వలన పంట ప్రభావిత మయింది. అయితే, దిగుబడి పెరగడంవలన ఉత్పత్తి 39.94 లక్షల టన్నులు ఉండే అంచనా కలదు. లభించిన సమాచారం ప్రకారం రాష్ట్రప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 5550 ప్రతిక్వింటాలుతో కొనుగోలుకు సిద్ధమౌతున్నది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు