పసుపు ధరలు పెరిగే అవకాశం లేనట్లే, పెరుగుతున్న స్టాకిస్టుల అమ్మకాలు - గత వారం మార్కెట్ ధరలు

 
12-10-2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80 వేల బస్తాలకు పెగా పసుపు అమ్మకం కోసం టెండర్ జారీ చేసింది. అయితే మార్కెట్లో గిరాకీ తక్కువగా ఉన్నందున కేవలం 200 టన్నుల రూ. 5200 ధరతో అమ్మకమెంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో పంట పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే స్టాకిస్టుల అమ్మకాలు పెరిగే అవకాశం కలదు. ఎందుకనగా వచ్చే ఏడాది కూడా ధరలు పెరిగే అవకాశం లేదని వీరు అంచనా వేస్తున్నారు.


గత వారం ఎన్ సిడి ఇఎక్స్ సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 7208తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 12 పెరిగి రూ. 7220, నవంబర్ వాయిదా రూ. 10 పెరిగి రూ. 7340 వద్ద ముగిసింది. 

నిజామాబాద్లో గత వారం 4-5 వేల బస్తాల పసుపు రాబడిపై అన్ పాలిష్ కొమ్ము రూ.6500-7100, గట్టా రూ. 6300-6400, పాలిష్ కొమ్ము రూ. 7400-7500, గట్టా రూ. 7100-7200

 మరియు వరంగల్ 700-800 బస్తాల రాబడిపె కొమ్ము రూ. 5400-5850, గట్టా రూ. 5000-5400, 

కే సముద్రంలో 400 - 500 బస్తాల రాబడి పై మీడియం కొమ్ము రకం రూ. 5000 - 5800, గట్టా రకం రూ. 4500-5500 ధరతో వ్యాపారమెంది.


ఆంధ్రలోని దుగ్గిరాలలో గత వారం 700-800 బస్తాల పసుపు రాబడిపై కొమ్ము, గట్టా రకాలు రూ. 5500-5625, మీడియం రూ. 5100 -5200, పుచ్చురకం రూ. 4000-4500 ధరతో వ్యాపార మెంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిల్వల నుండి 84 వేల బస్తాలు (ప్రతి బస్తా 50 కిలోలు) లేదా సుమారు 4 వేల టన్నుల పసుపు అమ్మకం కోసం టెండర్ జారీ చేయగా, కేవలం 200 టన్నుల సరుకు కొనుగోలుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. తద్వారా పసుపు ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకనగా ఈరోడ్ వ్యాపారులు 25-30 లారీల సరుకు శ్రీలంకకు ఎగుమతి చేయగా, ఎగుమతి చేసిన సరుకుకు చెల్లింపులు లభించలేదు. దీనివలన కూడా డిమాండ్ పై ప్రభావం పడుతున్నది. 

మహారాష్ట్రలోని హింగోళిలో గత వారం 10-12 వేల బస్తాల రాబడిపె కొమ్ము రూ. 5700 6500, గట్టా రూ. 5600-6000,

 నాందేడ్ 3-4 వేల బస్తాల అమ్మకంపె కొమ్ము రకం రూ. 6000 6600, గట్టా రకం రూ. 5500 6200, 

సాంగ్లీలో 3–4 వేల బస్తాల అమ్మకంపె రాజాపురి మీడియం రూ.6500-7500, దేశీ కడప రకం రూ. 6000–6200, 

బస్మత్ నగర్లో 3-4 వేల బస్తాల అమ్మకంపె కొమ్ము రకం రూ. 5800-6500, గట్టా రూ. 5500 -6200 ధరతో వ్యాపారమెంది.

 తమిళనాడులోని ఈరోడ్లో గత వారం 10-12 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ము రకం రూ. 6500-7500, గట్టా రూ. 6000-6500, పుచ్చు రకం కొమ్ము, గట్టా రకాలు రూ.3500-4000, 

పురుందురెలో 1500-2000 బస్తాల రాబడిపై కొమ్ము రకం రూ. 5839 -7299, గట్టా రూ. 5529-6699 ధరతో వ్యాపారమెంది.


























రూ. 6300-6400, పాలిష్ కొమ్ము

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు