పసుపు అమ్మకాలకు సిద్దమవుతున్న స్టాకిస్టులు - గత వారం మార్కెట్ ధరలు



 18-10-2021

అన్ని ఉత్పాదక కేంద్రాలలో భారీగా పసుపు నిల్వలు ఉన్నందున మరియు మార్కెట్లో గిరాకీ తక్కువగా ఉన్నందున ధరల పెరుగుదలకు అవకాశాలు సమాప్తమయ్యాయి. జనవరి మొదటి వారంలో మిగులు నిల్వలు మరియు కొత్త సీజన్లో ఉత్పత్తి కలిసి 2022 డిసెంబర్ వరకు వినియోగంతో పోలిస్తే అధికంగా ఉండే అవకాశమున్నందున చిన్న స్టాకిస్టులు బయట పడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.


దేశంలో భారీగా పసుపు నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు తరచుగా లక్షలాది బస్తాల ఉత్పత్తి మరియు మిగులు నిల్వలు ఉన్నట్లు ప్రచారం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ ధర తగ్గి రూ. 4000 కు చేరే అవకాశం లేదు. కేవలం సాధారణ స్థాయిలో వ్యాపారం ఉండగలదు. లభించిన సమాచారం ప్రకారం ఒకవేళ ఏప్రిల్ వాయిదా రూ. 6000 కంటే అధికంగా ఉంటే కొనుగోలు చేయడం మరియు రూ.7500 ధరతో విక్రయించడం లాభదాయకంగా ఉండగలదు. ఎందునకనగా, డెలివరీ సమయంలో కొనుగోలుదారులు కనుమరుగవుతారు. వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రతిసంవత్సరం మాదిరిగా నిజామాబాద్ లో డిసెంబర్ చివరినాటికి కొత్త పసుపు రాబడులు ప్రారంభం కాగలవు. అయితే, ఆర్మూరు, మెట్పల్లి తదితర ప్రాంతాల సరుకు జనవరిలోపు రాబడి కాదు.

 ఎన్సీడిఇఎక్స్ సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 7220 తో ప్రారంభమైన తరువాత గురువారం వరకు రూ. 180 పెరిగి రూ. 7400, నవంబర్ వాయిదా రూ. 56 తగ్గి రూ. 7282 తో ముగిసింది.

 నిజామాబాద్ లో మంగళ మరియు బుధ వారాలలో కలిసి 2 వేల బస్తాల రాబడిపై అన్ పాలిష్ కొమ్ము రూ.6500-7000, గట్టా రూ.6200-6500, పాలిష్ కొమ్ము రూ.7500-7600, గట్టా రూ. 7200–7300, 

వరంగల్ 500-600 బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5300-5700, గట్టా రూ. 5000 -5300, 

కేసముద్రంలో 200 -250 బస్తాల రాబడిపై మీడియం కొమ్ము రూ.5000-5700, గట్టా రూ. 4500-5500 మరియు

 దుగ్గిరాలలో సోమవారం 200 బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్టా మీడియం రూ.5300-5500, నాణ్యమైన సరుకు రూ. 5700, పుచ్చు రకం రూ. 4000-4500 ధరతో వ్యాపారమయింది.


మహారాష్ట్రలోని హింగోలిలో బుధవారం 3 వేల బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్టా రూ. 5500-6500, 

నాందేడ్ లో మంగళ, బుధ వారాలలో కలిసి 1500-2000 బస్తాల అమ్మకంపై కొమ్ము రూ. 6000-6500, నాణ్యమైన గట్టా రూ. 6000-6500, పుచ్చు రకం కొమ్ము మరియు గట్టా రూ.3500-400, 

పెరుందరైలో 1500 బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5714-7544, గట్టా రూ. 5489-6969 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు