దేశంలో ప్రముఖ పెసల ఉత్పాదక రాష్ట్రమైన రాజస్తాన్లో ఈ ఏడాది పెసల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. అయితే, ఉత్పాదకులకు మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ.7275 కు గాను రూ. 5000 -6600 నాణ్యతానుసారం లభ్యమవుతున్నది. తద్వారా రాజస్తాన్ ప్రభుత్వం నవంబర్ 1 నుండి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 357 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.
అంతేకాకుండా, మినుముల కొనుగోలు కోసం మరో 168 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సరుకు విక్రయించే రైతులు అక్టోబర్ 20 నుండి తమ పేర్లు నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్ మార్కెట్లలో ఖరీఫ్ సీజన్ పెసల రాబడులు క్షీణించాయి. రాబోయే రబీ మరియు గ్రీష్మకాలం కోసం తమిళనాడు ప్రభుత్వం 12 శాతం నిమ్ము సరుకు 3367 టన్నుల పెసలు రూ. 7275 ప్రతి క్వింటాలు ధరతో కొనుగోలు చేయబడుతుందని ప్రకటించింది. రాబోయే రబీ, గ్రీష్మకాలం కోసం దేశంలో పెసల సేద్యం భారీ విస్తరించగలదని వ్యాపారులు భావిస్తున్నారు. నవంబర్-జనవరి మధ్యకాలంలో ఎప్పుడైనా ధర రూ. 500-700 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందే అవకాశం ఉంది.
మహారాష్ట్ర ప్రాంతం మిల్లు రకం పెసలు తమిళనాడులోని చెన్నై, ట్రిచి, మదురై డెలివరి రూ. 6750-6800,
కర్ణాటక 90:10 రకం సరుకు రూ. 7300, 80:20 రకం సరుకు రూ. 7100 7150, 50:50 రకం సరుకు రూ.6800-6900,
ఆంధ్ర ప్రాంతం సన్న పెసలు రూ. 6600-6650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
రాజస్థాన్ లోని కేక్లో 3 వేల బస్తాల పెసల రాబడిపై రూ. 6000-6600, సుమేర్ పూర్ లో 400-500 బస్తాలు రూ. 5000-7400, మాల్పురాలో 2000–2200 బస్తాలు రూ. 5000-6600, జైపూర్లో రూ. 6500-7200, పప్పు రూ. 7600-8500, మిటుకులు రూ. 7700-7800 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.
గత వారం మధ్యప్రదేశ్ లోని పిపరియా, హర్దా, జబల్ పూర్ ప్రాంతాలలో కలిసి ప్రతి రోజు 8-10 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-7150, ఇండోర్లో రూ. 6500- 7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని కల్బుర్గిలో ప్రతి రోజు 2500-3000 బస్తాల రాబడిపై రూ. 4000-6650, సింధగి, షాబాద్, హుమ్నాబాద్ మార్కెట్లలో రూ. 6000-6500, యాద్గిర్లో 1200–1500 బస్తాలు రూ. 6500-7100, బీదర్లో 2 వేల బస్తాలు రూ. 6200-7000, గదగ్లో 2 వేల బస్తాలు రూ. 5800-7100 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు