తగ్గిన యాలకుల రాబడులు - ధరల వివరాలు

 

18-10-2021

గత వారం దక్షిణాది రాష్ట్రాలలోని వేలం కేంద్రాల వద్ద దసరా పండుగ వలన మసాలా బోర్డు వద్ద నాలుగు రోజులు మాత్రమే వేలాలు నిర్వహించబడ్డాయి. ఇందులో 3,90,697 కిలోలు సరుకు రాబడిపై ధరలు చౌకగా ఉన్నందున రాబడి అయిన సరుకులో 13-14 వేల కిలోలు మాత్రమే అమ్మకం కాలేదు.యాలకుల పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. గత వారం కేరళలోని పలు జిల్లాలలో కుండపోత వర్షాలు కురిసినందున పంట కోతలకు జాప్యం ఏర్పడింది. 


తద్వారా ఉత్తర భారత వ్యాపారులు ధరల ఉధృతి కొనసాగుతున్నందున సరుకు విక్రయించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. గడిచిన కొన్నేళ్ల క్రితం కుండపోత వర్షాలు, వరదలు సంభవించి యాలకుల పంటకు తీరని నష్టం వాటిల్లగా ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎందుకనగా తోటల యజమానులు ఈసారి ఎత్తైన ప్రాంతాలలో మొక్కలు నాటినందున వరదనీరు తక్షణమే దిగువకు జారిపోయినందున పంటకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. 

ప్రస్తుతం మొదటి విడత కోతల ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే మూడు, నాలుగో దశ కోతల సరుకు నాణ్యత, గింజ ఆకారం మరియు రంగు అత్యంత సంతృప్తికరంగా ఉండడమే కాకుండా భారీ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ధరలు ఇనుమడించినట్లయితే, తక్షణమే సరుకు విక్రయించి బయట పడడం శ్రేయస్కరం. వచ్చే సంవత్సరం ధరలు పెరిగే అవకాశమే లేదు. ఎందుకనగా, ఇప్పటికీ పాత సరుకు నిల్వలు అమ్మకం కాకుండా పేరుకుపోవడమే ఇందుకు నిదర్శనం.


అక్టోబర్ 11 సోమవారం నిర్వహించిన వేలంలో 72,901 కిలోల సరుకు రాబడిపై 69,721 కిలోలు సరుకు అమ్మకం కాగా ప్రతి కిలో కనిష్ఠ ధ రూ. 1007.25, గరిష్ఠ ధర రూ. 1314,

 మంగళవారం 25,427 కిలోల నుండి 24,674 కిలోలు కనిష్ఠ ధర 1000.31, గరిష్ఠ ధర రూ. 1354, మధ్యాహ్న వేలంలో 80,650 కిలోల నుండి 79,249 కిలోలు అమ్మకంపై 1039.19, గరిష్ఠ ధర రూ. 1522, 

బుధవారం 64,912 కిలోల నుండి 61,912 కిలోలు కనిష్ఠ ధర రూ. 10302.01, గరిష్ఠ ధర రూ. 1459, మధ్యాహ్న వేలంలో 61,489 కిలోలు రాబడి కాగా 60,362 కిలోలు అమ్మకంపై కనిష్ఠ ధర రూ. 1017.27, గరిష్ఠ ధర రూ. 1504 మరియు 

గురువారం 85,218 కిలోల నుండి 82,575 కిలోల సరుకు అమ్మకంపై కనిష్ఠ ధర రూ. 1000.67, గరిష్ఠ ధర రూ. 1357 ధరతో వ్యాపారమైంది.





Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు