అక్టోబర్ 25 తర్వాత దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో సోయాచిక్కుడు రాబడులు పోటెత్తనున్నాయని తెలుస్తోంది. సోయాచిక్కుడు సేద్యం విస్తృతంగా చేపట్టినప్పటికీ ఉత్పత్తి తగ్గగలదని కేంద్ర ప్రభుత్వం మరియు కొందరు నూనెగింజల వ్యాపారులు అంచనా వ్యక్తమవుతున్నది.
ఎందుకనగా, కొన్ని ప్రాంతాలలో కుండపోత వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో వర్షాల లేమితో పంటకు నష్టం వాటిల్లడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వంటనూనెల ధరలను దృష్టిలో పెట్టుకొని కొన్నింటిపై దిగుమతి సుంకం ఎత్తివేయగా రిఫైండ్ నూనెలపై తగ్గించింది. ప్రస్తుతం క్రషింగ్ మిల్లులకు సాధారణ కొనుగోళ్లు ప్లాంట్ డెలివరి ధర తగ్గి రూ.5200-5400 వద్ద కదలాడుతున్నది. తద్వారా ధర గరిష్ఠంగా రూ. 200-300 తగ్గే అవకాశం ఉంది. తత్ఫలితంగా సోయాచిక్కుడు ధరలకు మందగమన ఛాయలు తొలగినట్లేనని భావించవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల వినియోగం బయో-డీజిల్ తయారీ కోసం వినియోగం వృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకం భారీగా తగ్గించినందున ప్రపంచ వ్యాప్తంగా ధరలు వృద్ధి చెందాయి. ఎందుకనగా, ప్రపంచంలో అతిపెద్ద వంటనూనెల దిగుమతి దేశంగా భారత్ ప్రసిద్ధి చెందడమే ఇందుకు ప్రధాన కారణం. కావున భారత్కు దిగుమతులు పోటెత్తగలవని ఎగుమతి దేశాలు ఆశిస్తున్నాయి.
రాబోయే సీజన్ కోసం దేశంలో ఆవాల సేద్యం గణనీయంగా విస్తరిస్తోంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం 2022 ఎప్పుడైనా దిగుమతి పునఃరుద్ధరించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో రాబోయే ఆగస్టుకు ముందు భారత సోయాచిక్కుడు ధర పెరిగి రూ.7500 అధిగమించడం తప్పదని చెప్పవచ్చు. అమెరికాలో సెప్టెంబర్ సోయా క్రషింగ్ ఆగస్టుతో పోలిస్తే 2.4 శాతం తగ్గి గడిచిన మూడు నెలలలో భారీగా తగ్గి 15,50,72,000 బుషెల్ క్రషింగ్ చేపట్టబడింది. సిబిఒటి వద్ద సోయాచిక్కుడు నవంబర్ వాయిదా 6.75 సెంట్లు వృద్ధి చెంది 12.02 డాలర్ ప్రతి బుషెల్కు చేరింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు