దక్షిణాది రాష్ట్రాలలో గత వారంతో పోలిస్తే ప్రస్తుతం చింతపండుకు గిరాకీ కొరవడినందున ధరలు స్తంభించాయి. దసరా పండుగ తర్వాత కొనుగోళ్లు ఊపందుకోగలవని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే, స్టాకిస్టు వ్యాపారుల తమ నిల్వలు సరుకు శరవేగంతో విక్రయిస్తున్నందున ధరలపై ఒత్తిడి పెరుగుతున్నది.
ప్రస్తుతం మహారాష్ట్రతో పాటు దక్షిణ భారత మార్కెట్లలో చింతపండు రాబడులు పోటెత్తుతున్నాయి. నాణ్యత గత ఏడాదితో పోలిస్తే సంతృప్తికరంగా ఉంది. కాయ ఆకారం భారీగా ఉన్నందున బరువు తూగుతున్నది.తమిళనాడు మరియు కర్ణాటకలో వేలాడుతున్న కాయల ఛాయాచిత్రాలను వాట్సాప్ ద్వారా పంపుతున్నాము. తద్వారా పంటపై వ్యాపారులకు అవగాహన ఏర్పడగలదు.
ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 8-10 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సిల్వర్ మేలిమి రకం రూ. 18,000-25,000, మేలిమి రకం నాణ్యమైన సరుకు రూ. 14,000-18,000, మీడియం రూ. 11,000-13,000, యావరేజ్ సరుకు రూ. 9000-11,000, ఫ్లవర్ రూ. 7000-8500, మీడియం రూ.5000-6500, యావరేజ్ రూ. 4000-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం మీడియం, యావరేజ్ సరుకులకు డిమాండ్ ఉండగా ఈ వారం అన్ని రకాల సరుకు కొరవడింది.
విజయనగరం, పార్వతీపురం, రాయగడ, సాలూరు ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 25 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సెమీ ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 9000, మీడియం రూ. 7000, యావరేజ్ సరుకు రూ. 5400-5500, గింజ సరుకు రూ.3400-3600 మరియు సరిహద్దు ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ గత వారం 15-20 వాహనాల సరుకు అమ్మకంపై గింజ సరుకు రూ. 3300, ఎండు సరుకు రూ. 3500 ధరతో వ్యాపారమై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.
పుంగనూరు, పలమనేరు, మదనపల్లి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 20 వాహనాల సరుకు అమ్మకంపై మేలిమి రకం రూ. 14,000-15,000, మీడియం రూ. 11,500-12,500, చపాతీ రూ. 8500-9000, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 7000-8000, స్థానికంగా రూ. 6000-6500, గింజ సరుకు రూ. 3000–3300, నలగ్గొట్టని చింతపండు రూ. 2200-2400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్లో 4-5 వాహనాల సరుకు అమ్మకంపై ఓం బ్రాండ్ రూ. 8500, మీడియం ఫ్లవర్ నలుపు సరుకు రూ.6500-7500, గింజు సరుకు రూ. 2500-2800 ధరతో వ్యాపారమై గింజ సరుకు తమిళనాడుకు మరియు కోల్కతా కోసం మరియు ఫ్లవర్ మీడియం సరుకు మహారాష్ట్ర, గుజరాత్ కోసం రవాణా అవుతున్నది. ఉన్హేల్లో ప్రతి రోజు 5-6 వాహనాల గింజ సరుకు తమిళనాడు, కోల్కతా డెలివరి రూ.2500-2800, ఫ్లవర్ గుజరాత్ డెలివరి రూ. 6500-6700, తరానాలో 4 వాహనాల సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ. 7000–7300 ధరతో వ్యాపారమై సూరత్ కోసం రవాణా అవుతున్నది.
కర్ణాటకలోని బెల్గాంలో గత వారం 2 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై మహారాష్ట్ర ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 11,500-12,000, అహ్మద్ నగర్ సరుకు రూ. 8500-10,000, స్థానికంగా రూ. 7000-8000, మైసూరులో 4 వాహనాలు మేలిమి రకం రూ. 12,000-14,000, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 7500-8000, తుంకూరులో 2-3 వాహనాల సరుకు అమ్మకంపై సిల్వర్ రకం నాణ్యమైన సరుకు రూ. 18,000-20,000, మేలిమి రకం నాణ్యమైన సరుకు రూ. 14,000-15,000, మీడియం రూ. 10,000–11,000, యావరేజ్ సరుకు రూ. 5000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని పాపరపట్టిలో మేలిమి రకం 15 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై మహారాష్ట్ర చపాతీ రూ.8200-8500, స్థానికంగా రూ. 7500, మహారాష్ట్ర నాణ్యమైన గింజ సరుకు నలుపు రకం రూ. 3500-3600, రంగు వెలిసిన సరుకు రూ. 3300-3500, స్థానికంగా రూ. 3500-3600,
చింతగింజలు : ప్రస్తుతం దేశంలో చింతగింజల ఉత్పాదక కేంద్రాల వద్ద నిల్వలు హరించుకుపోయాయి. ప్రస్తుతం కాయలు రాల్చిన తర్వాత ఫ్లవర్ మరియు చపాతీ సరుకుల నుండి గింజలు తీయడం బాగా తగ్గిస్తున్నారు.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు