ఊపందుకున్న కొత్త చింతపండు రాబడులు

 

మహారాష్ట్రలో కొత్త చింతపండు రాబడులు ఊపందుకుంటున్నాయి. అయితే వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా వచ్చే వారం నుండి మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో కొత్త చింతపండు రాబడులు ప్రారంభం అయ్యే అంచనా ఉండడంతో ధరలు స్థిరంగా ఉండ వచ్చని అదే విధంగా మార్చి, ఏప్రిల్ వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలలో రాబడులు పెరిగే అవకాశం కలదని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు.



మహారాష్ట్రలోని బార్టీలో దినసరి 400-500 బస్తాల కొత్త చింతపండు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9000-12,000, మీడియం రూ. 7000-7500, యావరేజ్ రూ.5000-6500 మరియు గత వారం కేరళలోని ఫాల్గట్లో 2-3 వాహనాల చింతపండు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9000-10,000, గింజ సరుకు రూ. 4000-5500 మరియు ఛత్తీస్గఢ్ ని జగదల్పూర్లో దినసరి 2-3 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 3100-3200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఉత్తర భారతం కోసం రవాణా అయింది.


ఆంధ్రప్రదేశ్లోని హిందూపుర్ మార్కెట్లో గత వారం 55-60 వాహనాల కొత్త చింతపండు రాబడిపై సిల్వర్ రకం రూ. 19,000-26,000, మేలిమి రకం రూ. 14,000-17,000, మీడియం రూ. 11,000- 13,000, యావరేజ్ రూ. 9000-10,500, నాణ్యమైన ఫ్లవర్ రకం రూ. 7000-8500, మీడియం రూ.6000-7000, యావరేజ్ రూ. 4000-5000 మరియు పుంగనూరు, పలమనేరు, మదనపల్లి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 10-15 వాహనాల అమ్మకం కాగా, మేలిమి రకం రూ. 11,500-13,000, చపాతీ రకం రూ. 9500, ఫ్లవర్ రకం రూ. 7400-7500, మీడియం రూ.5500-6000, గింజ సరుకు రూ. 3100-3200 మరియు విజయనగరం, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలలో ఒక వారంలో 4-5 వాహనాల కొత్త చింతపండు రాబడి కాగా, మీడియం సెమీ ఫ్లవర్ రూ. 6300, గింజ సరుకు రూ.3200-3300 మరియు 8-10 వాహనాల శీతలగిడ్డంగుల సరుకు అమ్మకంపై సెమి ఫ్లవర్ నాణ్యమైన సరకు రూ. 9000, మీడియం రూ. 7050-7100, యావరేజ్ రూ. 5250-5500, గింజ సరుకు రూ. 3000-3200 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.


చింతామణి మార్కెట్లో గురువారం నాడు 10 వాహనాల రాబడిపె మేలిమి రకం రూ. 11,000-15,000, ఫ్లవర్ రకం రూ. 7000-8000, మీడియం ఫ్లవర్ రూ.4500-6000, గింజ సరుకు రూ. 3000-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పుంగనూరు కోసం రవాణా అవుతోంది. కర్ణాటకలోని తుంకూరులో గత సోమ, గురువారాలలో కలిసి 8-10 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా సిల్వర్ రకం రూ. 18,000-25,000 మేలిమి రకం రూ. 14,000-16,000, మీడియం రూ. 11,000-13,000, ఫ్లవర్ రకం సరుకు రూ.5000-7000, నలగ్గొట్టని చింతపండు రూ.1750-2000, బెల్గాంలో గత బుధవారం 5-6 వాహనాల కొత్త చింతపండు రాబడిపై ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8000-10,000, మీడియం రూ. 7000-8000, యావరేజ్ సరుకు రూ. 5500-6500, చెల్లకేరిలో వారంతపు సంతరోజు 25-30 వాహనాల సరుకు రాబడిపై మేలిమి రకం రూ. 9000-11,800, ఫ్లవర్ రూ. 5000-6300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని ఇండోర్ 5-6 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ మీడియం రూ.5500-6500, గింజ సరుకు రూ. 2400-2900, ఓం బ్రాండ్ రూ. 8500 మరియు తరానా, ఉన్హేల్లో 3-4 వాహనాల ఎసి సరుకు అమ్మకం కాగా, రంగువెలిసిన గింజ సరుకు రూ. 2400-2600, రంగు సరుకు రూ.2700-2800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.


తమిళనాడులోని క్రిష్ణగిరిలో గత వారం 4-5 వేల బస్తాల కొత్త చింతపండు రాబడిపై గింజ సరకు రూ. 4000-5000, మీడియం రూ. 3200-4000, యావరేజ్ రూ. 2500-3200 మరియు పాపరపట్టిలోని 10-15 వాహనాల శీతలగిడ్డంగుల సరుకు అమ్మ కంపై మహారాష్ట్ర చపాతీ రూ. 7700, స్థానికంగా జ సరుకు రూ. 2700-2800 మరియు సేలంలో 8-10 వాహనాల సరుకు రాబడి కాగా, మేలిమి రకం రూ. 11,000-15,000, ఫ్లవర్ రూ. 6000-8000, గింజ సరుకు రూ. 3000-3200, కంబంలో 3-4 వాహనాలు, ధర్మపురి, దిండిగల్లో 2-3 వాహనాల సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ.8000-8500, నాణ్యమైన ఫ్లవర్ రూ.380 మీడియం రూ. 2500-2700 ధరతో వ్యాపారమైంది. 


చింతగింజలు : ఉత్పాదక కేంద్రాల వద్ద చింతగింజల రాబడులు పెరుగుతున్నాయి. మరియు మార్చి 15 తరువాత రాబడులు మరింత వృ చెందే అవకాశం కలదని అదే విధంగా ధరలు మందగమనంలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్ మార్కెట్లో గత వారం 4-5 వాహనాల కొత్త చింతగింజల రాబడిపై ధర రూ. 1400-1450, పప్పు సూరత్ డెలివరి రూ.2600, బార్షీ డెలివరి రూ. 2500, పౌడర్ రూ.3500-3550, పుంగనూరులో చింతగింజలు రూ. 1400, పప్పు సూరత్ డెలివరి రూ. 2600, పౌడర్ రూ. 3800, సాలూరులో గత వారం 1-2 వాహనాల రాబడిపై చింతగింజలు రూ. 1200, పుంగనూరు డెలివరి రూ.1350, సిద్దిపేటలో చింతగింజలు రూ. 1400-1425, పప్పు రూ. 2500-2550, పౌడర్ రూ. 3700 మరియు కర్ణాటకలోని తుంకూరులో 1-2 వాహనాల రాబడిపై రూ. 1300–1350, చల్లాకేరేలో సంతరోజు 500-600 బస్తాల చింతగింజల రాబడిపై రూ. 1300–1350, బార్షీలో బేలాగాంవ్ సరుకు రూ. 1500, మహారాష్ట్ర లోకల్ సరుకు రూ. 1550 ప్రతి క్వింటాలు ధరతో డెలివరి వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog