వృద్ధిచెందిన మొక్కజొన్న ధరలు

 


కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 30-40 వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడి కాగా, స్థానికంగా రూ. 1900-2050, నామక్కల్, ఉడుమల్ పేటె డెలివరి రూ. 2200 ధరతో వ్యాపారమైంది. తమిళనాడు కల్లకుర్చి, తిరుకోవిలూరు, చిన్న సేలం, ఉలుండరుపేట, శంకరాపురం ప్రాంతాలలో ప్రతి రోజు 7-8 వేల బస్తాల రాబడిపై రూ. 1950-2000, ఈరోడ్, పొల్లాచి డెలివరి రూ. 2150-2200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, మడకశిర, కర్నూలు ప్రాంతాలలో ప్రతి రోజు 4–5 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై రూ. 1950–2000 మరియు ఈరోడ్, నామక్కల్, ఉడుమల్పేట్, బెంగుళూరు డెలివరి నాణ్యమైన సరుకు రూ. 2100-150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది.


విజయనగరం, సాలురు ప్రాంతాలలో 2-3 వాహనాల మొక్కజొన్న రాబడిపే రూ. 1800-1850, విజయనగరం డెలివరి రూ. 1950-2000 మరియు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్ ప్రాంతాలలో ప్రతి రోజు 10 వేల బస్తాల సరుకు రాబడిపై 1950-2015 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 



Comments

Popular posts from this blog