వన్నె తగ్గని పసుపు భవిష్యత్తు

 

మహారాష్ట్రలో పసుపు వెలికితీత ప్రక్రియ శరవేగంతో చేపడుతున్నారని వ్యాపారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో పంట దిగుబడులు గత ఏడాదితో పోలిస్తే తగ్గుతున్నట్లు సంకేతాలు అందుతున్నందున స్టాకిస్టులు తమ నిల్వ సరుకు అమ్మకాలను కుదిస్తున్నారు. కావున పసుపు భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండగలదని స్పష్టమవుతున్నది. అయితే, మార్చిలో రాబడులు పోటెత్తిన తరుణంలో ధరలు కొంతమేర దిగివచ్చే అవకాశం ఉంది. దేశంలో 2020 లో కరోనా మహమ్మారి విజృమ్భణ తరుణంలో పసుపు వినియోగం పెరిగినందున పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఒడిశ్శా, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ప్రతియేటా సేద్యం పరిధి విస్తరిస్తూనే ఉంది. గత వారం దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్లలో కలిసి కొత్త మరియు పాత పసుపు కలిసి 2 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అంచనాతో ధరలు ప్రత్యక్ష విపణిలో ప్రతి క్వింటాలుకు రూ.200-300 మరియు పరోక్ష విపణిలో రూ. 800-900 పతనమయ్యాయి. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 10,208 తో ప్రారంభమై శుక్రవారం వరకు రూ. 932 క్షీణించి 9276 మరియు మే వాయిదా రూ. 860 పతనమై రూ.90 వద్ద ముగిసింది.



తెలంగాణలోని నిజామాబాద్లో గత వారం 80-85 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు రూ.6000-8200, గోళా రకం రూ. 5500-6500, పాలిష్ కొమ్ములు రూ. 8400-8600, గోళా రూ. 7600-7700 మరియు 

మెట్పల్లిలో 18-20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నాణ్యమైన కొమ్ములు రూ. 7000-7400, మీడియం రూ. 4800-5000, నాణ్యమైన గోళా రకం రూ.6000-6300, మీడియం రూ. 4200-4500 మరియు 

వరంగల్లో 500-600 క్వింటాళ్ల కొత్త పసుపు రాబడి కాగా, కొమ్ములు, దుంపలు రూ.6000-6500, కేసముద్రంలో 200-250 బస్తాల రాబడిపై కొమ్ములు, దుంపలు రూ. 4000-6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాలలో 1800-2000 బస్తాల సరుకు రాబడిపె నాణ్యమైన కొమ్ములు, దుంపలు రూ. 6800-7200, పుచ్చు సరుకు రూ. 500-600 మరియు కడప ప్రాంతపు కొమ్ములు, దుంపలు రూ. 6500-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని హింగోలిలో గత సోమ, గురువారాలలో కలిసి 400-500 బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 7800-8200, దుంపలు రూ. 7000–7200 మరియు 2500-3000 బస్తాల పాత సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ. 7500-8400, దుంపలు రూ. 6800–7300, 

సాంగ్లీలో గత వారం 30-35 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రాజాపురి నాణ్యమైన సరుకు రూ. 9000- 10,500, మీడియం రూ. 8200-8700, దేశీ కడప రూ. 8500-8600, 

నాందేడ్లో 700-800 బస్తాల సరుకు అమ్మకంపైకొమ్ములు, దుంపలు రూ. 7500-8500 మరియు 5-6 వేల బస్తాల పాత సరుకు రాబడిపై కొమ్ములు రూ. 7500-8500, మీడియం రూ. 7300-8000, దుంపలు రూ.7000-7400, 

బస్మత్నగర్లో 5-6 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 7200-8300, దుంపలు రూ. 7000–7600, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 తమిళనాడులోని ఈరోడ్లో గత వారం సుమారు 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై మెసూరు ప్రాంతపు కొమ్ములు, దుంపలు రూ. 6000-7800 మరియు 24-25 వేల బస్తాల పాత సరుకు రాబడిపై కొమ్ములు రూ. 7200-7800, మీడియం రూ.400-5000, దుంపలు రూ.6500- 7300, పుచ్చు రకం కొమ్ములు, దుంపలు రూ. 3500-3800, పేరుందరైలో 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6359-8269, దుంపలు రూ. 5501-7769 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog