యాలకులు

 


 దక్షిణ భారత వేలం కేంద్రాల వద్ద గత సోమవారం శనివారం 5,26,033 కిలోల యాలకులు రాబడి కాగా, 5,12,485 కిలోల సరుకు విక్రయించబడింది. ఇందులో ప్రతి కిలో కనిష్ఠ ధర రూ. 845, గరిష్ఠ ధర రూ. 971 ధరతో వ్యాపారమైంది. ప్రతి వారం ఎడతెరిపి లేకుండా 5 లక్షల కిలోల సరుకు రాబడి అవుతున్నది. ఇందులో చిన్నతరహా రైతుల సరుకే అధికంగా ఉండగా, దిగ్గజ రైతులు ధరల వృద్ధిని నిరీక్షిస్తున్నారు.


 అయితే ధరలు తక్కువగా ఉన్నందున మరియు కరోనా మహమ్మారి విజృంభణకు చరమాంకంలో పడినందున ఇప్పుడిప్పుడే వినియోగం ఇనుమడిస్తోంది. అయితే, వినియోగానికి అనుగుణంగా సరుకు రాబడి అవుతున్నందున ధరలు ఆశించిన స్థాయికి ఎదగడంలేదు. రాబోయే సీజన్ ప్రారంభం నాటికి ఎడతెరిపి లేకుండా సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు. పెద్ద యాలకులు : తూర్పు భారత వేలం కేంద్రాల వద్ద వారాంతపు వేలాలలో ప్రతి గురువారం చేపట్టబడుతున్నాయి. లో ఫిబ్రవరి 2న సిక్కింలోని గాంగ్టక్లో పెద్ద యాలకుల వేలాలలో పెద్ద గింజ సరుకు ధర క్రితం వారం రూ.662.50 కు గాను పెరిగి 676.25, చిన్న గింజ సరుకు రూ. 612.50 నుండి పెరిగి రూ. 625 ప్రతి కిలోకు చేరింది. గాంగ్టక్లో పెద్ద గింజ సరుకు రూ. 675, చిన్నగింజ రూ. 575 వద్ద స్థిరపడింది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పెద్దగింజ రూ. 775 నుండి తగ్గి రూ. 772.50, చిన్నగింజ రూ. 662.50 నుండి పెరిగి రూ. 633.80, ధరతో అమ్మకమైంది.

Comments

Popular posts from this blog