రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దూసుకెళ్తున్న వంటనూనెల ధరలు

 


 ఉక్రెయిన్ నుండి విశాఖపట్నంకు వార్షికంగా 10 ల.ట. సన్ఫ్లవర్నూనె దిగుమతి అవుతున్నట్లు ఓడరేవు అధికారులు పేర్కొన్నారు. దిగుమతి అయిన నూనె కాకినాడ మరియు విజయవాడతో పాటు పలు ప్రాంతాల రిఫైనరీలకు రవాణా చేయబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుండి సుమారు 4.40 ల.ట. సన్ఫ్లవర్ నూనె విశాఖపట్నం ఓడరేవుకు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, గురువారం ఉక్రెయిన్పై దాడి ప్రారంభం అయిన వెంటనే ధరలు నింగికి ఎగిసిపడుతున్నాయి. ఎందుకనగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ నుండి సరఫరా నిలిచిపోవడమే కాకుండా షిప్మెంట్లు ఆలస్యమవుతున్నాయి.


యుద్ధం ప్రారంభమైందన్న సమాచారం అందిన వెంటనే రిటైల్ మార్కెట్లో రిఫైండ్ సన్ఫ్లవర్ నూనె ధర ఒక్క రోజులో రూ. 145 నుండి పెరిగి రూ.162 కు ఎగబాకిందని కేంద్ర వినియోగదారుల సంబంధిత మంత్రిత్వ శాఖలోని ధరల నిఘా విభాగం పేర్కొన్నది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్లో దూసుకెళ్తున్న వంటనూనెల ధరలు

మసాలాల వాయిదా కొనుగోలుదారుల ఆశలు అడియాశలు

  ప్రపంచంలో అతిపెద్ద సన్ఫ్లవర్ నూనె సరఫరాదారైన రష్యా -ఉక్రయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధంతో సన్ఫ్లవర్ నూనె సరఫరాకు అంతరాయం ఏర్పడే అంచనాతో మలేషియా పామాయిల్ ధరలు నింగికి ఇనుమడించినందున భారత వంటనూనెల మార్కెట్లో వేడి రాజుకున్నది. ఈ యుద్ధం వలన ఎందరో కలవరపాటుకు గురవతుండగా స్టాకిస్టులు మాత్రం పండుగ జరుపుకుంటున్నారు.


మలేషియా డెరివేటివ్ ఎక్స్చేంజి వద్ద ఫిబ్రవరి 23న తొలిసారి పామాయిల్ వాయిదా ధర 6000 రింగిట్ (1433.52 డాలర్) ప్రతి టన్ను అధిగమించింది. దక్షిణ అమెరికా దేశాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున సోయాచిక్కుడు పంటకు నష్టం వాటిల్లింది. ఫలితంగా ఫిబ్రవరి 22న చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ (సిబిఒటి) వద్ద సోయానూనె వాయిదా ధర సుమారు 3 శాతం వృద్ధి చెంది ప్రతి పౌండు (450 గ్రాములు) 70 సెంట్లకు చేరింది.

భారతదేశం నుండి ఎగుమతి అయ్యే మసాలా శ్రేణిలోని పసుపు, ధనియాలు, జీలకర్ర, గ్వార్గమ్ లాంటి సరుకు వాయిదా మార్కెట్లో క్రితం రోజు కొనుగోలుదారులు మరియు శేర్మార్కెట్ వ్యాపారం కుదేలైనందున భారీ నష్టాలు మూటగట్టుకున్నారు. అయితే, బంగారం, వెండి మరియు రాగి ధరలు ఇనుమడిస్తున్నాయి.


కాఫీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ నుండి ఎగుమతి వ్యాపారం ప్రశ్నార్థకమైంది. ఎందుకనగా, కాఫీ దిగుమతిలో రష్యా అతిపెద్ద నాలుగో దేశంగా ప్రసిద్ధి గాంచింది. 15 ప్రముఖ కాఫీ దిగుమతి దేశాలలో ఉక్రెయిన్ కూడా ఉంది. ఇరు దేశాల దిగుమతి వ్యాపారులు ప్రస్తుతం సరుకు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog