బొబ్బర్లు, ఉలువలు,రాగులు

 

బొబ్బర్లు (లోబియా) - ప్రకాశం జిల్లాలోని పొదిలి ప్రాంతంలో ప్రతిరోజు 500-600 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 4800 మరియు గొట్లగట్టులో 1000 కొత్త సరుకు రాబడిపై రూ. 4700-4800 ధరతో వ్యాపారమె మహారాష్ట్ర కోసం రవాణా అవుతోంది. కడప జిల్లాలోని రాయచోటిలో 2-3 వాహనాల రాబడిపై నలుపు రకం బొబ్బర్లు రూ. 5400, ఒంగోలులోని తెలుపు రకం సరుకు రూ.4600, ఎరుపు మిక్స్ రకం రూ. 6400 ధరతో వ్యాపారమెంది.



తెలంగాణలోని సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 100-150 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 1000-00 క్వాలిటీ ప్రకారం మరియు కర్ణాటకలోని మెసూరు, బళ్లారి,హగరిబమ్మనహళ్లి, చిత్రదుర్గ్, దావణగిరి ప్రాంతాలలో ప్రతి రోజు 1000-1500 బస్తాల బొబ్బర్ల రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6600-6700, డెమేజ్ సరుకు రూ. 6400-6500 ధరతో వ్యాపారమెంది.

 ఉలువలు (కుల్తి) - మెసూరులో ప్రస్తుతం ఉలువల రాబడులు క్షీణిస్తుండగా, దినసరి 4–5 వాహనాల రాబడి కాగా రూ. 3700-3850, మీడియం రూ. 3600-3700 ధరతో వ్యాపారమైంది. కాగా సుమారు 50 శాతం సరుకు శీతలగిడ్డంగులలో నిల్వ కోసం చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.బళ్లారిలో 200-300 బస్తాల ఉలువల రాబడిపై రూ. 3600-3700 ధరతరో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో గత వారం 4-5 వాహనాల కొత్త ఉలువల రాబడిపై స్థానికంగా రూ.3600-3700, విజయవాడ డెలివరి రూ. 4000 ధరతో వ్యాపారమెంది.


కదిరి, అనంతపురం, తాడిపత్రి లాంటి ఉలువల ఉత్పాదక ప్రాంతాలలో 2-3 వాహనాల సరుకు రాబడి కాగా, స్థానికంగా రూ. 3650–3700 ధరతో వ్యాపారమె ఒంగోలు ప్రాంతం కోసం రవాణా అవుతున్నది. మరియు విజయనగరంలో దినసరి 3-4 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, తెలుపు రకం రూ. 3600, నలుపు రకం రూ. 4000-4100 ధరతో వ్యాపారమై తాడెపల్లిగూడెం కోసం ఎగుమతి అవుతున్నది. సాలూరు, చీపురుపల్లి ప్రాంతాల మార్కెట్లలో గత వారం తెలుపు సరుకు రూ. 3300, నలుపు రకం రూ. 4200 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.


రాగులు (రాగి) - మహబూబ్నగర్ గతవారం 3-4 వాహనాల రాగులు రాబడి కాగా రూ. 3400-3500 మరియు విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో నిల్వ చేసిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ. 2900-3000, విజయనగరంలో 1-2 వాహనాల రాగుల రాబడి కాగా రూ.2900-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



Comments

Popular posts from this blog