పత్తి ఉత్పత్తి తగ్గే అంచనా

 


 ఈ ఏడాది పత్తి ఉత్పత్తి 5 లక్షల బేళ్లు తగ్గి 343.13 లక్షల బేళ్లు (ప్రతి బేలు 170 కిలోలు ఉండగలదనే అంచనా వ్యక్తమవుతున్నదని భారత పత్తి సమాఖ్య (సిఎఐ) పేర్కొన్నది. దిగుమతులు 5 లక్షల బేళ్లు పెరిగి 15 లక్షల బేళ్లు, ఎగుమతులు గత ఏడాది 78 లక్షల బేళకు గాను 45 లక్షల బేళ్లకు పరిమితం కాగలవని సిఎఐ తెలిపింది. ప్రస్తుత సీజన్లోని మొదటి నాలుగు నెలలు అనగా 2021 అక్టోబర్-2022 జనవరి మధ్యకాలంలో దేశంలో పత్తి మొత్తం 272.20 బేళ్లు సరఫరా అయింది. ఇందులో కొత్త సరుకు192.20 లక్షల బేళ్లు, దిగుమతి అయిన సరుకు 5 లక్షల బేళ్లు ఉన్నాయని సిఎఐ పేర్కొన్నది.


ప్రస్తుత సీజన్లో అక్టోబర్- జనవరి మధ్యకాలంలో పత్తి దేశీయ వినియోగం 14 లక్షల బేళ్లు, ఎగుమతులు 25 లక్షల బేళ్లకు చేరాయి. జనవరి చివరన పత్తి నిల్వలు 133.20 లక్షల బేళ్లు అందుబాటులో ఉండగా, ఇందులో వస్త్ర మిల్లుల వద్ద 75 లక్షల బేళ్లు మిగిలిన 58.20 లక్షల బేళ్లు భారత పత్తి సంస్థ (సిసిఐ) వద్ద ఉన్నాయి. మహారాష్ట్ర పత్తి సమాఖ్య మరియు ఎంఎస్సి, జిన్నర్స్, వ్యాపారులు మరియు ఎంసిఎం లాంటి ట్రేడింగ్ హౌస్ల వద్ద ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో పత్తి మొత్తం వినియోగం 340 లక్షల బేళ్లు ఉండగలదని భావిస్తున్నారు. సీజన్ తుది దశలో అనగా 2022 సెప్టెంబర్ 30 వరకు మిగులు నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 75 లక్షల బేళ్ల నుండి తగ్గి 48.13 లక్షల బేళ్లకు పరిమితం కాగలవనే అంచనా వ్యక్తమవుతున్నది. కావున రాబోయే సీజన్ ప్రారంభం నుండి ధరలు రూ. 1000-1500 ఇనుమడించగలవని వ్యాపారులు భావిస్తున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో 29 ఎంఎం పింజ ప్రతి కండీ రూ. 79,000 – 80,000 మరియు ప్రతి క్వింటాలు రూ. 9300-9450, పత్తి గింజలు రూ. 3600-3700, ఖమ్మంలో నాణ్యమైన పత్తి రూ. 9850, మీడియం రూ. 9000-9500 ప్రతి క్వింటాలు మరియు వరంగల్లో 29 ఎంఎం పింజ ప్రతి కండీ రూ. 79,000-80,000, ఆదోనిలో రూ. 80,000-81,000, ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరులో రూ. 79,000-80,000, ఆదోని మార్కెట్లో రూ. 80,000–81,000 మరియు ప్రతి క్వింటాలు రూ. 8500-10,400 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog