రాబడులు తారా స్థాయికి చేరినప్పటికీ, దిగిరాని మిరప ధరలు

 



ఈ సారి మిరప ఉత్పాదకులకు సీజన్ మొత్తంలో ఆకర్షణీయమైన ధరలు లభిస్తున్నాయి. తద్వారా గుంటూరులో దినసరి సుమారు 1 లక్ష బస్తాలను మించి సరుకు రాబడులు కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా వ్యాపారులు రైతుల సరుకు కొనుగోలు చేసిన వెంటనే అమ్మకం చేస్తున్నారు. అయితే తగ్గిన ఉత్పత్తిని పరిగణిస్తే మిరప భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకనగా దేశంలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో సుమారు 15 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, మొత్తం సరుకు అమ్మకం అవుతోంది. ఇందులో కొందరు రెత్తుల సరుకు మార్కెట్లలోకి బదులుగా సరాసరి ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది.



గుంటూరు మిర్చి యార్డులో గత వారం కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం, భద్రాచలం నుండి 4.60 బస్తాల కొత్త మిర్చి కాగా 4.50 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో డిడి రూ. 3000, 341, అన్ని మీడియం, మీడియం బెస్ట్ సీడ్ రకాలలో రూ. 1500 మరియు 273 రకం రూ. 1000, ఆర్మూరు రూ. 500 ప్రతి క్వింటాలు తగ్గాయి. కాగా తేజ డీలక్స్ రూ. 1000, సింజెంటా బడిగ రూ. 300, నెంబర్-5 మరియు 2043 రకం, 334, సూపర్-10 మరియు 577 రకాలలో రూ. 500, తేజ తాలు రూ. 800 ప్రతి క్వింటాలుకు వృద్ధిచెందగా, మిగిలిన రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. 

గుంటూరులో నాణ్యమైన తేజ కొత్త సరుకు రూ. 15,000-17,800, డీలక్స్ రూ. 17,900–18,000, ఎక్స్ట్రా ఆర్డినరి రూ. 18,100-18,200, మీడియం రూ. 14,000–14,900, 355-బడిగ రూ. 16,000-20,000, డీలక్స్ రూ. 20,200-20,500, సింజెంట బడిగ రూ. 15,000-20,500, డీలక్స్ రూ. 20,600-20,800, డిడి నాణ్యమైన సరుకు రూ. 16,000–18,500, ఎక్స్ ట్రా ఆర్డినరి రూ. 18,600-19,000, 341 రకం రూ. 16,000-20,500, డీలక్స్ రూ. 20,600-21,000, 2043 రకం రూ. 16,000-23,000, డీలక్స్ రూ. 23,200-23,500, బుల్లెట్ రకం రూ. 13,000-15,000, డిలక్స్ రూ. 15,200-15,500, నెంబర్-5 రకం రూ. 16,000-20,000, డీలక్స్ రూ. 20,200-20,500, 334, సూపర్-10 రకం రూ. 14,000-17,500, డీలక్స్ రూ. 17,600-18,000, 4884 రకం రూ. 12,500-15,500, 273 రకం రూ. 15,000–19,000, బంగారం రూ. 14,000–17,000, ఆర్మూరు రకం రూ. 13,500-15,500, రోమి రకం రూ. 12,500-15,500, డీలక్స్ రూ. 15,600-15,800, 577 రకం రూ. 13,500-18,000, అన్ని మీడియం బెస్ట్ సీడ్ రకాలు రూ. 14,000-15,800, తాలు కాయలు తేజ రూ. 9500-10,500, డీలక్స్ లాల్కట్ రూ. 10,600-11,500, తాలు రూ. 3500-8000, డిడి, 341 తాలు రకాలు రూ. 8500-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుంటూరులో AC ల నుండి ఈ వారంలో 75 వేల బస్తాల సరుకు రాబడిపై 70 వేల బస్తాల సరుకు అమ్మకం అయింది. అయితే తేజ డీలక్స్ రూ. 1000, సూపర్-10, 334 రకాలలో రూ. 300 వృద్ధిచెందగా, మిగిలిన రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం తేజ, 334 డీలక్స్ రకాలకు మంచి గిరాకీ నెలకొన్నది. గుంటూరు ఎసిలలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రూ. 14,000–17,500, డీలక్స్ రూ. 17,600-18,000, సింజెంట బడిగ రూ. 14,000–18,000, 341, సూపర్-10 రకాలు రూ.14,000-17,000, డీలక్స్ రూ. 17,100-17,200, మీడియం బెస్ట్ రూ. 12,500-13,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని వరంగల్లో గత వారం సోమ, మంగళ వారాలలో కలిసి 1 లక్ష 95 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 15,000–18,050, 341 రూ. 18,000-22,200, వండర్ హాట్ రూ. 17,000-21,000, టమాటా రకం రూ. 25,000-28,500, 1048 రకం రూ. 15,000-17,300, దీపిక రకం రూ.17,000-18,500, 334 రకం రూ. 15,000-17,350, తాలు కాయలు తేజ రూ. 7000-10,000, 341 తాలు రూ. 7000-8000 ధరతో


ఖమ్మంలో గత వారం సుమారు 1.45 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 19,000, మీడియం రూ. 18,000-18,500, నాణ్యమైన తాలు కాయలు రూ. 11,000 మరియు 8-10 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై తేజ రూ. 18,500, తాలు కాయలు రూ. 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో గత వారం 35-40 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 17,200-17,500, మీడియం రూ.10,000-17,000, నాణ్యమైన డబ్బి బ్యాడిగ రూ. 30,000-32,000, మీడియం రూ. 26,000-27,000, బ్యాడిగ రకం రూ. 20,000-24,000, 273 మీడియం బెస్ట్ రూ. 14,000-18,000, నాణ్యమైన సూపర్-10 రకం రూ. 17,000, మీడియం రూ. 12,000-16,500, నాణ్యమైన 341, సింజెంట రకం సరుకు రూ. 20,000, మీడియం రూ. 16,000-18,000, డిడి రూ. 21,000, సి-5 రకం రూ. 15,000-19,000, నాణ్యమైన తేజ తాలు కాయలు రూ. 9000-10,000, మీడియం రూ.5000-7500, తాలు రూ. 5500-6000, హెబ్రిడ్ తాలు రూ. 4000-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బ్యాడ్గీలో  సోమ మరియు గురువారాలలో కలిసి 4.05 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బి డీలక్స్ రూ. 34,000-38,500, నాణ్యమైన డబ్బి రూ. 30,000-34,000, కెడిఎల్ డీలక్స్ రూ.26,000-31,500, నాణ్యమైన కెడిఎల్ రూ.23,000-26,000, మీడియం రూ. 10,000–14,000 మరియు 2043 డీలక్స్ రకం రూ.22,000-26,000, మీడియం రూ. 18,000-22,000, నాణ్యమైన 5531 రకం రూ. 14,000-18,000, మీడియం రూ.12,000-14,000, డిడి రూ. 16,000-20,000, 355 రకం రూ. 15,000–18,000, 334, సూపర్-10 రకం రూ. 13,000-17,000, కెడిఎల్ తాలు కాయలు రూ.2200-2800, సీడ్ తాలు రూ. 6000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


సింధనూర్ మంగళవారం 17-18 వేల బస్తాల మిర్చి రాబడిపై డబ్బి రకం రూ. 35,000-40,000, బడిగ రూ. 24,000-32,000, సింజెంట బడిగ రూ. 22,000-28,000, 5531 రకం రూ. 19,000-21,000, జిటి, సూపర్-10 రూ. 14,000–18,000, తాలు కాయలు రూ. 2000-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని బేడియాలో గత బుధ, గురువారాలలో కలిసి 25-27 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై మహి ఫుల్ కట్ రూ. 13,500-16,000, తొడిమెతో కూడిన సరుకు రూ. 11,000-13,500, లాల్కట్ రూ. 9000-11,000, మీడియం రూ. 8500-9000, ఫుల్కట్ తాలు కాయలు రూ. 9000-10,000, మహి తొడిమతో కూడిన తాలు రూ. 8000-9000 మరియు ధామనోద్లో శుక్రవారం 18-20 వేల బస్తాల సరుకు రాబడిపై మహి తొడిమెతీసిన సరుకు రూ. 14,000-16,000, తొడిమెతో కూడిన రూ. 13,500-15,000, 720 రకం తొడిమెతీసిన సరుకు రూ.16,000-18,000, తొడిమెతో రూ. 15,000–16,000, సన్న రకం తాలు రూ.7500-8500, తాలు కాయలు దొడ్డు రకం రూ.5500-6500 మరియు ఇండోర్లో దినసరి 1500–2000 బస్తాల కొత్త సరుకు రాబడిపై తొడిమ తీసిన సరుకు 13,000-15,000 a. తొడిమెతో రూ. 12,500-14,000, మీడియం రూ. 9000-11,500, తాలు కాయలు రూ. 7500-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో దినసరి 1800-2000 బస్తాల సరుకు రాబడిపై తేజ మరియు సన్-గ్రో రూ. 17,000-17,500, 4884 రూ. 15,000-16,000, తాలు కాయలు తేజ రూ. 9000-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog